Tvs 90 కి.మీ మైలేజ్‌ ఇచ్చే స్కూటర్‌ ! ఒక్క నెలలోనే 1 లక్ష మార్క్ దాటేసిన ప్రస్తుత మోడల్

భారత మార్కెట్లో హోండా యాక్టివాకు బలంగా ఎదురు నిలిచిన స్కూటర్లలో టీవీఎస్ జూపిటర్‌ (Tvs Jupiter)కు ప్రత్యేకమైన స్థానం ఉంది. భారత స్కూటర్ ప్రియుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ మోడల్ ఆకట్టుకునే డిజైన్, మైలేజ్, కంఫర్ట్ వంటి అంశాలతో అందరి మనసును గెలుచుకుంది. తాజాగా విడుదలైన జూన్ 2025 విక్రయాల గణాంకాలు చూస్తే ఇది మరోసారి తన డిమాండ్‌ను స్పష్టంగా నిరూపించుకుంది. జూన్ నెలలో టీవీఎస్ సంస్థ ఏకంగా 1,07,980 జూపిటర్ స్కూటర్లను విక్రయించింది. ఇది ఏదో సాధారణ గణాంకం కాదు... బిజీ మార్కెట్లో టఫ్ పోటీతో ఉన్నప్పటికీ, జూపిటర్‌కు ఇంకా అంతగా ఆదరణ ఉందని చెప్పే అద్భుత నిదర్శనం. ఇది స్థిరంగా మార్కెట్లో నిలబడిన స్కూటర్ మాత్రమే కాదు, ఫ్యామిలీ లైఫ్‌స్టైల్‌ను పరిగణలోకి తీసుకుని వచ్చిన క్లాస్‌కి సంబంధించినది కూడా.

జూన్ 2024లో ఈ స్కూటర్ విక్రయాలు 72,100 యూనిట్ల వరకు మాత్రమే ఉండగా, జూన్ 2025కి వచ్చేసరికి ఈ సంఖ్య ఏకంగా 1,07,980కి చేరింది. అంటే కేవలం ఒకే ఏడాదిలో 35,880 యూనిట్లు అదనంగా అమ్ముడయ్యాయి. ఇది ఏకంగా 49.76 శాతం వృద్ధికి సమానం. ఈ పెరుగుదల సాధారణమైనదేమీ కాదు. ఇది మార్కెట్‌లో టీవీఎస్ జూపిటర్‌పై ఉన్న నమ్మకం, విశ్వసనీయతకు బలమైన నిదర్శనం.

Tvs Jupiter Sales

పెట్రోల్ ధరలు పెరుగుతున్నప్పటికీ, వినియోగదారులు ఈ మోడల్‌ను ఎన్నుకోవడాన్ని చూస్తే, మైలేజ్, మెయింటెనెన్స్ వంటి అంశాల్లో జూపిటర్ ఎంతగానో రాణిస్తోందని చెప్పొచ్చు. ఇప్పటికే మార్కెట్లో టూవీలర్ సెగ్మెంట్‌లో పోటీ బాగా పెరిగిపోయింది. ఈ టైంలో జూపిటర్‌ 1 లక్ష మార్క్‌ను దాటడం అనేది చిన్న విషయం కాదు. టీవీఎస్ నుంచి ఈ మోడల్‌కు వచ్చే అప్డేట్లు, కొత్త వేరియంట్లు కూడా దీని విజయాన్ని కొనసాగించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

నెల మొత్తం అమ్మకాల్లో 1,07,980 యూనిట్లను నమోదు చేసి, దేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 స్కూటర్లలో రెండో స్థానం దక్కించుకుంది. మొదటి స్థానాన్ని ఎప్పటిలానే హోండా యాక్టివా దక్కించుకున్నా, జూపిటర్ కూడా దగ్గరగానే ఉండటంతో ఈసారి పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. జూపిటర్‌కి వినియోగదారుల నుంచి ఈ స్థాయిలో స్పందన రావడానికి కారణం, మల్టీపుల్ వేరియంట్లు, నమ్మకమైన పెర్ఫార్మెన్స్ మరియు కుటుంబానికి అనువైన డిజైన్.

Tvs Jupiter June 2025 Sales

ప్రస్తుతం జూపిటర్ రెండు ప్రధాన మోడళ్లలో అందుబాటులో ఉంది, మొదటిది 113.3సిసి ఇంజిన్ వేరియంట్. ఇది 5.9 కిలోవాట్లు పవర్, 9.8 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ జతచేయబడి ఉండటంతో, రోజువారీ ప్రయాణాలకు ఇది మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. దీని ధర రూ.78,631 (ఎక్స్-షోరూమ్) వద్ద ప్రారంభమవుతుంది, కాబట్టి బడ్జెట్ బేస్డ్ కొనుగోలుదారులకు ఇది మంచి ఎంపికగా నిలుస్తోంది.

ఇక మరింత శక్తివంతమైన మోడల్ కావాలనుకునేవారి కోసం, టీవీఎస్ 124.8సిసి ఇంజిన్‌ వేరియంట్‌ను కూడా అందిస్తోంది. ఇది 6.0 కిలోవాట్లు పవర్, 10.5 Nm టార్క్ అందిస్తుంది. అదే విధంగా, ఈ మోడల్‌కి కూడా CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంటుంది, కాబట్టి సిటీ రైడింగ్‌లో బాగా వర్కౌట్ అవుతుంది. ప్రస్తుతం ఈ స్కూటర్ ధర రూ.81,090 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతోంది.

Tvs Jupiter Cng

పెట్రోల్ వేరియంట్లతో మంచి ఆదరణ పొందిన ఈ మోడల్ CNG వేరియంట్‌తో మరో కీలక మెట్టు ఎక్కబోతోంది. 124.8 cc ఇంజిన్‌‌తో వస్తోన్న ఈ మోడల్, మైలేజ్ పరంగా మరింత ఆకర్షణీయంగా ఉండనుంది. తాజా నివేదికల ప్రకారం, ఇది కిలో గ్యాస్‌కు సుమారు 90 కిలోమీటర్ల పరిధిని అందించగలదని అంచనా. అంటే, పెట్రోల్‌తో పోలిస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయాణం చేయవచ్చు.

Article Published On: Saturday, July 26, 2025, 14:37 [IST]
English summary
Tvs jupiter june 2025 sales 40 76 percent growth details inside
Read more on: #tvs motor #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+