ఫుల్ ఫీచర్స్ లోడ్.. పర్ఫార్మెన్స్ అదుర్స్.. కేటీఎమ్‌కు చెక్ పెట్టేందుకు టీవీఎస్ కొత్త స్పోర్ట్స్ బైక్

మనదేశంలో స్పోర్ట్స్ బైక్ సెగ్మెంట్‌లో టీవీఎస్ విడుదల చేసిన ఓ సెన్సేషన్ అపాచీ RR 310. మార్కెట్‌లో ఇది పెద్దగా సంచలనం సృష్టించలేకపోయినా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చాలామంది దీనిని 'పేదల డుకాటీ' అని ముద్దుగా పిలుచుకుంటారు. వినియోగదారుల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ మార్పులు చేయడంలో టీవీఎస్ ముందుంటుంది.

ఇప్పుడు RR 310 మోడల్‌ను 2025 ఎడిషన్‌తో సరికొత్త ఫీచర్లతో రిలీజ్ చేసింది. బ్రాండ్ ఫ్లాగ్‌షిప్ మోటార్‌సైకిల్‌లో కొత్త ఫీచర్లను నింపి దాని లవర్స్ కోసం తీసుకొచ్చింది. కొత్త ఫీచర్లను అందించడంతో పాటు 2025 టీవీఎస్ అపాచి RR 310 ఇంజిన్‌ను OBD-2B ప్రమాణాలకు అనుగుణంగా అప్‌డేట్ చేశారు.

TVS New Apache RR 310

అపాచి ఫ్యామిలీ ప్రపంచవ్యాప్తంగా ఆరు మిలియన్ యూనిట్ల అమ్మకాలతో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఫుల్లీ ఫెయిర్డ్ స్పోర్ట్స్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేశారు. కొత్త టీవీఎస్ అపాచి RR 310 మోడల్‌ను సొంతం చేసుకోవడానికి ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.78 లక్షల నుండి రూ. 3 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఆసక్తిగల వినియోగదారులు ఈ 2025 మోడల్‌ను బుక్ చేసుకోవచ్చు. ఈ కొత్త బైక్ డెలివరీలు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయని తెలుస్తోంది. ఇక ఈ వాహనంలో కొత్తగా వచ్చిన ఫీచర్ల విషయానికొస్తే, సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లు చాలానే ఉన్నాయి.

TVS Apache RR 310

సీక్వెన్షియల్ TSL, కార్నరింగ్ డ్రాగ్ టార్క్ కంట్రోల్ (RT-DSC), లాంచ్ కంట్రోల్ (RT-DSC), మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్‌తో కూడిన జెన్2 రేస్ కంప్యూటర్ మరియు కొత్త 8-స్పోక్ అల్లాయ్ వీల్స్‌తో 2025 టీవీఎస్ RR 310 మార్కెట్‌లోకి దూసుకొస్తోంది. అంతేకాకుండా, టీవీఎస్ ఆసియా OMC రేస్ బైక్ నుంచి ప్రేరణ పొందిన కొత్త సెపాంగ్ బ్లూ రేస్ రెప్లికా కలర్ ఆప్షన్‌ను కూడా ఇందులో చేర్చారు.

2025 టీవీఎస్ అపాచి RR 310 కస్టమైజేషన్ ఆప్షన్‌లతో కూడిన మూడు బిల్ట్ టు ఆర్డర్ (BTO) కిట్‌లతో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. డైనమిక్ కిట్ ధర రూ. 18,000, డైనమిక్ ప్రో కిట్ ధర రూ. 16,000. అదే సమయంలో కొత్త రేస్ రెప్లికా కలర్ ఆప్షన్ కోసం అదనంగా రూ. 10,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మోటార్‌సైకిల్ 312.2 సిసి రివర్స్-ఇన్‌క్లైన్డ్ DOHC ఇంజన్.

TVS Launches New Apache

స్లిప్పర్ అసిస్ట్ క్లచ్, క్విక్ షిఫ్టర్‌తో జతచేయబడిన ఈ 312 సిసి ఇంజన్ 9,800 rpm వద్ద 38 bhp శక్తిని, 7,900 rpm వద్ద 29 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. వివిధ రకాల రోడ్, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉపయోగించడానికి ట్రాక్, స్పోర్ట్, అర్బన్, రెయిన్ అనే నాలుగు రైడింగ్ మోడ్‌లను అపాచి RR 310 బైక్‌లో టీవీఎస్ అందించింది.

వేరియంట్ల వారీగా ధరలను పరిశీలిస్తే.. క్విక్ షిఫ్టర్ ఫీచర్ లేని రెడ్ కలర్ ఆప్షన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 2,77,999. క్విక్ షిఫ్టర్‌తో కూడిన రెడ్ ఆప్షన్ ధర రూ. 2,94,999. ఇక స్పోర్ట్స్ బైక్‌లోని సరికొత్త బాంబర్ గ్రే కలర్ ఆప్షన్ ధర రూ. 2,99,999.

టీవీఎస్ స్మార్ట్ ఎక్స్‌కనెక్ట్ అనే బ్లూటూత్ కనెక్టివిటీ సిస్టమ్‌తో కూడిన 5.0-ఇంచ్ కొత్త TFT కలర్ ఇన్స్ట్రుమెంట్ పానెల్ ఈ బైక్‌లోని మరో ముఖ్యమైన ఫీచర్. స్ప్లిట్ LED హెడ్‌లైట్, క్లియర్ వైజర్, రైడ్ బై వైర్ సిస్టమ్, డ్యూయల్ ఛానల్ ABS, రైడింగ్ మోడ్‌లు 2025మోడల్ టీవీఎస్ అపాచి RR 310 ఇతర ముఖ్యమైన ఫీచర్లు. ఈ బైక్ ప్రధానంగా కేటీఎమ్ RC 390వంటి స్పోర్ట్స్ మోటార్‌సైకిళ్లతో పోటీపడుతుంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, April 19, 2025, 7:03 [IST]
English summary
Tvs launches new apache rr 310 with stunning features to rival ktm
Read more on: #tvs apache #india #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+