పేద, మధ్యతరగతి వారి స్కూటర్.. రోజువారి అవసరాలకు దిగులు అవసరం లేదు.. 57 కి.మీల మైలేజ్.. ధర తక్కువే

ప్రజలు తమ రోజువారి ప్రయాణాల కోసం కచ్చితంగా టూవీలర్స్‌ను వాడుతుంటారు. ముఖ్యంగా బైక్స్‌లతో పోలిస్తే స్కూటర్ల వాడకం ఇటీవల కాలంలో క్రమంగా పెరుగుతుంది. ప్రధానంగా రద్దీగా ఉంటే నగర రోడ్లపై వెళ్లడానికి స్కూటీలు చాలా అనువుగా ఉంటాయి. మహిళలతో పాటు, పురుషులు కూడా వీటిని డ్రైవింగ్ చేయవచ్చు. ప్రస్తుతం మార్కెట్లోకి అదిరిపోయే బైక్స్‌తో పాటే అధునాతన కలర్ డిజైన్లు, ఫీచర్లతో స్కూటర్లు కూడా లాంచ్ అవుతున్నాయి. చాలా కాలంగా స్కూటర్ల విభాగంలో హోండా (HONDA) కంపెనీ మెరుగైన అమ్మకాలను సాధిస్తుంది. యాక్టివా మోడల్ ఇండియాలో మంచి డిమాండ్ ఉన్న స్కూటర్. అయితే దీనికి గట్టి పోటీ నిస్తూ దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్న ఒక మోడల్ ఉంది. అదే ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ టీవీఎస్‌ (TVS)కు చెందిన జూపిటర్ 125 (jupiter 125). ఈ స్కూటర్ గురించిన పూర్తి వివరాలు క్రింది కథనంలో తెలుసుకోండి.

జూపిటర్ 125 ఇంజిన్: ఇది 124.8 cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. శక్తివంతమైన ఇంజిన్ పనితీరు కూడా మెరుగ్గానే ఉంటుంది. 6500 rpm వద్ద 8.2 PS హార్స్ పవర్, 4500 rpm వద్ద 10.5 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రోజువారీ ఆఫీసులకు వెళ్లడానికి ఈ స్కూటర్ బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది. లీటర్ పెట్రోల్‌కు 57.27 కి.మీల మైలేజ్ ఇస్తుంది.

Tvs Jupiter 125 Scooter Price Mileage And Features

ఫీచర్లు: ఇండియాలో భారీ డిమాండ్ ఉన్న స్కూటర్లలో ఈ మోడల్ కూడా ఒకటి ఇది ఆకర్షణీయమైన అనేక ఫీచర్లను కలిగి ఉంది. USB ఛార్జర్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, పూర్తి-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, LED టెయిల్ ల్యాంప్, LED హెడ్‌ల్యాంప్, వాయిస్ అసిస్ట్, టాప్-స్పెక్ వేరియంట్‌‌లో బ్లూటూత్ కనెక్టివిటీ, ఫ్రంట్-మౌంటెడ్ ఎక్స్‌టర్నల్ ఫ్యూయల్ ఫిల్లర్, కీ షట్టర్ ఆప్షన్ వంటి పలు అధునాతన ఫీచర్స్ ఈ స్కూటర్‌లో ఉన్నాయి.

ధర: టీవీఎస్‌ జూపిటర్ 125 వినియోగదారుకు మూడు వేరియంట్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. డ్రమ్, డిస్క్, చివరగా స్మార్ట్ కనెక్ట్ అనే వేరియంట్లలో ఆకర్షీణయమైన డిజైన్‌లను కలిగి ఉంది. బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ.89,396 నుంచి మొదలవుతుంది. అదే టాప్ వేరియంట్ ధర రూ.99,805 వరకు ఉంది. ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలు. జూపిటర్ 125 ఇండిబ్లూ, ప్రిస్టైన్ వైట్, టైటానియం గ్రే, డాన్ ఆరెంజ్ కలర్స్‌లలో లభిస్తుంది.

Tvs Jupiter 125 Scooter Price Mileage

సస్పెన్షన్: హోండా యాక్టివాకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి ఈ స్కూటర్‌లో మెరుగైన సస్పెన్షన్ సెటప్ ఉంది. ముందు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక గ్యాస్-ఛార్జ్డ్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్‌ను అమర్చారు. గుంతలు ఉన్న రోడ్లపై కూడా ప్రయాణించేటప్పుడు ఎలాంటి ఎగుడు దిగుడు లేకుండా సాఫీగా వెళ్లడానికి ఈ సెటప్ బాగా ఉపయోగపడుతుంది. రైడర్లకు మరింత రక్షణ అందించడానికి డ్రమ్/డిస్క్ బ్రేక్‌ సెటప్ ఉంటుంది. స్మార్ట్ కనెక్ట్‌లో ముందువైపు డిస్క్, వెనుక డ్రమ్ ఉన్నాయి.

ఇతర ఫీచర్స్: టీవీఎస్‌ జూపిటర్ 125లో ఎక్కువ లగేజీని తీసుకెళ్లడానికి 33-లీటర్ అండర్ సీట్ స్టోరేజీని కలిగి ఉంది. ఫ్యూయల్ ట్యాంక్‌ కెపాసిటి 5.1 లీటర్లు, ఇది 12-అంగుళాల అల్లాయ్ వీల్స్, రెండు చివర్లలో 90/90-12 ట్యూబ్‌లెస్ టైర్లను కలిగి ఉంది. ఈ స్కూటర్ బరువు 108 కిలోలు. గ్రౌండ్ క్లియరెన్స్ 163mmగా ఉంటుంది. LCD స్క్రీన్‌తో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌‌లో ట్రిప్ మీటర్, స్పీడోమీటర్, ఓడోమీటర్ వంటివి ఉన్నాయి.

Tvs Jupiter 125 Scooter Price

టీవీఎస్‌ జూపిటర్ 125 దేశంలోనే పేదవారు, మధ్యతరగతి వారికి చాలా అనువుగా ఉంటుంది. తక్కువ ధరలో లభిస్తూ, టూవీలర్ కలిగి ఉండాలనే కోరికను జూపిటర్ తీరుస్తుంది. ఇండియాలో ఇది హోండా యాక్టివా 125 , సుజుకి యాక్సెస్ 125 వంటి ఫ్యామిలీ స్కూటర్లకు గట్టి పోటీ ఇస్తోంది.

More from DriveSpark

Article Published On: Sunday, January 12, 2025, 11:30 [IST]
English summary
Tvs jupiter 125 scooter best for daily uses here price mileage and features
Read more on: #tvs #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+