ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే 226కి.మీ మైలేజీ.. త్వరలో మార్కెట్లోకి టీవీఎస్ జూపిటర్ సీఎన్జీ.. ధర, ఫీచర్స్ ఇవే ?

టూ వీలర్ మార్కెట్లో టీవీఎస్(TVS) కంపెనీ తనదైన ముద్ర వేసిన సంగతి తెలిసిందే. కంపెనీ భారత మార్కెట్లో పెద్ద ఎత్తున వివిధ మోటార్ సైకిళ్లు, స్కూటర్లను విక్రయిస్తుంది. కస్టమర్లను ఆకర్షించే డిజైన్లు, ఫీచర్లతో వస్తున్నాయి. కాలానికి అనుగుణంగా, కస్టమర్ల అభిరుచులకు తగ్గట్లు బైకులు, స్కూటర్లను మార్కెట్లోకి తీసుకొస్తుంది టీవీఎస్ కంపెనీ. అందుకే టూ వీలర్ మార్కెట్లో టీవీఎస్ వేగంగా పురోగతి సాధిస్తోంది. ఈ కంపెనీ దేశీయ మార్కెట్లో విక్రయించే స్కూటర్లలో జూపిటర్ మోస్ట్ పాపులర్ అన్న సంగతి తెలిసిందే.

దీనిని కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తిని కనబరుస్తున్నారు. ప్రస్తుతం కంపెనీ ఈ స్కూటర్‎ను CNG పవర్‌ట్రెయిన్ ఆఫ్షన్ తో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. టీవీఎస్ జూపిటర్ సీఎన్జీ స్కూటర్ ను భారత్ మొబిలిటీ ఆటో ఎక్స్‌పో 2025లో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. కేవలం కాన్సెప్ట్ మోడల్‌గానే అప్పుడు ప్రదర్శించింది. దీని విడుదలపై కంపెనీ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఈ ఏడాది కచ్చితంగా మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది.

TVS Jupiter CNG Scooter Side

గతేడాది భారత మార్కెట్లోకి బజాజ్‌ ఫ్రీడమ్‌ సీఎన్జీ మోటార్‌సైకిల్‌ని లాంచ్ చేసింది. దీనికి వినియోగదారుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఇది సేల్స్‌లో దుమ్ములేపుతోంది. పెట్రోల్ బైకులను ధీటుగా దూసుకెళ్తుంది. ఇప్పుడు స్కూటర్లలో జూపిటర్‌ రాకతో మరో టూవీలర్‌ సీఎన్జీ ఆఫ్షన్ తో అందుబాటులోకి రాబోతుంది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి CNG స్కూటర్‌గా నిలువనుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ టీవీఎస్ జూపిటర్ సీఎన్జీని కొద్ది రోజుల్లోనే మార్కెట్లో చూడవచ్చు.

ఈ టీవీఎస్ జూపిటర్ సీఎన్జీ స్కూటర్ చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. దీని ఎక్స్ షోరూం ధర రూ.90,000 నుంచి రూ.లక్ష మధ్య ఉంటుందని అంచనా. ఈ స్కూటర్ ఈ ఏడాది అక్టోబర్‌లో అమ్మకానికి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ టీవీఎస్ జూపిటర్ సీఎన్జీ పవర్ ఫుల్ 124.8 cc సింగిల్-సిలిండర్ ఇంజన్ ఆఫ్షన్ కలిగి ఉంటుంది.

TVS Jupiter CNG Scooter Switch

జూపిటర్ సీఎన్జీ స్కూటర్ 2-లీటర్ పెట్రోల్ , 1.4-కిలోల కెపాసిటీ గల సీఎన్జీ ఫ్యూయల్ ట్యాంక్ ఆఫ్షన్ తో వస్తుంది. ఈ స్కూటర్ ఫ్లోర్ బోర్డ్ మౌంట్‌లో 2-లీటర్ పెట్రోల్ ట్యాంక్‌(Petrol Tank) కూడా ఇచ్చారు. ముందు ఆప్రాన్ ప్రాంతంలో ఫిల్లర్ నాజిల్‌ని అందించారు. పెట్రోల్‌ ప్లస్‌ సీఎన్‌జీ మోడ్‌(CNG Mode)లో ఈ టీవీఎస్ 226 కిలోమీటర్ల భారీ మైలేజీని అందజేస్తుంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 80.5కి.మీ.

ఇది 6,000rpm వద్ద 7.1 హార్స్‌పవర్, 5,500 rpm వద్ద 9.4 Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఇందులో LED హెడ్‌లైట్, మొబైల్ ఛార్జింగ్ పోర్ట్, ఆల్-ఇన్-వన్ లాక్ , సైడ్ స్టాండ్ ఇండికేటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది ఎలక్ట్రిక్ స్కూటర్లకు సైతం గట్టి పోటీని ఇవ్వగలదు. ఈ స్కూటర్‌ 125 ICE పాత టీవీఎస్ జూపిటర్ లాగా ఉంటుంది. ఇది కాన్సెప్ట్ దశలోనే ఉన్నట్లు కంపెనీ తెలిపింది.

TVS Jupiter CNG Scooter Price

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, March 10, 2025, 12:00 [IST]
English summary
Tvs jupiter cng scooter with a mileage of 226 km on full tank price and features revealed
Read more on: #tvs #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+