ఓలా, చేతక్‌లకు ముచ్చెమటలే.. 158 కిలోమీటర్ల రేంజ్‌తో టీవీఎస్ అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది

టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS), ప్రపంచవ్యాప్తంగా, దేశీయంగా టూవీలర్, త్రీవీలర్ వాహనాల్లో అగ్రగామిగా నిలుస్తు ఒకవైపు పెట్రోల్ ఆధారిత వాహనాలతో దూసుకుపోతూ, అదే సమయంలో ఎలక్ట్రిక్ విభాగంలో కూడా కొత్త మోడళ్లను విడుదల చేస్తూ, కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ఈవీ మార్కెట్లో పెరుగుతున్న పోటీని దృష్టిలో పెట్టుకుని టీవీఎస్ సంస్థ, తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఆర్బిటర్ (TVS Orbiter)ను లాంచ్ చేసింది. TVS ఇప్పటికే iQube అనే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విక్రయిస్తోంది. ఇప్పుడు, ఈ కొత్త ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ తక్కువ ధరకు విడుదల అయింది. దీని ధర వచ్చేసి రూ.99,000 ఎక్స్‌షోరూమ్. రోజువారీ ప్రయాణాన్ని పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళ్లేలా డిజైన్ చేయబడిన ఈ ఆర్బిటర్, తన సెగ్మెంట్‌లో మొదటిసారి అందిస్తున్న అనేక ఫీచర్లను కలిగి ఉంది.

ఈ TVS Orbiter అనేక లేటెస్ట్ సౌకర్యాలతో నిండి ఉంది. కనెక్టెడ్ మొబైల్ యాప్, ముందు LED హెడ్‌ల్యాంప్‌తో కూడిన వైజర్, కలర్ LCD క్లస్టర్(ఇన్‌కమింగ్ కాల్ డిస్ప్లే తో), USB ఛార్జర్ వంటి ఫీచర్లు కస్టమర్లకు మరింత సౌలభ్యం, ఆనందాన్ని అందిస్తాయి. పరిశ్రమలో తొలిసారిగా 14 అంగుళాల ముందు చక్రాన్ని పొందిన ఈ స్కూటర్, సౌకర్యం, పనితీరు, విశ్వాసాన్ని కలిపి అందిస్తుందని టీవీఎస్ కంపెనీ పేర్కొంటుంది.

Tvs New Electric Scooter Orbiter Launched In India At Rs 99000

దీనిలో 3.1 kWh బ్యాటరీ ప్యాక్ అమర్చారు. ఇది మెరుగైన ఏరోడైనమిక్ డిజైన్‌ కారణంగా ఎక్కువ రేంజ్‌తో పాటు స్థిరమైన, సమర్థవంతమైన పనితీరును అందిస్తుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేసినట్లయితే 158 కి.మీ ఐడిసి రేంజ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంటుంది. రోజు ప్రయాణాలు చేసే వారికి రవాణా ఖర్చులను చాలా వరకు తగ్గించుకోవడానికి ఈ రేంజ్ చాలా అనుకూలంగా ఉంటుంది. పేద, మధ్య తరగతి ప్రజలకు ఇది బెస్ట్ అవుతుంది.

దీని డైనమిక్ రియర్ కాన్ఫిగరేషన్ ఖచ్చితమైన హ్యాండ్లింగ్‌ను, నగర ప్రయాణంలో నమ్మకమైన నియంత్రణను ఇస్తాయి. సూటిగా ఉండే ఎర్గోనామిక్ హ్యాండిల్‌బార్ రైడ్ కంఫర్ట్‌ను పెంచి, డ్రైవింగ్‌ను సులభతరం చేస్తుంది. ముఖ్యంగా షాపింగ్ కోసం సామాన్లు దాచుకోవడానికి 34 లీటర్ల బూట్ స్పేస్ కూడా అందించడం విశేషం. రైడర్, వెనుక కూర్చున్న వారికి సౌకర్యవంతమైన అనుభవాన్ని ఇవ్వడానికి 845 mm పొడవైన ఫ్లాట్ సీట్ డిజైన్‌ను పొందింది.

Tvs New Electric Scooter Orbiter Launched In India At Rs 99000

బ్రాండ్ ప్రకారం, సీటింగ్ మరింత రిలాక్స్డ్ సీటింగ్ పొజిషన్‌ను అందించడమే లక్ష్యంగా రూపొందించబడింది. అదనంగా, 169 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటం వలన నగర రోడ్లలో గుంతలు, అడ్డంకులు ఉన్నా సులభంగా డ్రైవ్ చేయగలుగుతుంది. ఫీచర్ల పరంగా కూడా ఈ స్కూటర్ చాలా రిచ్‌గా ఉంది. ఇందులో ఉన్న మల్టీ-కలర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ రైడర్‌కు ముఖ్యమైన సమాచారాన్ని స్పష్టంగా చూపిస్తుంది.

ఇది కేవలం ఒక డిస్‌ప్లే మాత్రమే కాకుండా, బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, దొంగతనం హెచ్చరిక (అలారం), OTA అప్‌డేట్స్ లాంటి అనేక ఆధునిక ఫీచర్లను కూడా అందిస్తుంది. అదనంగా, ఈ సెగ్మెంట్‌లో తొలిసారిగా అందించిన క్రూజ్ కంట్రోల్ సౌకర్యం, లాంగ్ ప్రయాణాలను మరింత ఈజీగా మార్చుతుంది. అంతే కాదు, రివర్స్ పార్కింగ్ అసిస్ట్, ఆటోమేటెడ్ హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లు కూడా జాబితాలో ఉన్నాయి.

Tvs New Electric Scooter Orbiter Launched In India At Rs 99000

రానున్న రోజుల్లో పండుగ సీజన్ ఉండటంతో ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ద్వారా టీవీఎస్ అమ్మకాలు భారీగా పుంజుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే iQube ద్వారా మార్కెట్లో తన సత్తా చూపిస్తున్న కంపెనీ ఆర్బిటర్ విడుదలతో మరో మెట్టు ఎక్కినట్టయింది. ఈ రెండు ఈవీల ద్వారా టీవీఎస్ కొత్త వినియోగదారులకు ఈజీగా చేరువ అవుతుంది.

More from DriveSpark

Article Published On: Thursday, August 28, 2025, 14:26 [IST]
English summary
Tvs new electric scooter orbiter launched in india at rs 99000 battery and all features
Read more on: #tvs motor #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+