తమిళనాడు టైగర్ టీవీఎస్.. అమ్మకాల సునామీ.. ఎగుమతుల్లోనూ తిరుగులేని రికార్డు!
తమిళనాడుకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టీవీఎస్ మోటార్ (TVS Motor) తన అమ్మకాలతో అదరగొట్టేస్తోంది. టీవీఎస్ గ్రూప్ 1911లో టీ.వీ. సుందరం అయ్యంగార్ ద్వారా ఒక రవాణా సంస్థగా ప్రారంభమైంది. 1978లో టీవీఎస్ మోటార్ కంపెనీ లిమిటెడ్ ఒక ప్రత్యేక సంస్థగా ఏర్పడింది. ప్రారంభంలో సుజుకి మోటార్ కార్పొరేషన్‌తో కలిసి 'ఇండో సుజుకి' పేరుతో మోటార్‌సైకిళ్లను ఉత్పత్తి చేసింది.
2001లో సుజుకితో భాగస్వామ్యం ముగిసిన తర్వాత, టీవీఎస్ స్వతంత్రంగా తన ఉత్పత్తులను విడుదల చేయడం ప్రారంభించింది. టీవీఎస్‌కు భారతదేశంలో తమిళనాడులోని హోసూరు, కర్ణాటకలోని మైసూరు, హిమాచల్ ప్రదేశ్‌లోని నలగఢ్‌లో అత్యాధునిక తయారీ యూనిట్లు ఉన్నాయి. ఇండోనేషియాలోని కారవాంగ్‌లో కూడా టీవీఎస్‌కు ఒక తయారీ యూనిట్ ఉంది. టీవీఎస్ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా దేశాలలో విక్రయించబడుతున్నాయి.

టీవీఎస్ మోటార్స్ ద్విచక్ర వాహనాల్లో మోపెడ్‌లు(TVS XL100), స్కూటర్లు(TVS Jupiter, TVS Ntorq, TVS iQube), మోటార్‌సైకిళ్లు(TVS Apache సిరీస్, TVS Raider, TVS Ronin) వంటి విస్తృత శ్రేణిని కలిగి ఉంది. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ బలమైన నెట్‌వర్క్‌ను కలిగి ఉన్న టీవీఎస్, 2025 మార్చి నెల అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం, టీవీఎస్ అన్ని విభాగాల్లోనూ భారీ వృద్ధిని నమోదు చేసింది.
ఓసూరులో తయారీ యూనిట్‌ను కలిగి ఉన్న టీవీఎస్ మోటార్ టూ వీలర్ వెహికల్స్‌తో పాటు త్రీ వీలర్ వెహికల్స్ కూడా ఉత్పత్తి చేసి విక్రయిస్తోంది. ఈ రెండింటినీ కలిపి 2025 మార్చి నెలలో టీవీఎస్ మోటార్ మొత్తం 4లక్షల14వేల687 వాహనాలను విక్రయించింది. ఇందులో దేశీయ అమ్మకాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేసిన వాహనాల సంఖ్య కూడా ఉంది.

గతేడాది అంటే 2024 మార్చి నెలలో టీవీఎస్ మోటార్ కేవలం 3 లక్షల 54 వేల 592 వాహనాలను మాత్రమే విక్రయించింది. ఈ లెక్కన చూస్తే, టీవీఎస్ వాహనాల అమ్మకాలు గత ఏడాది మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో 17శాతం పెరిగాయి. కేవలం టూ వీలర్స్ విషయానికి వస్తే, గత మార్చి నెలలో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 4లక్షల120 టీవీఎస్ టూ-వీలర్లు అమ్ముడయ్యాయి.
2024మార్చిలో ఈ సంఖ్య 3,44,446గా మాత్రమే నమోదైంది. ఈ ఏడాది మార్చిలో అమ్ముడైన 4,00,120 టూ వీలర్స్‌లో 1,96,734 టీవీఎస్ బైక్‌లు, 1,66,297 టీవీఎస్ స్కూటర్లు ఉన్నాయి. 2024 మార్చిలో వీటి సంఖ్య వరుసగా 1,71, 611 బైక్‌లు, 1,31,472 స్కూటర్లుగా ఉంది. అంటే బైక్‌ల అమ్మకాల్లో 15శాతం, స్కూటర్ల అమ్మకాల్లో 26 శాతం వృద్ధిని టీవీఎస్ నమోదు చేసింది.

