Jupiter CNG Scooter : ప్రపంచంలోనే మొట్టమొదటి CNG స్కూటర్ వచ్చేస్తుంది.. 226 కిమీ మైలేజీ పక్కా!
Auto Expo 2025: టీవీఎస్ జూపిటర్ సీఎన్‌జీ స్కూటర్ (TVS Jupiter CNG Scooter)ని ఆ సంస్థ భారత్ మొబిలిటీ ఆటో ఎక్స్‌పో 2025లో ఆవిష్కరించింది. ఈ స్కూటర్ కేవలం కాన్సెప్ట్ మోడల్‌గా ప్రదర్శించినప్పటికీ ప్రపంచంలోనే ఇదే మొట్టమొదటి సీఎన్‌జీ స్కూటర్ కావడం విశేషం. దీని విడుదలపై కంపెనీ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. గత ఏడాది భారతీయ మార్కెట్‌లో బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ మోటార్‌సైకిల్‌ని లాంచ్ చేసింది. దీనికి ఆటోమోబైల్ ఔత్సాహికుల నుంచి భారీ స్పందన లభించింది. ఇది సేల్స్‌లోనూ ఇతర సంప్రదాయ టూవీలర్స్‌తో పోటీగా దూసుకెళ్తుంది. ఇప్పుడు స్కూటర్లలో జూపిటర్ రాకతో మరో టూవీలర్ అందుబాటులోకి వచ్చేస్తుంది. దీని వివరాలపై ఓ లుక్కేయండి.
ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ స్కూటర్ కావడం విశేషం. ఇది 1.4 కిమీ సీఎన్‌జీ కిట్‌తో రానుంది. ఈ స్కూటర్‌లో భారీ అండర్ సీట్ స్టోరేజీ, ఇతర ప్లేస్‌మెంట్ కూడా నీట్‌గా ఉంది. ఇక ఇందులోని ట్యాంక్‌ని ప్లాస్టిక్ ప్యానెల్‌తో టీవీఎస్ కవర్ చేసింది. ప్రెజర్ గేజ్ చూపించడానికి చుట్టూ ఫిల్లర్ నాజిల్ ఉన్నాయి. ఈ సీఎన్‌జీ స్కూటర్ కిలో సీఎన్‌జీకి 84 కిలోమీటర్లు దూరం ప్రయాణించగలదని టీవీఎస్ పేర్కొంది.

ఇక ఈ స్కూటర్ ఫ్లోర్ బోర్డ్ మౌంట్‌లో 2-లీటర్ పెట్రోల్ ట్యాంక్ కూడా కలదు. ముందు ఆప్రాన్ ప్రాంతంలో ఫిల్లర్ నాజిల్‌ని అందించారు. పెట్రోల్ ప్లస్ సీఎన్‌జీ మోడ్‌లో ఈ టీవీఎస్ 226 కిలోమీటర్ల భారీ మైలేజీని అందిస్తుంది. దీనివల్ల ఎక్కువ మంది కస్టమర్లు ఈ స్కూటర్‌ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్ స్కూటర్లకు (Electric Scooters) సైతం గట్టి పోటీని ఇవ్వగలదు.
కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం జూపిటర్ సీఎన్‌జీ (TVS Jupiter) 124.8 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 6,000 rpm వద్ద 7.1 bhpని అలాగే 5,500 rpm వద్ద 9.4 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని టీవీఎస్ తెలిపింది. అంటే ఫర్ఫామెన్స్ లోనూ ఈ స్కూటర్ తిరుగులేదని నిరూపించనుంది.
ఈ స్కూటర్ 125 ICE డిజైన్ వలె ఉంటుంది. ఇందులోని ఎర్గోనామిక్స్, ఫీచర్లు, వీల్స్, బ్రేక్స్ అంచ్చం టీవీఎస్ ICE జూపిటర్ వెర్షన్ వలె ఉన్నాయి. అయితే ఈ జూపిటర్ 125 సీఎన్‌జీ కాన్సెప్ట్ దశలో ఉందని టీవీఎస్ తెలిపింది. భారతదేశంలో ఇది ఎప్పుడు లాంచ్ అవుతుందనే దానిపై ఎటువంటి సమాచారం లేదు. దీని ఉత్పత్తి ఇతర వివరాలను కంపెనీ త్వరలోనే వెల్లడించనుంది.
ఈ స్కూటర్ మార్కెట్‌లోకి వస్తే డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికిల్స్‌పై జనాలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే క్రమంలో సీఎన్‌జీ వెహికిల్స్‌పై కూడా జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందువల్ల దీనికి డిమాండ్ ఊహించని విధంగా ఉంటుందని ఆటోమోబైల్ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే సీఎన్‌జీ ధర కూడా దాదాపు పెట్రోల్‌కి సరిసమానంగా ఉండటం.. దీని పికప్ తక్కువ అవ్వడం వల్ల కాస్త వెనుకడుకు వేసే అవకాశం లేకపోదు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








