90 కి.మీ మైలేజ్ ఇచ్చే స్కూటర్ రాక! గత నెలలోనే ఒక లక్ష మార్క్ దాటేసిన ప్రస్తుత మోడల్
టీవీఎస్ జూపిటర్ (Tvs Jupiter) భారతదేశంలో అత్యంత ఆదరణ పొందిన స్కూటర్లలో ఒకటి అని చెప్పుకోవచ్చు. తక్కువ ధరలో, ఎక్కువ మైలేజ్ కలిగిన ఈ స్కూటర్ పేద, మధ్యతరగతి ప్రజలకే కాకుండా, నిత్యవసరాలకు వాహనం అవసరమయ్యే ప్రతి ఒక్కరికీ ఒక మంచి ఎంపికగా మారింది. దీని డిజైన్, కంఫర్ట్, పనితీరు వంటి అంశాలు ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. ఇటీవల విడుదలైన విక్రయ గణాంకాలు చూస్తే టీవీఎస్ జూపిటర్ ప్రాచుర్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. 2025 జూలై నెలలో మాత్రమే ఈ స్కూటర్ 1,24,876 యూనిట్లు విక్రయమయ్యాయి. గతేడాది ఇదే నెలలో, అంటే 2024 జూలైలో కేవలం 74,663 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.
అంటే కేవలం ఏడాది వ్యవధిలోనే 50,213 యూనిట్ల అదనంగా అమ్మకాలు సాధించిందన్నమాట. శాతం వారీగా చూసినా ఈ పెరుగుదల 67.25 శాతంగా ఉంది. ఇంత భారీ వృద్ధి సాధించడం చిన్న విషయమేమీ కాదు. పెరిగిన డిమాండ్, కంపెనీ అందిస్తున్న నాణ్యతా ప్రమాణాలు, కొత్త ఫీచర్లు, కస్టమర్ అవసరాలకు తగ్గ అప్‌డేట్స్ టీవీఎస్ జూపిటర్‌ను ఈ స్థాయికి తీసుకువచ్చాయి. రాబోయే నెలల్లో టీవీఎస్ జూపిటర్ మరింత రాణించే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.

2025 జూలైలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 టూ వీలర్ల జాబితాలో టీవీఎస్ జూపిటర్ 4వ స్థానాన్ని సాధించడం కూడా దీనికి ఉన్న క్రేజ్‌ను మరోసారి రుజువు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు ప్రతి వర్గానికి చేరువైన ఈ స్కూటర్, వినియోగదారులలో నమ్మకాన్ని సంపాదించుకోవడమే కాకుండా, భారత టూ వీలర్ మార్కెట్లో తనదైన స్థానాన్ని మరింత బలపరచుకుంది.
భారతీయ టూవీలర్ మార్కెట్‌లో ప్రస్తుతం అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 3 వాహనాలు హీరో స్ప్లెండర్, హోండా యాక్టివా, హోండా షైన్. ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచిన టీవీఎస్ జూపిటర్ స్కూటర్, ముఖ్యంగా హోండా యాక్టివాకు గట్టి పోటీగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా స్కూటర్ సెగ్మెంట్‌లో కస్టమర్ల అభిరుచులను గమనిస్తూ, టీవీఎస్ జూపిటర్ తన ప్రత్యేకతను కొనసాగిస్తూ మార్కెట్‌లో తన స్థానాన్ని బలంగా నిలుపుకుంటోంది.

ప్రస్తుతం ఈ స్కూటర్ రెండు ఇంజిన్ వెర్షన్లలో అందుబాటులో ఉంది. మొదటి వెర్షన్ 113.3 సీసీ సామర్థ్యం కలిగిన ఇంజిన్. ఇది రోజువారీ ప్రయాణాలకు అనువైన మైలేజ్‌ను అందిస్తూ, తక్కువ ధరలో నాణ్యత కోరుకునే వినియోగదారులను ఆకర్షిస్తోంది. దీని ప్రారంభ ధర రూ.78,631గా ఉంది, ఇది ఎక్స్-షోరూమ్ ధర. ఇక మరింత శక్తివంతమైన ఇంజిన్ కోరుకునే కస్టమర్ల కోసం 124.76 సీసీ సామర్థ్యం గల వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.
ఇది మెరుగైన పనితీరు, స్మూత్ రైడింగ్ అనుభవం ఇవ్వడమే కాకుండా, పొడవైన ప్రయాణాలకు కూడా సరైన ఎంపికగా మారింది. దీని ప్రారంభ ధర రూ.82,045(ఎక్స్-షోరూమ్). ఈ రెండు వెర్షన్లు కూడా టీవీఎస్ జూపిటర్‌ను విభిన్న కస్టమర్లకు చేరువ చేస్తూ, స్కూటర్ మార్కెట్‌లో ప్రభావాన్ని మరింత పెంచుతున్నాయి. సిటీ రైడింగ్‌కు కావలసిన కంఫర్ట్, వినియోగదారులు కోరుకునే సౌకర్యాలు, అందుబాటులో ఉన్న ఫీచర్లు టీవీఎస్ జూపిటర్‌ను నేటి పోటీ మార్కెట్లో ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.

ఇక్కడ మరో ముఖ్య విషయం ఏమిటంటే, రానున్న నెలల్లో ఈ స్కూటర్ అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీనికి ప్రధాన కారణం టీవీఎస్ కంపెనీ జూపిటర్‌ను CNG వెర్షన్ విడుదల చేయడానికి సిద్ధమైంది. ఇది దాదాపు 90 కి.మీల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. తక్కువ ధరలో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే వారికి ఇది బెస్ట్ స్కూటర్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.


Click it and Unblock the Notifications








