53 కి.మీ మైలేజ్.. రూ.78 వేల ధర.. లక్షకు పైగా సేల్స్.. యాక్టివాకు పోటీగా హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న స్కూటర్

భారతీయ వాహన పరిశ్రమలో టీవీఎస్(Tvs) ఒక ప్రసిద్ధ టూవీలర్ తయారీ కంపెనీ. దేశీయ మార్కెట్లో పెద్ద సంఖ్యలో తన మోడళ్లను విక్రయిస్తూ, హీరో, హోండా కంపెనీలకు బలమైన పోటీదారుగా నిలుస్తుంది. ప్రస్తుతం, దాదాపు అన్ని టూవీలర్ తయారీదారులు ఫిబ్రవరి నెలలో తమ ప్రధాన బైక్‌లు, స్కూటర్ల సేల్స్ గణాంకాలను విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో టీవీఎస్ కూడా తాజాగా తన అమ్మకాలను వెల్లడించింది. డేటా ప్రకారం, టీవీఎస్ ప్రసిద్ధ స్కూటర్ జూపిటర్ దేశీయ మార్కెట్లో పెద్ద సంఖ్యలో అమ్ముడవుతోంది. ఫిబ్రవరి 2025 ఇది ఏకంగా 1,03,576 యూనిట్ల సేల్స్‌ను నమోదు చేయడం విశేషం. 2024లో ఇదే నెలలో అమ్ముడైన 73,860 యూనిట్లతో పోలిస్తే, ఏడాది ప్రాతిపదికన ఇది 40.23 శాతం వృద్ధి చెందడం విశేషం.

ఇప్పటివరకు స్కూటర్ విభాగంలో హోండా యాక్టివా ఆధిపత్యం కొనసాగిస్తూ వచ్చింది. అయితే, ఇప్పుడు టీవీఎస్ జూపిటర్ తన ఫీచర్లతో, మైలేజ్‌తో, స్టైల్‌తో వినియోగదారులను ఆకర్షిస్తూ హోండా యాక్టివాకు గట్టి పోటీగా మారిందని అమ్మకాల డేటాను చూస్తేనే తెలిసిపోతుంది. మామూలగానే హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ కు ప్రత్యక్ష పోటీదారు. గత నెలలో యాక్టివా స్కూటర్ 1,74,009 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.

TVS Jupiter February 2025 Sales Recorded 103576 units

అదే 2024 ఏడాదిలో ఇదే ఫిబ్రవరిలో 2,00,134 యూనిట్ల అమ్మకాలను సాధించగా, ఈసారి ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే 13.05 శాతం తగ్గిపోవడం గమనార్హం. అయితే ఇదే సమయంలో , టీవీఎస్ ప్రసిద్ధ స్కూటర్ జూపిటర్ మాత్రం దేశీయంగా కొత్త కస్టమర్లకు చేరువ అవుతూ, సేల్స్‌ను క్రమంగా పెంచుకుంటుంది. సిటీ రైడింగ్‌ కోసం సరైన స్కూటర్ కావాలని భావించే వినియోగదారులు జూపిటర్‌ను ఎక్కువగా ఎంచుకుంటున్నారు.

భారత స్కూటర్ మార్కెట్‌లో టీవీఎస్ జూపిటర్ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. 2013లో విడుదలైనప్పటి నుంచి, ఇది అద్భుతమైన విజయాన్ని సాధించింది. సేల్స్ గణాంకాల ప్రకారం, 2022 నాటికి 5 మిలియన్ యూనిట్లు అమ్ముడవ్వగా, 2025 జనవరి నాటికి ఈ సంఖ్య 7 మిలియన్ యూనిట్ల మైలురాయి దాటింది. ఈ డేటాను చూస్తేనే తెలుస్తుంది, టీవీఎస్ జూపిటర్ ఏ విధంగా కస్టమర్లకు చేరువ అయిందో.

TVS Jupiter February 2025 Sales Details

కొత్త టీవీఎస్ జూపిటర్ దేశీయంగా ప్రస్తుతం రెండు వేరియంట్లలో కొనుగోలుకు ఉంది. టీవీఎస్ జూపిటర్ 110 విషయానికి వస్తే, ఇది లీటర్ పెట్రోల్‌కు దాదాపు 53.84 కి.మీల మైలేజ్ అందిస్తుంది. దీని ధర వచ్చేసి రూ.78,391 నుంచి మొదలై రూ. 92,366 (ఎక్స్-షోరూమ్) కొనుగోలుకు లభిస్తుంది. ఇది 113cc పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది అద్బుతమైన ఫీచర్స్‌‌ను కలిగి ఉంది. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు ఇతర ఆప్షన్లు ఉన్నాయి.

టీవీఎస్ జూపిటర్ 125 గురించి చూసినట్లయితే, 124.8 cc పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. మార్కెట్లో ప్రారంభ ధర రూ. 88,174 నుంచి ప్రారంభమై రూ.99,015 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. లీటరుకు ఇది దాదాపు రూ.55 కి.మీ ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఇది నగరాలతో పాటు గ్రామీణ రోడ్లకు కూడా బాగా అనుకూలంగా ఉంటుంది. USB ఛార్జింగ్ సాకెట్, ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ వంటి ఫీచర్స్‌ను కలిగి ఉంది.

TVS Jupiter February 2025 Sales

చివరగా కొత్త మోడల్ TVS జూపిటర్ CNG స్కూటర్ 124.8 సీసీ పెట్రోల్/సీఎన్‌జీ ఇంజిన్‌ను కలిగి ఉంది. దీని ధర రూ.1 లక్ష (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇది అక్టోబర్‌‌లో విడుదల కాబోతుంది. రెండు ఇంధన ఆప్షన్లతో కలిపి 226 కి.మీ మైలేజీని ఇస్తుంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 80.5 కి.మీలుగా ఉంది. ఈ స్కూటర్‌లో డజన్ల కొద్ది కొత్త ఫీచర్స్ ఉన్నాయి.

Take a Poll

More from DriveSpark

Article Published On: Friday, March 21, 2025, 7:20 [IST]
English summary
Tvs jupiter february 2025 sales recorded 103576 units it is growth of 40 23 percent
Read more on: #tvs motor #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+