టీజర్ చూసినవాళ్లంతా ఎగ్జైట్ అవుతున్నారు! ఇదే టీవీఎస్ మ్యాక్సీ స్టైల్ EV స్కూటర్

TVS మోటార్స్ ఇప్పుడు తన ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో మరో ఆసక్తికరమైన అడుగువేసింది. ఇది సాంప్రదాయిక స్కూటర్లతో కాకుండా, మ్యాక్సీ-స్టైల్ లో రూపొందించిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను త్వరలో పరిచయం చేస్తోంది. M1-S అనే పేరుతో పిలవబడే ఈ కొత్త మోడల్ త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా పలు అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకానికి వస్తుందని తెలుస్తుంది. ఈ స్కూటర్‌ను భారత మార్కెట్లో ప్రస్తుతానికి తీసుకురావడం లేదని సమాచారం. కానీ భవిష్యత్తులో ఇది ఇండియాలోకి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే భారత్‌లో విజయవంతంగా కొనసాగుతున్న iQube సిరీస్‌కు ఇది ఒక శక్తివంతమైన భాగస్వామిగా నిలవవచ్చు. మ్యాక్సీ-స్కూటర్ డిజైన్ అనేది పెద్దగా స్పేస్, లాంగ్ రైడింగ్ కమ్ఫర్ట్‌ను కోరుకునే వినియోగదారులకు తగిన ఎంపిక అవుతుంది.

ఈ కొత్త ఎలక్ట్రిక్ మోడల్ టీజర్ TVS ఇండోనేషియా వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైంది. ఇందులో స్కూటర్ డిజైన్‌కు సంబంధించిన కొన్ని ప్రధానాంశాలు వెల్లడి కావడం, మార్కెట్‌లో పెరుగుతున్న మ్యాక్సీ స్కూటర్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని తయారు చేసిన మోడల్‌గా ఇది కనిపిస్తోంది. టెలిస్కోపిక్ సస్పెన్షన్, విస్తృతమైన సీట్, అగ్రెసివ్ హెడ్ల్యాంప్ డిజైన్ వంటి అంశాలు దీన్ని ఓ ప్రీమియం, టూర్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా నిలిపే అవకాశముంది.

Tvs New M1 S Maxi Style Electric Scooter Teased

TVS కంపెనీ తమ అంతర్జాతీయ వ్యాపారాన్ని మరింత విస్తరించడంలో M1-S ఒక కీలక పాత్ర పోషించనుంది. ఇక భారత వినియోగదారులు దీనిని తమ రోడ్లపై చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీవీఎస్ తన ఎలక్ట్రిక్ విభాగంలో EV స్టార్టప్ ఐరన్ మొబిలిటీతో చేతులు కలిపి భాగస్వామ్యంలో ఐరన్ M1-S అనే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను టీవీఎస్ రీబ్యాడ్జ్ చేస్తోంది. ఇది కేవలం కొత్త డిజైన్ మాత్రమే కాకుండా, సాంకేతికంగా కూడా పవర్‌ఫుల్ మోడల్.

ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని హై-పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ మోటర్ 12.5 kW గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది వెనుక చక్రానికి ఏకంగా 254 Nm టార్క్‌ను అందించగల సామర్థ్యం కలిగి ఉంది. ఇది కేవలం రేటెడ్ టార్క్‌గా చూస్తే 45 Nmతో వస్తోంది. ఈ శక్తివంతమైన మోటార్ సహాయంతో స్కూటర్ 0 నుండి 50 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 3.7 సెకన్లలో చేరగలదు, ఇది స్పోర్ట్స్ బైక్స్‌కు సమానం.

Tvs New M1 S Maxi Style Electric Scooter Teased

ఇక గరిష్టంగా 105 కిలోమీటర్ల వేగాన్ని ఈ స్కూటర్ సాధించగలదు, అంటే ఇది నగర రోడ్లపైనే కాదు, హైవే రైడింగ్‌కు కూడా తగినదే. శక్తివంతమైన పనితీరుతో పాటు, ఇది అందించే 150 కి.మీ.ల రేంజ్ కూడా పెద్ద అట్రాక్షన్. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత, డైలీ ప్రయాణాలకు సరిపడేంత దూరం కలిగి ఉంది. దీనివల్ల, వినియోగదారులకు ఛార్జింగ్ మీద భయం లేకుండా నిర్బంధం లేని ప్రయాణ అనుభవం లభిస్తుంది.

ఈ స్కూటర్‌లో ఎక్కువ సామాన్లను తీసుకెళ్లడానికి 26 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ స్పేస్ అందిస్తున్నారు. దీని హెడ్‌లైట్‌లు పొడవైన విండ్‌స్క్రీన్‌తో అందంగా ఆకట్టుకునే విధంగా ఉంటాయి. LED టెయిల్ లైట్లు, LED రియర్ టర్న్ ఇండికేటర్లు, 14-అంగుళాల అల్లాయ్ వీల్స్, సస్పెన్షన్ కోసం ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్‌లను అందించారు. ఇన్ని అంశాలు కలిగిన స్కూటర్ కోసం అందరు వెయిటింగ్ చేస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Thursday, August 7, 2025, 16:23 [IST]
English summary
Tvs new m1 s maxi style electric scooter teased more details inside
Read more on: #tvs motor
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+