మార్కెట్‌పై పంజా విసిరిన టీవీఎస్.. కేవలం 30 రోజుల్లో 4 లక్షలు.. స్కూటర్, బైక్ అమ్మకాలు చూస్తే మైండ్ బ్లాంక్!

ప్రముఖ వాహన తయారీదారు టీవీఎస్ (Tvs) మోటార్ కంపెనీ ఇటీవలి కాలంలో అమ్మకాల పరంగా మెరుగ్గా దూసుకుపోతుంది. తాజాగా జూన్ నెల ముగిసిన నేపథ్యంలో కంపెనీ తన సేల్స్ వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం, జూన్ 2025 నెలలో మొత్తం (టూ+త్రీవీలర్) నెలవారీ అమ్మకాలు 4,02,001 యూనిట్లకు చేరుకున్నాయి, ఇది గత సంవత్సరం జూన్‌లో నమోదైన 3,33,646 యూనిట్లతో పోలిస్తే దాదాపు 20 శాతం వృద్ధి. సమీక్ష నెల టీవీఎస్ మోటార్‌కు మరొక పెద్ద విజయాన్ని తీసుకొచ్చింది. టీవీఎస్ టూవీలర్ విభాగం కూడా ఈ విజయంలో ప్రధాన పాత్ర పోషించింది. జూన్ 2024లో 3,22,168 యూనిట్లు విక్రయించగా, జూన్ 2025లో ఈ సంఖ్య 3,85,698 యూనిట్లకు పెరిగింది. ఈ విభాగం 20 శాతం వృద్ధిను సొంతం చేసుకోవడం కంపెనీ స్థిరమైన డిమాండ్‌ను చాటుతుంది.

అంతేకాదు, దేశీయ టూవీలర్ అమ్మకాలు కూడా నిలకడగా దూసుకెళ్ళాయి. ఈ మొత్తంలో జూన్ 2024లో 2,55,734 యూనిట్లు దేశంలో అమ్ముడవ్వగా, జూన్ 2025లో 2,81,012 యూనిట్లు అమ్ముడుపోయాయి, దాదాపు ఇది 10 శాతం వృద్ధిగా నమోదైంది. ఇక త్రైమాసికంగా చూసినట్లయితే గత 91 రోజుల్లో టీవీఎస్ మోటార్ కంపెనీ మొత్తం 12.77 లక్షల టూవీలర్, త్రీవీలర్రాల వాహనాలను ఉత్పత్తి చేసింది.

Tvs Motor June 2025 Sales

ఈ సంఖ్యకు ముందు ఆర్థిక సంవత్సరం (2024-25) మొదటి త్రైమాసికంలో 10.87 లక్షల యూనిట్లు మాత్రమే అమ్ముడుపోగా, దాంతో పోలిస్తే, ఈ సారి అమ్మకాల్లో సుమారు 17 శాతం వృద్ధి సాధించడం టీవీఎస్‌కి ఒక కొత్త మైలురాయిగా నిలిచింది. ఈ గణాంకాలు టీవీఎస్ బ్రాండ్‌కి ఉన్న స్థిరమైన డిమాండ్‌ను, కంపెనీ సరఫరా సామర్థ్యాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. ఉత్పత్తి, విక్రయాలు ఇలా రెండింటినీ రికార్డు స్థాయిలో పెంచుకోవడం గొప్ప విశేషం.

పండుగ సీజన్‌కు ముందే ఇలాంటి వృద్ధిని నమోదు చేయడం, రాబోయే త్రైమాసికాలపైనా ఆశావహంగా ఉండేలా చేసింది. జూన్ 2025లో మొత్తం టూవీలర్ అమ్మకాల్లో మోటార్‌సైకిల్ విభాగం ప్రత్యేకంగా 24 శాతం వృద్ధిని నమోదు చేసింది. జూన్ 2024లో 1,52,701 యూనిట్లు మాత్రమే అమ్ముడవ్వగా, జూన్ 2025లో ఈ సంఖ్య 1,88,774 యూనిట్లకు పెరగడం గమనార్హం. దీనితో మోటార్‌సైకిళ్ల సగటు డిమాండ్ మరింత బలపడిందని స్పష్టమవుతోంది.

Tvs Motor June 2025 Sales 4 Lakh Units It Is 20 Percent Growth

అంతేకాదు, స్కూటర్ విభాగం మరింత ఆశాజనకంగా దూసుకెళ్ళింది. జూన్ 2024లో 1,28,986 యూనిట్లు అమ్ముడుపోగా, జూన్ 2025లో వాటి అమ్మకాలు 1,62,291 యూనిట్లకు చేరుకున్నాయి. ఇది సుమారు 26 శాతం వృద్ధి, టీవీఎస్ స్కూటర్లకు విస్తృతంగా ఉన్న ఆదరణను ప్రతిబింబిస్తోంది. ఈ రెండు ప్రధాన కేటగిరీలు.. మోటార్‌సైకిళ్లు,స్కూటర్లు అమ్మకాలలో కొత్త శిఖరాలను అధిగమించడం, కంపెనీ సమర్థమైన ఉత్పత్తి వ్యూహాలకు ప్రతీకలుగా నిలిచాయి.

ఈసారి టీవీఎస్ మోటార్ కంపెనీ గణాంకాల వెనుక ఉన్న ప్రధాన కారణాలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా, TVS iQube ఎలక్ట్రిక్ స్కూటర్‌కి వినియోగదారుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ మోడల్‌కి పెరుగుతున్న డిమాండ్ వలన దేశీయ అమ్మకాలతోపాటు బ్రాండ్ ప్రతిష్ట కూడా గణనీయంగా పెరిగింది. ఇక ఎగుమతుల విషయానికి వస్తే గతంతో పోలిస్తే మరింత ఆశాజనకంగా కనిపించింది.

Tvs June 2025 Sales Report

గత ఏడాది జూన్‌లో కంపెనీ 76,074 వాహనాలు మాత్రమే ఎగుమతి చేయగా, ఈసారి ఆ సంఖ్య 1,17,145 వాహనాలకు చేరుకుంది. ఇది ఏకంగా 54 శాతం వృద్ధిగా నమోదై, అంతర్జాతీయ మార్కెట్లలో టీవీఎస్ ఉత్పత్తులకు ఉన్న ఆదరణను రుజువు చేసింది. ఈ ఎగుమతుల్లో 1,04,686 టూవీలర్స్ ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించాయి, వాహనాల క్వాలిటీ, ధర, నమ్మకం వంటి అంశాల వల్లే ఈ స్థాయి డిమాండ్ వచ్చినట్లు స్పష్టమవుతోంది.

ఇంకొక ముఖ్యమైన అంశం, త్రైమాసికపు ఎగుమతి గణాంకాలు కూడా కొత్త రికార్డులు సృష్టించాయి. మొత్తం 3.52 లక్షల వాహనాలు ఎగుమతి కాగా, గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఇది 2.54 లక్షల వాహనాలకే పరిమితమైంది. ఇలా చూస్తే, ఏకంగా 39 శాతం వృద్ధిని సాధించింది. టీవీఎస్ ఈ ఎగుమతుల ఆధారంగా గ్లోబల్ మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలపరుస్తూ, ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోనూ గణనీయమైన గుర్తింపు సంపాదిస్తున్నట్టు స్పష్టమవుతోంది.

More from DriveSpark

Article Published On: Wednesday, July 2, 2025, 11:33 [IST]
English summary
Tvs motor june 2025 sales 4 lakh units it is 20 percent growth compared to previous
Read more on: #tvs motor #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+