బైక్‌లంటే పిచ్చి ఉన్న వారు ఇది మిస్ అవ్వకూడదు! అదిరిపోయే టీవీఎస్ అపాచీ వచ్చేసింది
టీవీఎస్ మోటార్ (Tvs Motor) భారతదేశపు ప్రసిద్ధ టూవీలర్ తయారీదారుగా ఉంది. ఆ సంస్థ అందించే బైకుల్లో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నది అపాచీ సిరీస్. ఈ సిరీస్ బైక్‌లు వినియోగదారుల మనసు దోచుకున్నాయి. ప్రత్యేకంగా యువతలో విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. టీవీఎస్ మోటార్, టూవీలర్ వాహనాలకే కాకుండా మూడు చక్రాల వాహనాల తయారీలోనూ తనదైన గుర్తింపు కలిగి ఉంది.అపాచీ బ్రాండ్‌కు ఉన్న ప్రాముఖ్యత మాత్రం మరే వాహనానికి సాధ్యపడని స్థాయిలో ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో టీవీఎస్ అపాచీ బైక్‌లు 160cc నుండి 310cc వరకు వివిధ శ్రేణుల్లో లభిస్తున్నాయి. అయితే, ఈ సిరీస్‌లో ఎక్కువ మంది వినియోగదారులు ఎంచుకునే మోడల్ మాత్రం అపాచీ RTR 200.
ఈ మోడల్ వినియోగదారులకు మంచి పనితీరు, లేటెస్ట్ ఫీచర్లను సమానంగా అందిస్తోంది. దాంతో పాటు ప్రయాణంలో సౌకర్యంగా అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో, టీవీఎస్ మోటార్ 2025 సంవత్సరానికి అపాచీ RTR 200 బైక్‌ను మరింత మెరుగుపరుస్తూ కొత్త అప్‌డేట్ మోడల్‌ను విడుదల చేసింది. ఈ తాజా మోడల్‌లో పలు కీలక అప్‌డేట్‌లు చోటుచేసుకున్నాయి, ఇవి ప్రయాణ అనుభవాన్ని మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్దడమే కాకుండా, బైక్‌కు లేటెస్ట్ అంశాలను కలిగించాయి.

కొత్తగా విడుదలైన టీవీఎస్ అపాచీ RTR 200 బైక్ డిజైన్ పరంగా స్పష్టమైన మార్పులతో ముందుకొచ్చింది. ఎప్పటికీ అపాచీ సిరీస్ బైక్‌లకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అంశం వాటి డిజైన్, ఈసారి కూడా బైక్ లుక్ మీద టీవీఎస్ ఎక్కువ శ్రద్ధ పెట్టినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఈసారి అపాచీ RTR 200 బైక్ డిజైన్లో ప్రధానంగా నలుపు రంగు ఎక్కువగా కనిపిస్తుంది.
గత మోడళ్లతో పోలిస్తే, ఈ కొత్త బైక్ వెనుక పూర్తిగా నలుపుతో డిజైన్ చేయబడింది. ముందు భాగంలో మాత్రం ఎరుపు, నలుపు రంగుల కలయికగా కనిపిస్తుంది, ఇది బైక్‌కు స్పోర్టీ లుక్‌ని ఇచ్చేలా ఉంటుంది. అత్యంత ఆసక్తికర అంశం ముందు చక్రం ఎరుపు రంగులో ఉండడం, వెనుక చక్రం నలుపు రంగులో ఉండడం. ఈ రెండు వేర్వేరు రంగుల కలయిక బైక్‌కు కొత్త ఉత్సాహాన్ని, రోడ్‌పై ప్రత్యేక హుందాతనాన్ని ఇస్తుంది.

ఈ కలర్స్ కలయిక, సాధారణంగా టూవీలర్ వాహనాల్లో కనిపించదు కనుక, ఇది RTR200 బైక్‌ను మరింత ప్రత్యేకంగా నిలబెడుతోంది. పెట్రోల్ ట్యాంక్‌పై ఉన్న గ్రాఫిక్స్ కూడా మునుపటివాటితో పోలిస్తే కొంత మార్పు చెందాయి. RTR అనే అక్షరాలను ఎప్పటిలాగే పెద్దదిగా, శక్తివంతంగా ముద్రించారని చెప్పాలి. గ్రాఫిక్స్ కొంచెం గందరగోళంగా ఉన్నప్పటికీ, చూసేందుకు ఆకర్షణీయంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది మ్యాట్ బ్లాక్, గ్లోసీ బ్లాక్, గ్రానైట్ గ్రే అనే కలర్స్‌లో లభిస్తుంది.
2025 సంవత్సరానికి టీవీఎస్ మోటార్ విడుదల చేసిన కొత్త అపాచీ RTR 200 బైక్ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 1,53,990గా నిర్ణయించారు. ఇది మార్కెట్లో పోటీదారుల మధ్య బలమైన స్థాయిని సూచిస్తుంది. పనితీరు విషయంలో, ఈ మోడల్‌లో పూర్తిగా కొత్త ఇంజిన్‌ను ప్రవేశపెట్టలేదు. కొత్త అపాచీ RTR 200 బైక్ 197.75 cc ఆయిల్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజిన్‌తో శక్తిని పొందుతుంది.
ఇంజిన్ గరిష్టంగా 9,000 rpm వద్ద 20.8 PS పవర్‌ను, 7,250 rpm వద్ద 17.25 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇవి రోజువారీ ప్రయాణాల్లో మాత్రమే కాకుండా, స్పోర్టీ రైడింగ్ కోసం కూడా సరిపోయే స్థాయిలో ఉంటాయి. ఈ ఇంజిన్‌కు 5-స్పీడ్ గేర్‌బాక్స్ జతచేయబడి ఉంది, ఇది స్మూత్ షిఫ్టింగ్ అనుభూతిని అందిస్తుంది. స్లిప్పర్ క్లచ్‌ను ద్వారా వేగంగా గేర్ డౌన్ చేసినప్పుడు స్టెబిలిటీ కోల్పోకుండా నియంత్రణలో ఉంటుంది.


Click it and Unblock the Notifications








