ఒక్క మోడల్‌తో చరిత్ర సృష్టించిన టీవీఎస్.. ఆ ఒక్కటి ఏకంగా మార్కెట్‌ను షేక్ చేసింది!

టీవీఎస్ మోటార్ కంపెనీ, దేశంలో ప్రముఖ టూవీలర్ తయారీదారిగా మరోసారి తన స్థాయిని చాటుకుంది. తాజాగా మే నెల ముగిసిన నేపథ్యంలో పలు వాహన తయారీదారులు తమ సేల్స్ వివరాలను విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో టీవీఎస్ కూడా తన అమ్మకాలను వెల్లడించింది. దీని ప్రకారం, మే 2025లో సంస్థ మెరుగైన వృద్ధిని సాధించింది. ఈ నెల మొత్తం 4,31,275 యూనిట్ల (టూ వీలర్+త్రీవీలర్) వాహనాలను విక్రయించింది. గత సంవత్సరం ఇదే కాలంలో విక్రయించిన 3,69,914 యూనిట్లతో పోలిస్తే ఇది దాదాపు 17 శాతం వృద్ధిని సాధించింది. ఈ సంఖ్యల్లో టూవీలర్స్ మాత్రమే కాక త్రీవీలర్ వాహనాలు కూడా ఉన్నాయి. టూవీలర్ సెగ్మెంట్‌లో బైక్‌లు, స్కూటర్లను కలిపి, సంస్థ మే నెలలో ఏకంగా 4,16,166 యూనిట్లు విక్రయించింది.

ఇది 2024 మే నెలలో నమోదైన 359,590 యూనిట్లతో పోలిస్తే సుమారు 16 శాతం పెరుగుదల. టీవీఎస్ కంపెనీ పట్ల వినియోగదారుల్లో ఉన్న నమ్మకం, మోడళ్ల స్థిరమైన నాణ్యత ఈ వృద్ధికి మూల కారణాలుగా నిలిచాయి. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో చూసినట్లయితే వీటిలో టీవీఎస్ ఐ-క్యూబ్ (iQube) ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ మోడల్ ఇప్పటికే తనదైన స్థాయిని ఏర్పరుచుకుంది.

Tvs Motor May 2025 Sales 17 Percent Growth

2025 మేలో ఐ-క్యూబ్ మంచి అమ్మకాల్ని నమోదు చేస్తూ, టీవీఎస్ ఎలక్ట్రిక్‌కు మంచి తోడ్పాటు అందించింది. పెరుగుతున్న పెట్రోల్ ధరలు, మారుతున్న వినియోగదారుల అభిరుచులు, ప్రభుత్వ ప్రోత్సాహకాలతో కలిపి, ఈ ఎలక్ట్రిక్ మోడల్ మరింతగా ప్రజాదరణ పొందుతున్నది. ఇదే ధోరణి కొనసాగితే, టీవీఎస్ మోటార్ కంపెనీ వచ్చే నెలల్లో మరింత వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉంది. టీవీఎస్ మోటార్ కంపెనీకి మే 2025 అమ్మకాలు మంచి ఫలితాలను ఇచ్చాయి.

ఒకవైపు దేశీయ మార్కెట్‌లో బైక్‌లు, స్కూటర్ల సేల్స్‌లో దూసుకెళ్తున్న ఈ సంస్థ, మరోవైపు త్రీవీలర్ విక్రయాలతోనూ ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా టీవీఎస్ ఆటో రిక్షాలు ప్రస్తుతం మార్కెట్‌లో విపరీతంగా డిమాండ్‌ను కలిగి ఉన్నాయి. గత నెలలో, అంటే మే 2025లో సంస్థ మొత్తం 15,109 త్రీవీలర్ వాహనాలను విక్రయించింది. ఇదే కాలంలో గత సంవత్సరం (మే 2024) అమ్మకాలు 10,324 యూనిట్లుగా నమోదవగా, ఇప్పుడు దాదాపు 46% వృద్ధి కనిపించటం విశేషం.

Tvs Motor Iqube

ఈ గణాంకాలు చూస్తే, ప్రజా రవాణా అవసరాల్లో టీవీఎస్ ఆటోలకు ఉన్న ఆదరణ స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం దేశీయ మార్కెట్‌‌లోనే కాదు, అంతర్జాతీయ మార్కెట్లలోనూ టీవీఎస్ ప్రభావం చూపిస్తోంది. 2025 మే నెలలో సంస్థ 1,18,437 టూవీలర్, త్రీవీలర్ వాహనాలను ఎగుమతి చేసింది. ఇది 2024 మేలో నమోదైన 96,966 యూనిట్లతో పోల్చితే 22% వృద్ధి. ఈ ఎగుమతుల గణాంకాలు చూస్తే, టీవీఎస్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణ తెలుస్తుంది.

ఎలక్ట్రిక్ వాహన విభాగంలో టీవీఎస్ మోటార్ మంచి వృద్ధితో దూసుకెళ్తోంది. మే 2025లో టీవీఎస్ దాదాపు 27,976 యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించగా, ఇదే కాలంలో 2024లో 18,674 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ గణాంకాలను పరిశీలిస్తే, సంస్థ సరిగ్గా 50% వృద్ధిని నమోదు చేసింది. ఈ విపరీతమైన పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలిచింది టీవీఎస్ ప్రసిద్ధ ఎలక్ట్రిక్ స్కూటర్ 'iQube'.

Tvs Motor May 2025 Sales 17 Percent Growth Iqube

మార్కెట్‌లోకి వచ్చినప్పటి నుంచే ఈ మోడల్ వినియోగదారుల నమ్మకాన్ని సంపాదించుకుంది. అధునాతన ఫీచర్లు, ప్రాక్టికల్ రేంజ్, టీవీఎస్ బ్రాండ్‌పై ఉన్న విశ్వసనీయత కలిసి iQubeను EV సెగ్మెంట్‌లో ఒక ప్రధాన మోడల్‌గా నిలబెట్టాయి. ప్రస్తుతం పెరుగుతున్న ఇంధన ధరలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్‌కు అనుగుణంగా స్మార్ట్, సౌకర్యవంతమైన వాహనాలు అవసరం కాగా, ఇవన్నీ కలిపి టీవీఎస్ ఎలక్ట్రిక్ విక్రయాలకు బలాన్ని చేకూర్చాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, June 3, 2025, 10:50 [IST]
English summary
Tvs motor may 2025 sales 17 percent growth iqube become top performer
Read more on: #tvs motor #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+