ఇలాంటి స్కూటర్ కోసం దేశం ఎదురు చూస్తోంది! విదేశాల నుంచి అదిరిపోయే మోడల్.. ఎప్పుడు వస్తుందో మరి?

టీవీఎస్ (Tvs) మోటార్ కంపెనీ భారతీయ టూవీలర్ మార్కెట్‌లో తనదైన స్థానం సంపాదించుకుంది. పెరుగుతున్న పోటీ, మారుతున్న వినియోగదారుల అభిరుచులు, ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఇప్పుడు మరో కీలక అడుగు వేయడానికి సిద్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం, నవంబర్‌లో ఇటలీలో జరగనున్న ప్రపంచ ప్రఖ్యాత ఆటో ఎగ్జిబిషన్ EICMA 2025లో టీవీఎస్ తన కొత్త ఎలక్ట్రిక్ మ్యాక్సీ స్కూటర్ ఎం1 ఎస్(M1-S)ను అధికారికంగా ఆవిష్కరించనుంది. ఈ కొత్త మోడల్‌పై ఇప్పటికే మార్కెట్లో భారీ ఆసక్తి నెలకొంది. టీవీఎస్ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌ ద్వారా ఈ స్కూటర్‌కు సంబంధించిన టీజర్ వీడియోను విడుదల చేసింది, దీని ద్వారా స్కూటర్‌ డిజైన్, ప్రీమియం లుక్‌, ఆధునిక టెక్నాలజీ గురించి ఒక గ్లింప్స్‌ ఇచ్చింది.

టీజర్‌ రిలీజ్‌తోనే అభిమానుల్లో ఆసక్తి పెరిగి, ఇది TVS ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌కి గేమ్‌ ఛేంజర్ అవుతుందా? అనే చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ స్కూటర్ అభివృద్ధి వెనుక ఒక ఆసక్తికరమైన భాగస్వామ్యం ఉంది. టీవీఎస్ మోటార్ సింగపూర్‌కు చెందిన Aion Group‌‌తో కలిసి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లింది. Aion M1-S అనే పేరుతో ప్రారంభమైన ఈ స్కూటర్ ప్రాజెక్ట్‌లో టీవీఎస్ ప్రధాన పెట్టుబడిదారుగా వ్యవహరించింది.

Tvs New Electric Scooter M1 S Maxi Will Be Unveiled At Eicma-2025

ఆ ప్రాజెక్ట్‌ సాంకేతిక అభివృద్ధి, ఉత్పత్తి రూపకల్పన, అంతర్జాతీయ మార్కెట్‌ వ్యూహాలపై టీవీఎస్ పూర్తి ఆధిపత్యాన్ని కలిగి ఉంది. M1-S మ్యాక్సీ స్కూటర్ అని చెప్పవచ్చు, అంటే పెద్ద పరిమాణం, ఎక్కువ కంఫర్ట్‌, లాంగ్ రేంజ్‌ రైడింగ్‌కి అనువైనది. టీవీఎస్ ఈ మోడల్‌ను ప్రీమియమ్ సెగ్మెంట్‌లో ఉంచే అవకాశం ఉంది, తద్వారా ఇది Ola S1 Pro, Ather 450 Apex వంటి టాప్‌ ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీ పడగలదు.

టీవీఎస్ M1-S మ్యాక్సీ స్కూటర్ కేవలం డిజైన్‌ పరంగా కాకుండా, పనితీరులో కూడా కొత్త ప్రమాణాలను నెలకొల్పేలా కనిపిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 4.3kWh సామర్థ్యంతో కూడిన లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ అమర్చబడింది. ఈ శక్తివంతమైన బ్యాటరీ స్కూటర్‌కు గణనీయమైన పనితీరు, రేంజ్‌ను అందిస్తుంది. ఇది 16.76 BHP పవర్, 45Nm పీక్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఈ గణాంకాలు చూస్తేనే ఇది సాధారణ ఎలక్ట్రిక్ స్కూటర్ కాదని స్పష్టమవుతుంది.

Tvs New Electric Scooter M1 S Maxi Will Be Unveiled At Eicma-2025

ఇది కేవలం 3.7 సెకన్లలోనే 0 నుండి 50 kmph వేగాన్ని చేరుకోగలదు, అంటే నగర ప్రయాణాల్లో కూడా మెరుగైన రైడింగ్ ఇస్తుంది. టాప్ స్పీడ్ విషయానికి వస్తే, M1-S స్కూటర్ 105 kmph వరకు వేగంతో ప్రయాణించగలదు. ఇది ప్రస్తుత ఎలక్ట్రిక్ స్కూటర్లలో చాలా అరుదుగా కనిపించే అంశం. రేంజ్ విషయానికి వస్తే, టీవీఎస్ ఈ వాహనాన్ని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.

భారతదేశంలో దీని ఆవిష్కరణపై కంపెనీ నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ వాహనం మొదటగా ఇండోనేషియా మార్కెట్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అక్కడి నుంచి మంచి స్పందన వచ్చిన తర్వాత, దీన్ని భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టే ప్రణాళికలను TVS పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇండోనేషియా మార్కెట్‌లో టెస్టింగ్ పూర్తి అయిన వెంటనే, భారత మార్కెట్లో కూడా దీని లాంచ్ కావచ్చు.

Tvs New Electric Scooter M1 S Maxi Will Be Unveiled At Eicma-2025

టీవీఎస్ M1-S మ్యాక్సీ స్కూటర్‌లో ఫీచర్ల పరంగా 7-అంగుళాల TFT డిస్ప్లే,మ్యూజిక్ కంట్రోల్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్, కాల్/SMS అలర్ట్, స్మార్ట్ కీ సిస్టమ్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి. ఈ స్కూటర్ గురించిన ధర వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఇండోనేషియా విడుదల సమయంలో భారత్‌లో లాంచ్‌పై కూడా రావచ్చు. అలాగే, అప్పేడే దాని ధర గురించి సమాచారం అందించనున్నారు.

More from DriveSpark

Article Published On: Monday, October 27, 2025, 14:02 [IST]
English summary
Tvs new electric scooter m1 s maxi will be unveiled at eicma 2025
Read more on: #tvs #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+