ఒకే ఏడాదిలో 3 లక్షల విక్రయాలు.. టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ సంచలన విజయం!
టీవీఎస్ మోటార్ (Tvs Motor) భారతదేశంలో ప్రముఖ టూవీలర్ తయారీదారులో ఒకటి. ఈ సంస్థ, తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube) ద్వారా ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి అడుగుపెట్టింది. ఈ స్కూటర్ ఇప్పుడు భారత మార్కెట్లో ఓ భారీ మైలురాయిని అధిగమించి చరిత్ర సృష్టించింది. ఏప్రిల్ 2025 చివరి నాటికి iQube అమ్మకాలు 5.99 లక్షల యూనిట్ల దాకా చేరుకోగా, మే నెల తొలి రెండు రోజుల్లోనే 1,345 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. దీని ఫలితంగా మే 2025 చివరి నాటికి మొత్తం 6,26,297 యూనిట్ల సేల్స్ నమోదయ్యాయి. గణాంకాల ప్రకారం, iQube ఒక్క నెలలోనే ఒక కొత్త శిఖరాన్ని తాకింది. అంతేకాదు , మే 2025లో దేశవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన స్కూటర్‌గా కూడా నిలిచింది.
ఇది టీవీఎస్ కంపెనీకి కేవలం వ్యాపార పరంగా మాత్రమే కాకుండా, వినియోగదారుల విశ్వాసాన్ని ప్రతిబింబించే ఘనత. ఐక్యూబ్ మొదటి లక్ష యూనిట్ల అమ్మకాల కోసం సంస్థకు 3 సంవత్సరాలు పట్టింది. అదే తర్వాతి లక్షకు కేవలం 10 నెలలలోనే చేరుకుంది. మే 2024 నాటికి 3 లక్షల యూనిట్ల మైలురాయి దాటి మరో కీలక ఘట్టాన్ని ఆవిష్కరించింది. iQube ఇప్పుడు తక్కువ ఖర్చుతో ప్రయాణించాలని కోరుకునే వారికి బెస్ట్ మోడల్.

టీవీఎస్ మోటార్ సంస్థ తమ తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ iQubeను జనవరి 2020లో మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అప్పట్లో ఎలక్ట్రిక్ వాహనాలపై వినియోగదారుల్లో సందేహాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, TVS ధైర్యంగా ముందడుగు వేసింది. అప్పటి నుంచి సక్సెస్‌ఫుల్‌గా మారింది. ఈ మోడల్, తన ప్రయాణాన్ని నెమ్మదిగా మొదలుపెట్టింది. మొదటి 6 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని చేరుకోవడానికి 52 నెలలు, అంటే 4 సంవత్సరాలు 4 నెలలు పట్టింది.
ఇదే కాలంలో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలపైన అవగాహన పెరిగింది, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాల ప్రభావం పెరిగింది, వినియోగదారుల అభిరుచులు కూడా మారాయి. ఈ పరిణామాలన్నింటిని అద్దం పట్టేలా, తదుపరి 3 లక్షల యూనిట్ల అమ్మకాలు కేవలం 12 నెలల్లోనే పూర్తి కావడం విశేషం. అంటే, స్కూటర్ డిమాండ్ గతంలో ఎప్పుడూ లేనంతగా పెరిగిందని స్పష్టమవుతుంది. ఇది టీవీఎస్ ఐక్యూబ్ యొక్క విశ్వసనీయత.

మొత్తంగా చూస్తే, ప్రపంచవ్యాప్తంగా ఈ స్కూటర్ 6 లక్షల యూనిట్లను చేరుకోవడానికి 65 నెలలు పట్టింది. ఈ గణాంకాలు పరిశీలిస్తే, గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో టీవీఎస్ కంపెనీకి అమ్మకాల పరంగా స్పష్టమైన వృద్ధి కనిపించింది. గత ఆర్థిక సంవత్సరం స్పష్టంగా వేగవంతమైన పురోగతిని నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇదే ఉత్సాహంతో మరింత మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందన్నది పరిశ్రమలోని అభిప్రాయం.
ఈ నేపథ్యంలో, టీవీఎస్ 2025లో iQube 2025 ఎడిషన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇది సాంకేతికత, డిజైన్, మైలేజ్ పరంగా మరింత అభివృద్ధి చెందిన మోడల్. వినియోగదారులు ఇప్పుడు ఐక్యూబ్‌ను కేవలం ఒక ఎలక్ట్రిక్ స్కూటర్‌గా కాకుండా, సంపూర్ణ ప్రయాణ భాగస్వామిగా భావిస్తున్నారు. ఈ ప్రయాణం, టీవీఎస్ సంస్థకు మాత్రమే కాదు, దేశంలో ఎలక్ట్రిక్ వాహన రంగానికి, ఉత్సాహంగా ఎదుగుతున్న మార్కెట్‌కు కూడా ఓ మార్గదర్శకంగా నిలిచింది.

టీవీఎస్ iQube ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు వినియోగదారులకు మరింత విభిన్నంగా, అవసరాలకు అనుగుణంగా ఎంపికలు అందిస్తోంది. ప్రస్తుతం ఇది మూడు బ్యాటరీ ఆప్షన్లలో లభ్యమవుతుంది, 2.2 kWh, 3.5 kWh, 5.3 kWh. iQube ఒక్కసారి ఛార్జ్ చేసిన తర్వాత 94 కి.మీ నుండి 212 కి.మీ వరకు ప్రయాణించగలదు. ఇది నగర ప్రయాణాలకే కాకుండా, కొంతదూరం ప్రయాణించే వారికి కూడా సరైన ఎంపికగా నిలుస్తోంది.


Click it and Unblock the Notifications








