5 లక్షల కుటుంబాల కల నెరవేర్చిన టీవీఎస్.. దేశం గర్వపడేలా సేల్స్‌లో సరికొత్త మైలురాయి
తమిళనాడుకు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ (TVS Motor), ఇటీవల జరిగిన ఆగస్టు నెల అమ్మకాల్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకే నెలలో ఏకంగా 5 లక్షల యూనిట్లకు పైగా వాహనాలను అమ్మి, తమ చరిత్రలోనే అత్యుత్తమ రికార్డును నమోదు చేసింది. దేశీయ మార్కెట్తో పాటు అంతర్జాతీయ మార్కెట్లో కూడా టీవీఎస్ మోటార్స్ చూపించిన ఈ అద్భుతమైన వృద్ధి, అందరినీ ఆశ్చర్యపరిచింది.
తమిళనాడులోని హోసూర్‌లో తమ ప్లాంట్‌ను స్థాపించిన టీవీఎస్ మోటార్స్, కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని పలు దేశాల్లో కూడా తమ ఉనికిని చాటుతోంది. ఇటీవల 2025 ఆగస్టు నెలలో కంపెనీ అమ్మిన మొత్తం వాహనాల సంఖ్య 5,09,536.

టీవీఎస్ కంపెనీ ఒక నెలలో 5 లక్షల అమ్మకాల మార్కును దాటడం ఇదే మొదటిసారి. ఈ ఘనతపై కంపెనీ స్వయంగా అధికారిక ప్రకటనను విడుదల చేసింది. గతేడాది అంటే 2024 ఆగస్టులో 3,91,588 యూనిట్లు అమ్మింది. దీంతో పోలిస్తే, ఈసారి అమ్మకాలు ఏకంగా 30% పెరిగాయి.
ఈ మొత్తం అమ్మకాల్లో టూ వీలర్లు, త్రీ వీలర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఉన్నాయి. వీటిలో టూ వీలర్ల అమ్మకాలు ముఖ్యంగా పెరిగాయి. ఆగస్టు నెలలో టీవీఎస్ ఏకంగా 4,90,788 టూ వీలర్లను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో 3,78,841 వాహనాలను మాత్రమే అమ్మడం జరిగింది. అంటే, ఈ విభాగంలో కూడా దాదాపు 30% వృద్ధి కనిపించింది.

భారతదేశంలో మాత్రమే చూస్తే, టీవీఎస్ మోటార్స్ 3,68,862 టూ వీలర్లను సేల్ చేసింది. గతేడాది ఈ సంఖ్య 2,89,073గా ఉంది. ఈ గణాంకాలు టీవీఎస్ మోటార్స్‌కు ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో వస్తున్న అద్భుతమైన వృద్ధిని స్పష్టంగా చూపిస్తున్నాయి.
ఎలక్ట్రిక్ వాహనాల విషయానికొస్తే, ఈ ఆగస్టులో టీవీఎస్ 25,138 ఎలక్ట్రిక్ వాహనాలను అమ్మింది. గతేడాది ఆగస్టులో ఈ సంఖ్య 24,779గా ఉంది. అంటే, ఈ విభాగంలో కేవలం 359 యూనిట్ల పెరుగుదల మాత్రమే ఉంది.

మూడు చక్రాల వాహనాల అమ్మకాల్లో మాత్రం అద్భుతమైన వృద్ధి నమోదైంది. ఈ ఆగస్టులో టీవీఎస్ 18,748 త్రీ వీలర్లను సేల్ చేసింది. గతేడాది ఆగస్టులో ఈ సంఖ్య 12,747 మాత్రమే. అంటే, ఈ విభాగంలో ఏకంగా 47% వృద్ధి కనిపించింది.
డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం : టీవీఎస్ మోటార్ కంపెనీ ఇటీవల కాలంలో సాధించిన అభివృద్ధి చాలా గమనించదగినది. గత ఆగస్టు నెలలో టీవీఎస్ కంపెనీ అమ్మకాలు కొత్త శిఖరాలను తాకాయి. ఒక నెలలో మొత్తం అమ్మకాలలో టీవీఎస్ 5 లక్షలను దాటడంతో, భవిష్యత్తులో కూడా ఇదే రికార్డును కొనసాగించడానికి ప్రయత్నిస్తుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