ఇక భారతదేశంలో గత నెలలో అమ్ముడైన టీవీఎస్ టూ వీలర్ల సంఖ్య 2,97,622. 2024మార్చిలో ఈ సంఖ్య 2,60,532గా ఉంది. ఇక్కడ కూడా టీవీఎస్ 14 శాతం వృద్ధిని సాధించింది. టీవీఎస్ మోటార్ ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు కూడా గణనీయంగా పెరిగాయి. గత మార్చి నెలలో టీవీఎస్ మొత్తం 26,935 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది.
ఇందులో ఎలక్ట్రిక్ టూ వీలర్, త్రీ వీలర్ వెహికల్స్ రెండూ ఉన్నాయి. గతేడాది మార్చిలో టీవీఎస్ కేవలం 15 వేల 250 ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే విక్రయించింది. అంటే ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో టీవీఎస్ ఏకంగా 77 శాతం వృద్ధిని నమోదు చేసింది.

టీవీఎస్ మోటార్ ప్రధానంగా టూ వీలర్స్ పైనే దృష్టి సారించినప్పటికీ, త్రీ వీలర్స్ విక్రయాలు కూడా మంచి వృద్ధిని కనబరిచాయి. గత మార్చి నెలలో టీవీఎస్ మొత్తం 14,567 త్రీ వీలర్స్ విక్రయించింది. 2024 మార్చిలో ఈ సంఖ్య కేవలం 10,146గా ఉంది. ఈ విధంగా చూస్తే, టీవీఎస్ త్రీ వీలర్స్ అమ్మకాలు 44 శాతం పెరిగాయి.
మనదేశంలో తయారైన టీవీఎస్ వాహనాల ఎగుమతులు కూడా భారీగా పెరిగాయి. గత నెలలో టీవీఎస్ 1,13,464 వాహనాలను విదేశాలకు ఎగుమతి చేసింది. 2024మార్చిలో ఈ సంఖ్య లక్షను కూడా దాటలేదు.. కేవలం 91,972 వాహనాలు మాత్రమే ఎగుమతి అయ్యాయి. ఈ లెక్కన టీవీఎస్ ఎగుమతులు 23 శాతం పెరిగాయి. కేవలం టూ వీలర్స్ ఎగుమతి విషయానికి వస్తే, టీవీఎస్ గత నెలలో 1,02,498 యూనిట్లను విదేశాలకు పంపింది.

2024మార్చిలో ఈ సంఖ్య 83,914గా ఉంది. ఇక 2025 ఏడాదిలోని మొదటి మూడు నెలల (జనవరి-మార్చి) గణాంకాలను పరిశీలిస్తే, టీవీఎస్ మోటార్ మొత్తం 11.80లక్షల టూ వీలర్స్(దేశీయ అమ్మకాలు + ఎగుమతులు) విక్రయించింది. 2024మొదటి మూడు నెలల్లో ఈ సంఖ్య 10.32లక్షలుగా ఉంది. ఈ విధంగా చూస్తే, ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో టీవీఎస్ టూ వీలర్స్ అమ్మకాలు 14శాతం పెరిగాయి.
అలాగే, మొదటి మూడు నెలల్లో విక్రయించిన త్రీ వీలర్ వెహికల్స్ సంఖ్య 37 వేలు. ఇది గత ఏడాది ఇదే కాలంలో విక్రయించిన 30వేల 3-వీలర్ల కంటే 21శాతం ఎక్కువ. ఇదే సమయంలో టీవీఎస్ మోటార్ విదేశీ ఎగుమతులు కూడా 31శాతం పెరిగాయి. గతేడాది మొదటి మూడు నెలల్లో 2.60 లక్షల వాహనాలను ఎగుమతి చేయగా, ఈ ఏడాది అదే కాలంలో 3.40 లక్షల వాహనాలను టీవీఎస్ ఎగుమతి చేసింది.

డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య : తమిళనాడుకు చెందిన టీవీఎస్ మోటార్ అన్ని విభాగాల్లోనూ వృద్ధిని నమోదు చేయడం అభినందించదగ్గ విషయం. ముఖ్యంగా, ఎగుమతులు నిరంతరం పెరుగుతుండటం అంతర్జాతీయ మార్కెట్లో టీవీఎస్ ఆధిపత్యాన్ని పెంచుతుంది. ఈ పరిస్థితిని భవిష్యతులో కూడా టీవీఎస్ మనుగడ ఇలాగే కొనసాగించి ప్రత్యర్థి కంపెనీలకు గట్టి పోటీ ఇస్తుందేమో చూడాలి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








