మార్వెల్ సూపర్ హీరో పాత్రలతో టీవీఎస్ కొత్త రైడర్ బైక్ లాంచ్.. ఈ బైక్‌లు చాలా స్పెషల్
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ టీవీఎస్ రైడర్ సూపర్ స్క్వాడ్ ఎడిషన్‌ను విడుదల చేసింది. హాలీవుడ్‌లోని అత్యంత ప్రసిద్ధ మార్వెల్ పాత్రలైన డెడ్‌పూల్, వోల్వరైన్‌ల నుండి ప్రేరణ పొందిన ఈ తాజా ఎడిషన్, టీవీఎస్ రైడర్‌కు బోల్డ్ డిజైన్ ఇచ్చి, సూపర్ స్క్వాడ్ సిరీసును నెక్ట్స్ లెవల్‌కు తీసుకువెళ్తుందని టీవీఎస్ మోటార్ తెలిపింది. కొత్త ఎడిషన్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి.
మీరు మార్వెల్ సినిమా అభిమానులా? అయితే టీవీఎస్ నుండి వచ్చిన ఈ కొత్త బైక్ మీకు చాలా నచ్చుతుంది. టీవీఎస్ తన పాపులర్ కమ్యూటర్ మోటార్‌సైకిల్ రైడర్ కి కొత్త మోడళ్లను లాంచ్ చేసింది. సూపర్ స్క్వాడ్ లైన్‌అప్‌లో డెడ్‌పూల్ (Deadpool), వోల్వరైన్ (Wolverine) ఎడిషన్లను విడుదల చేసింది. ఈ కొత్త వెర్షన్‌లను మార్వెల్ సినిమాలోని ప్రసిద్ధ యాంటీ-హీరో పాత్రలైన డెడ్‌పూల్, వోల్వరైన్ నుండి ప్రేరణ పొంది తయారు చేశారు.

ఈ బైక్‌లు మార్వెల్ అభిమానులను, ముఖ్యంగా యువతను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ కొత్త ఎడిషన్ బైక్‌ల గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రైడర్ డెడ్‌పూల్, వోల్వరైన్ స్పెషల్ ఎడిషన్ బైక్‌ల ధర రూ. 99,465 (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించారు. ఈ రెండు స్పెషల్ ఎడిషన్ బైక్‌లు వచ్చే నెల నుండి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టీవీఎస్ డీలర్‌షిప్‌లలో లభిస్తాయి.
ఈ బైక్‌ను అనేక మార్పులతో మరింత స్పెషల్‌గా రూపొందించారు. ఇందులో iGO అసిస్ట్, బూస్ట్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ మోడ్‌ల వల్ల బైక్ మరింత వేగంగా దూసుకుపోతుంది. అంతేకాకుండా, తక్కువ వేగంలో కూడా సులభంగా నడపడానికి వీలుగా గ్లైడ్ త్రూ టెక్నాలజీ (GTT) కూడా ఉంది. దీనివల్ల మైలేజ్ కూడా మెరుగ్గా ఉంటుంది.

ఈ బైక్ ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌లైట్, టెయిల్‌లైట్, ఐఎస్‌జీ సైలెంట్ స్టార్ట్ సిస్టమ్ (సౌండ్ లేకుండా స్టార్ట్ అవుతుంది), సైడ్ స్టాండ్ ఇండికేటర్, ఇంజిన్ కట్-ఆఫ్, పూర్తిగా కనెక్టెడ్ రివర్స్ ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఎల్‌సీడీ క్లస్టర్‌లో టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్ అలర్ట్, మెసేజ్ నోటిఫికేషన్, లో ఫ్యూయల్ వార్నింగ్, వాయిస్ అసిస్ట్ వంటి 85కి పైగా ఫీచర్లు ఉన్నాయి.
ఇందులో మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి: ఎకో, పవర్, బూస్ట్. ఈ బైక్‌లో 124.8 సీసీ ఇంజిన్ ఉంది. ఇది కేవలం 5.8 సెకండ్లలోనే 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ బైక్ మైలేజ్ దాదాపు 55 కిలోమీటర్ల వరకు ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








