ఈ స్కూటర్‌ను ఏకంగా 20 లక్షల మంది కొనుగోలు చేశారు! దానిలో అంత ప్రత్యేకత ఏముంది?
దేశీయ ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ టీవీఎస్ మోటార్ (Tvs Motor)కు చెందిన ప్రసిద్ధ మోడల్ ఎన్‌టార్క్ 125(NTorq 125) ఒక గొప్ప మైలురాయికి చేరుకుంది. 2018లో భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ఈ మోడల్, విడుదలైన దాదాపు ఏడేళ్ల వ్యవధిలోనే 20 లక్షల యూనిట్లను విక్రయించడం ద్వారా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రారంభంలో యువతను లక్ష్యంగా తీసుకొని డిజైన్ చేసిన ఈ స్కూటర్, రోజురోజుకు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకుంది. ఈ స్కూటర్‌కు భారత మార్కెట్‌తో పాటు అంతర్జాతీయంగా కూడా మంచి ఆదరణ లభిస్తోంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటి వరకు NTorq 125 మోడల్‌ను 3 లక్షల యూనిట్లకు పైగా విదేశాలకు ఎగుమతి చేశారు. ఇది TVS గ్లోబల్ డిమాండ్‌కు నిదర్శనంగా నిలుస్తోంది.
లాంచ్ అయిన తరువాత మొదటి 10 లక్షల యూనిట్ల అమ్మకాలు మొదటి 4 సంవత్సరాల్లో నమోదు కాగా, తరువాతి 10 లక్షల యూనిట్లు కేవలం 3 సంవత్సరాల వ్యవధిలో నమోదయ్యాయి. మొత్తంగా భారత మార్కెట్లో మొత్తం 20,06,038 యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్‌కు ఉన్న యూత్‌ఫుల్ డిజైన్, పెర్ఫార్మెన్స్, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు NTorqను జనాల్లో అత్యంత ప్రసిద్ధి పొందిన మోడల్‌గా నిలబెట్టాయి.

టెక్నాలజీతో పాటు మైలేజ్, స్పోర్టీ డ్రైవింగ్ అనుభవం కలయికతో ఈ స్కూటర్ మార్కెట్‌లో తన స్థానం నిలబెట్టుకుంది. టీవీఎస్ మోటార్ కంపెనీ స్కూటర్ల విభాగంలో గత కొంతకాలంగా మంచి విజయాన్ని నమోదు చేస్తోంది. 2018 నుండి ఇప్పటి వరకు టీవీఎస్ దేశీయంగా 87 లక్షల (8.7 మిలియన్) స్కూటర్లను విక్రయించింది. ఈ మొత్తం అమ్మకాలలో ఎన్‌టార్క్ 125 స్కూటర్ ఒక్కదాని వాటా 23 శాతం ఉండటం విశేషం.
అంటే, టీవీఎస్‌లో స్కూటర్ విభాగానికి ఈ మోడల్ ఎంత పెద్ద బలంగా నిలిచిందో స్పష్టంగా అర్థమవుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికొస్తే, ఎన్‌టార్క్ మొత్తం 3,34,414 యూనిట్లను విక్రయించి, గత ఆర్థిక సంవత్సరం 2022-23లో నమోదు చేసిన 3,31,865 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే 6 శాతం వృద్ధిని సాధించింది. సేల్స్‌లో ఈ వృద్ధి ఓ సానుకూల సంకేతమే అయినా, ఈ మోడల్ మొత్తం అమ్మకాలపై కలిగిన వాటా మాత్రం కాస్త తగ్గింది.

2021-22లో 29 శాతం ఉన్న వాటా ఇప్పుడు 23 శాతానికి చేరడం గమనార్హం. ఈ కాలంలో, టీవీఎస్ మిగతా మోడళ్ల అమ్మకాలలోని మార్పు కూడా ఆసక్తికరం. జూపిటర్ స్కూటర్ తన స్థిరమైన పనితీరు అంశాలతో ఆదరణ పెంచుకుంటుండగా, iQube ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్‌తో వృద్ధి బాట పట్టింది. ఈ రెండు మోడళ్లలో నమోదైన పెరుగుదల వల్లే NTorq మార్కెట్ వాటాలో స్వల్పంగా తగ్గుదల చోటు చేసుకుంది.
ఇది గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన నాలుగవ స్కూటర్‌గా నిలిచింది. మార్కెట్‌లో ఉన్న వందలకొద్దీ మోడళ్ల మధ్య నిలిచే స్థాయికి వచ్చిన ఈ స్కూటర్‌కి, తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పడింది. జాబితాలో హోండా యాక్టివా 25.2 లక్షల యూనిట్ల విక్రయాలతో తొలిస్థానంలో కొనసాగగా, సుజుకీ యాక్సెస్ 7.27 లక్షల స్కూటర్ల అమ్మకాలతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. హోండా డియో 3,21,220 యూనిట్లతో మూడవ స్థానంలో నిలిచింది.

వీటి తరువాత NTorq భారత మార్కెట్‌లో నాలుగవ స్థానాన్ని అందుకోవడమే కాకుండా, ఎగుమతుల్లో కూడా 64,988 యూనిట్లతో నాలుగవ స్థానం దక్కించుకోవడం గమనార్హం. ఇది 125 cc ఇంజిన్‌తో వస్తుంది. డిస్క్, రేస్ ఎడిషన్, సూపర్ స్వాట్ ఎడిషన్, రేస్ XP, XT ఎడిషన్లలో లభిస్తుంది. ఇంజిన్ 10.2 bhp పవర్, 10.8 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఎక్స్ షోరూమ్ ధర రూ.94 వేల వరకు ఉంది.


Click it and Unblock the Notifications








