నేపాల్‌లో ఇండియా స్కూటర్లకు భారీ డిమాండ్.. చివరికి తోపు మోడల్‌ను అక్కడ లాంచ్ చేసిన టీవీఎస్
టీవీఎస్ (Tvs) మోటార్ కంపెనీ నుంచి విడుదల అయి భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో జూపిటర్ 110 (jupiter) స్కూటర్ ఒకటి. హోండా యాక్టివా తరువాత దేశంలోనే అత్యధికంగా అమ్ముడుపోతున్న వాటిలో ఇది ప్రధానమైనది. ఇంతటి ఆదరణ కలిగిన స్కూటర్‌ను టీవీఎస్ ఇప్పుడు నేపాల్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. స్కూటర్ విభాగంలో ప్రతిష్టాత్మకంగా నిలిచిన జూపిటర్, ఇప్పుడు నేపాలీ వినియోగదారులను ఆకట్టుకునే లక్ష్యంతో ప్రత్యేకంగా రూపొందించబడింది. భారత్‌లో అయితే ఏ విధంగా ప్రసిద్ధ స్కూటర్‌గా అవతరించి ప్రజలందరి అభిమానాన్ని పొందినదో, అదే, విధంగా నేపాల్ ప్రజల మనసును కూడా గెలుపొందుతుందని కంపెనీ భారీ అంచనాలు పెట్టుకుంది. ఈ కొత్త జూపిటర్ 110 స్కూటర్‌ను డాన్ బ్లూ మ్యాట్ అనే ఆకర్షణీయమైన రంగులో మాత్రమే అందిస్తున్నారు.
దీని ధర వచ్చేసి నేపాల్ మార్కెట్‌కి అనుగుణంగా 2,57,900 నేపాలీ రూపాయలుగా నిర్ణయించబడింది. ప్రస్తుతానికి, ఇది డిస్క్ ఎస్‌ఎక్స్‌సీ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది, తద్వారా వినియోగదారులకు ప్రీమియం అనుభూతిని అందించేలా టీవీఎస్ ఉద్దేశించింది. ఈ స్కూటర్‌కు చెందిన ప్రధాన ఆకర్షణల విషయానికొస్తే.. మైలేజ్, పనితీరు, భద్రత, సౌకర్యం, సాంకేతికత అన్ని విషయాల్లోనూ ఇది అత్యుత్తమంగా నిలుస్తుందని కంపెనీ నమ్మకంగా చెబుతోంది. ఇందులో మొత్తం 29 ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి.

అందులో 15 ఫస్ట్ క్లాస్, 14 బెస్ట్-ఇన్-క్లాస్ ఫీచర్లుగా కంపెనీ పేర్కొంటోంది. ఇవన్నీ కలిపి, మారుతున్న నేపాలీ వినియోగదారుల అభిరుచులకు తగిన విధంగా జూపిటర్‌ను తీర్చిదిద్దారు. సిటీ ట్రాఫిక్‌కి తగినంతగా, మృదువైన సస్పెన్షన్, స్మూత్ యాక్సిలరేషన్, అలాగే ప్రయాణికుల కోసం మునుపెన్నడూ లేని కంఫర్ట్‌ను ఈ స్కూటర్ అందిస్తుంది. దీనికి తోడు, TVS నమ్మకమైన ఇంజినీరింగ్, దీర్ఘకాలిక నాణ్యతకు మరో నిదర్శనంగా నిలుస్తుంది.
జూపిటర్ 110 కేవలం స్టైలిష్ స్కూటర్‌గానే కాకుండా, స్మార్ట్ ఫీచర్ల కలయికగా నిలుస్తోంది. ముందు భాగంలోనే ఫ్యూయల్ ట్యాంక్‌ను అమర్చడం వల్ల, సీటు ఎత్తాల్సిన అవసరం లేకుండా సులభంగా ఇంధనం నింపే వీలుంటుంది. ఇక సీటు కింద ఎక్కువ స్థలాన్ని అందించడం వల్ల రెండు హెల్మెట్లు ఒకేసారి నిల్వ చేయగల సామర్థ్యం కలిగింది. ఇది అందించే ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్ సౌలభ్యం కూడా ఎక్కువ, ప్రయాణికుడు కంఫర్ట్‌గా ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తుంది.

భద్రత పరంగా, జూపిటర్ 110 నిజంగా మైలురాయిగా చెప్పవచ్చు. ఇందులో రోటోపెటల్ డిస్క్ బ్రేక్‌లు అమర్చారు, ఇవి అత్యుత్తమ బ్రేకింగ్‌ను అందిస్తాయి. ఎమర్జెన్సీ బ్రేక్ వార్నింగ్ వ్యవస్థతోపాటు హజార్డ్ లైట్స్, టర్న్ సిగ్నల్ లాంప్ రెస్ట్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి ప్రయాణ సమయంలో పూర్తిగా భద్రతను పెంచుతాయి. దీని మెటల్‌మ్యాక్స్ బాడీ కట్టుదిట్టమైన నిర్మాణంతో మరింత మన్నికను హామీ ఇస్తుంది.
రైడింగ్ అనుభవాన్ని మరింత బాగుచేసేందుకు టీవీఎస్ జూపిటర్‌లో బాడీ బ్యాలెన్స్ 2.0" వ్యవస్థను ఉపయోగించారు. ఇది పొడవైన సీటుతో కలసి మెరుగైన హ్యాండ్లింగ్‌ను అందిస్తుంది. అంతేకాదు, "Find Me" ఫీచర్ ద్వారా బయటి ప్రదేశాల్లో వాహనాన్ని సులభంగా గుర్తించవచ్చు. అలాగే "Follow Me హెడ్‌ల్యాంప్స్" వాహనాన్ని పార్క్ చేసిన తర్వాత కొంతసేపు వెలిగుతూ ఉండేలా ఉండటం వల్ల సెక్యూరిటీ పరంగా ప్రయోజనం కలుగుతుంది.

USB మొబైల్ ఛార్జర్ , ఆటో-క్యాన్సెల్ టర్న్ సిగ్నల్స్ వంటి చిన్నచిన్న డిటెయిల్స్ కూడా వినియోగదారుని సౌలభ్యం కోసం జాగ్రత్తగా జోడించారు. దీని ఇంజిన్ విషయానికి వస్తే, 113.3 సీసీ, సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్ యూనిట్‌తో రన్ అవుతుంది.ఇది 8 bhp పవర్, అలాగే 9.8 Nm టార్క్‌ను ఇస్తుంది. పాత మోడల్‌తో పోలిస్తే, ఈ కొత్త స్కూటర్ దాదాపు 10 శాతం ఎక్కువ మైలేజీని అందిస్తోందని కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








