అపాచీ సిరీస్‌లో తొలి అడ్వెంచర్ టూరర్.. యువతకు కిక్కిచ్చే బైక్ లాంచ్.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే బుక్ చేస్తారు
భారతదేశంలో టూ వీలర్ల తయారీలో టీవీఎస్ కంపెనీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కమ్యూటర్ బైక్‌లు, స్కూటర్లు, మోపెడ్లు, ప్రీమియం స్పోర్ట్స్ బైక్‌లు... ఇలా అనేక మోడళ్లను ఈ సంస్థ అందిస్తోంది. అయితే ఇటీవల కాలంలో యువత ఎక్కువగా అడ్వెంచర్ టూరర్ (ADV) బైక్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు.
ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని టీవీఎస్ ఎట్టకేలకు తమ పాపులర్ అపాచీ (Apache) సిరీస్‌లో ఒక కొత్త అడ్వెంచర్ బైక్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. అదే టీవీఎస్ అపాచీ RTX 300. ఈ బైక్ ధర కేవలం రూ.1.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం అవుతోంది. పవర్‌ఫుల్ ఇంజిన్, ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

భారతదేశంలో అత్యంత వైవిధ్యమైన టూ వీలర్లను తయారు చేసే సంస్థలలో టీవీఎస్ ముందుంటుంది. ప్రస్తుతం దేశంలో అడ్వెంచర్ టూరర్ బైక్‌లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ సెగ్మెంట్‌లో ఇప్పటివరకు అడుగుపెట్టని టీవీఎస్, సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సరికొత్త అపాచీ RTX 300 తో మార్కెట్‌లోకి ప్రవేశించింది. యూత్‌కి ఎంతో ఇష్టమైన అపాచీ సిరీస్‌లోనే ఈ అడ్వెంచర్ వెర్షన్‌ను చేర్చడం విశేషం.
ధర, వేరియంట్లు
టీవీఎస్ అపాచీ RTX 300 బైక్‌ను మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ బైక్‌లో R, T, X అనే పదాలు రాలీ (Rally), టూరర్ (Tourer), ఎక్స్‌ట్రీమ్ (eXtreme) ఫీచర్లను సూచిస్తాయి. ఈ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ టూరర్, ఆఫ్-రోడర్ ఫీచర్ల మిశ్రమమని కంపెనీ పేర్కొంది. ఈ మోడల్ వివిధ వేరియంట్లలో లభిస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.99 లక్షల నుంచి రూ.2.29 లక్షల వరకు ఉంది.

ఈ బైక్ వైపర్ గ్రీన్, టార్న్ బ్రాంజ్, మెటాలిక్ బ్లూ, లైట్నింగ్ బ్లాక్, పెర్ల్ వైట్ అనే 5 ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. బుకింగ్‌లు అధికారికంగా ప్రారంభమయ్యాయి. డెలివరీలు కూడా అతి త్వరలోనే మొదలుకానున్నాయి.
డిజైన్, ఫీచర్లు
టీవీఎస్ అపాచీ RTX 300 అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంది. ఇది చూడగానే ఆకట్టుకుంటుంది. ఇది ప్రీమియం అడ్వెంచర్ బైకును పోలి ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ ఎల్ఈడీ హెడ్‌లైట్ సెటప్‌తో కూడిన సెమీ ఫెయిరింగ్ అసాధారణమైన రోడ్ ప్రెజెన్స్‌ను ఇస్తుంది. అడ్వెంచర్ బైక్ ఫెయిరింగ్, ఫ్రంట్ విండ్‌షీల్డ్ హైవే టూరింగ్‌లో గాలి నుండి రక్షణ (విండ్ ప్రొటెక్షన్) ఇస్తాయి.

రైడర్ సులభంగా, అలసట లేకుండా ప్రయాణం చేయడానికి ఫుట్‌పెగ్‌లు, హ్యాండిల్‌బార్‌లు న్యూట్రల్ పొజిషన్‌లో సెట్ చేశారు. ఎల్ఈడీ హెడ్‌లైట్లు, టెయిల్ లైట్లు, టర్న్ ఇండికేటర్లు RTX డిజైన్‌కు చక్కగా సరిపోతాయి.
మెకానికల్, సేఫ్టీ హైలైట్స్
ఈ బైకులో కంప్లీట్ అడ్జస్టబుల్ గోల్డ్ ఫినిషింగ్‌తో 41 ఎంఎం USD టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, వెనుక మోనో-షాక్, స్ట్రాంగ్ రియర్ లగేజ్ ర్యాక్, స్ప్లిట్ సీట్ సెటప్, హ్యాండిల్‌బార్-మౌంటెడ్ మిర్రర్‌లు ఈ బైక్‌లోని ఇతర ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి.
యాక్సెసరీలలో మెటాలిక్ బాష్ ప్లేట్, నకిల్ గార్డులు, క్రాష్ గార్డులు అందుబాటులో ఉన్నాయి. ముందు 19 అంగుళాలు, వెనుక 17 అంగుళాల అలాయ్ వీల్స్‌కు ప్రత్యేక కాంపౌండ్ టైర్లు ఇచ్చారు. బ్రేకింగ్ కోసం 320ఎంఎం ఫ్రంట్ డిస్క్, రియర్ డిస్క్ ఉన్నాయి. స్విచ్చబుల్ డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ (ABS) ఈ మోటార్‌సైకిల్ మరో స్పెషాలిటీ.
పవర్ఫుల్ ఇంజిన్, టెక్నాలజీ
టీవీఎస్ ఈ అడ్వెంచర్ బైక్‌ను డై-కాస్ట్ అల్యూమినియం స్వింగ్‌ఆర్మ్ ఉన్న స్టీల్ ఫ్రేమ్‌పై నిర్మించింది. దీనికి RT-XD4 ఇంజిన్ శక్తినిస్తుంది. ఇందులో 299.1 సీసీ DOHC 4V/సిలిండర్ సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 9,000 ఆర్‌పిఎమ్ వద్ద 35 bhp శక్తిని, 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 28.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ స్లిప్పర్ అసిస్ట్ క్లచ్, క్విక్-షిఫ్టర్‌తో కూడిన 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.
అపాచీ RTX 300 లో అనేక అధునాతన రైడింగ్, టెక్ ఫీచర్లు ఉన్నాయి. టూర్, రాలీ, అర్బన్, రెయిన్ అనే 4 రైడింగ్ మోడ్‌లు, రాలీ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, గూగుల్ మ్యాప్స్‌తో మ్యాప్ మిర్రరింగ్, నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








