సరికొత్త చరిత్రను లిఖించిన TVS జూపిటర్.. తిరుగులేని బిగ్గెస్ట్ రికార్డ్ సొంతం చేసుకుంది.. ఇంతకి అది ఏంటంటే?

దేశీయ ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ టీవీఎస్ మోటార్ (Tvs Motor)ఇండియాలో చాలా కాలంగా బైక్స్, స్కూటర్లను విక్రయిస్తూ వ్యాపారాన్ని నిర్వహిస్తుంది. ప్రతి ఏడాది అదిరిపోయే మోడళ్లను లాంచ్ చేస్తూ, కొత్త వినియోగదారులను పెంచుకుంటూనే ఉంది. ఈ కంపనీ నుంచి విడుదలయ్యే టూవీలర్స్ ఆకర్షణీయమైన డిజైన్‌, అదిరిపోయే ఫీచర్స్‌తో వస్తాయి. పైగా వీటి ధరలు కూడా బడ్జెట్ రేంజ్‌లో ఉంటాయి. మధ్యతరగతి వినియోగదారులకు అనుకూలంగా ఉండే ధరల్లో ఇవి కొనుగోలుకు లభిస్తాయి. ఇదిలా ఉంటే టీవీఎస్ కంపెనీకి చెందిన ప్రముఖ మోడల్ జూపిటర్ (Jupiter) కీలక మైలు రాయికి చేరుకుంది. ఇది ఇండియాలో మరో దిగ్గజ కంపెనీ హోండా మోటార్స్‌కు చెందిన యాక్టివా స్కూటర్ (Activa Scooter)కు ప్రత్యర్థిగా ఉంది. టీవీఎస్ కంపెనీ పేరు దేశవ్యాప్తంగా స్కూటర్ల విభాగంలో మారుమోగడానికి ప్రధాన కారణం అయిన జూపిటర్ స్కూటర్ విక్రయాల్లో సరికొత్త రికార్డును నమోదు చేసింది.

తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, టీవీఎస్ జూపిటర్ స్కూటర్ 70 లక్షల యూనిట్ల సేల్స్ మైలురాయిని చేరుకుంది. హోండా యాక్టివా మోడల్‌కు బలమైన పోటీగా ఉన్నటువంటి ఈ స్కూటర్ ఇండియా మార్కెట్లో సెప్టెంబర్ 2013 నెలలో విడుదల అయింది. లాంచ్ అయిన తక్కువ కాలంలోనే ఇది దేశవ్యాప్తంగా చాలా మంది కొత్త వినియోగదారులకు చేరుకుంది. యాక్టివా స్కూటర్ కాకుండా ఇతర మోడల్‌ను ఎంచుకునే వారు జూపిటర్‌కు ప్రాముఖ్యత ఇచ్చారు.

Tvs Jupiter Scooter

మార్కెట్లోకి లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ స్కూటర్‌ను ఏకంగా 70 లక్షల మంది కొనుగోలు చేయడం అంటే సాధారణ విషయం కాదు. ఇంకో 30 లక్షల సేల్స్‌ను సాధిస్తే ఈ స్కూటర్‌ను కొటి మంది కొనుగోలు చేసినట్లవుతుంది. ఈ మైలురాయికి చేరడానికి మరికొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు. జూపిటర్ 2015 మే వరకు విక్రయాలను చూసినట్లయితే రెండేళ్లలోనే దీనిని 5 లక్షల మంది కొనుగోలు చేశారు.

అలాగే, జూన్ 2016 వరకు జూపిటర్ మొత్తం అమ్మకాలు 10 లక్షల యూనిట్ల వరకు చేరుకున్నాయి. తరువాత 2017 నాటికి 20 లక్షల మంది ఈ స్కూటర్‌ను కొనుగోలు చేశారు. 2022 నాటికి ఇది విజయవంతంగా 50 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇంత పెద్ద మైలురాయికి చేరడానికి ప్రధాన కారణం జూపిటర్ స్కూటర్ తక్కువ ధరలో లభించడం, అలాగే మైలేజ్ ఎక్కువగా రావడం, దీని ఆకట్టుకునే డిజైన్.

Tvs Jupiter Scooter Sales

TVS జూపిటర్ ప్రారంభ ధర రూ.89,396 నుంచి ఉంటుంది. అదే టాప్ వేరియంట్ ధర రూ.99,805గా ఉంది. ఇవన్నీ ఎక్స్‌ షోరూమ్ ధరలు. లీటర్ పెట్రోల్‌కు దాదాపు 57.27 కి.మీల వరకు మైలేజ్‌ను ఇస్తుంది. ఇది 124.8 cc సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 5.1 లీటర్లుగా ఉంది. ఈ స్కూటర్‌లో చాలా అధునాతన ఫీచర్స్ ఉన్నాయి.

దీని ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, , USB ఛార్జింగ్ సాకెట్, పూర్తి-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, వాయిస్ అసిస్ట్‌, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి అధునాతన ఫీచర్స్ ఉన్నాయి. రైడర్లకు పూర్తి రక్షణ అందించడానికి డ్రమ్/డిస్క్ బ్రేక్‌లు కూడా ఉన్నాయి. దీనిలో జూపిటర్ 110 స్కూటర్ ధర రూ. 78,391 నుంచి రూ. 90,691 వరకు ఉంది. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు. ఇది 53.84 కిమీల వరకు మైలేజ్‌ను ఇస్తుంది.

Tvs Jupiter Scooter Crossed 70 Lakh Unit Sales

జూపిటర్ 110 స్కూటర్‌లో 33-లీటర్ కెపాసిటీ అండర్-సీట్ స్టోరేజీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌, ముందు పెటల్ డిస్క్, వెనుక డ్రమ్ బ్రేక్‌‌లు ఉంటాయి. ఇది 113 cc సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. TVS జూపిటర్ 125, 110 రెండు కూడా దాదాపు ఒకే విధమైన డిజైన్‌తో ఉంటాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, January 14, 2025, 18:24 [IST]
English summary
Tvs jupiter scooter has crossed 70 lakh unit sales milestone since its launch
Read more on: #tvs #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+