అంచనాలను మించి రికార్డ్ బద్దలు కొట్టిన TVS.. సేల్స్ రిపోర్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

అక్టోబర్ నెల ముగిసిన వెంటనే దేశవ్యాప్తంగా ఉన్న వాహన తయారీ సంస్థలు తమ అమ్మకాల గణాంకాలను ఒకదాని తర్వాత ఒకటి విడుదల చేస్తూ ఆటో మార్కెట్‌లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఈ జాబితాలో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు టీవీఎస్ (Tvs) మోటార్ కంపెనీ కూడా తన 2025 అక్టోబర్ నెలలో సాధించిన అమ్మకాల వివరాలను వెల్లడించింది. ఈసారి టీవీఎస్ నిజంగా తన ప్రదర్శనతో ఆకట్టుకుంది. కంపెనీ ప్రకారం, 2025 అక్టోబర్ నెలలో మొత్తం 5,25,150 ద్విచక్ర వాహనాలను విక్రయించింది. ఇది గత సంవత్సరం అంటే 2024 అక్టోబర్‌లో విక్రయించిన 4,78,159 వాహనాలతో పోలిస్తే 10 శాతం వృద్ధి సాధించినట్టే. ఈ పెరుగుదల కంపెనీకి ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది.

పెట్రోల్ ధరలు పెరుగుతున్న సమయంలో, కొత్త మోడళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న ఆసక్తి టీవీఎస్ అమ్మకాల వృద్ధికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దేశీయ మార్కెట్‌లో కూడా టీవీఎస్ తన దూకుడు కొనసాగించింది. కంపెనీ తెలిపిన ప్రకారం, 2025 అక్టోబర్‌లో భారతదేశంలోనే 4,21,631 ద్విచక్ర వాహనాలను విక్రయించింది. గత సంవత్సరం ఇదే నెలలో అమ్ముడైన సంఖ్య 3,90,489గా ఉంది. అంటే దేశీయ మార్కెట్‌లో సుమారు 8 శాతం వృద్ధి నమోదైంది.

Tvs October 2025 Sales 10 Percent Growth Compared To Previous

ఇది టీవీఎస్‌కు దేశీయ వినియోగదారులు చూపుతున్న విశ్వాసానికి నిదర్శనం. కంపెనీ లాంచ్ చేసిన TVS Raider, Jupiter 125, Apache RTR సిరీస్‌లకు డిమాండ్ పెరగడం ఈ వృద్ధికి తోడ్పడిందని చెప్పవచ్చు. అంతేకాకుండా, టీవీఎస్ అంతర్జాతీయ మార్కెట్‌లలో కూడా తన ప్రభావాన్ని కొనసాగిస్తోంది. 2025 అక్టోబర్ నెలలో కంపెనీ భారతదేశం నుండి పెద్ద ఎత్తున వాహనాలను ఎగుమతి చేసింది.

గత సంవత్సరం అంటే 2024 అక్టోబర్‌లో 87,670 ద్విచక్ర వాహనాలను విదేశాలకు పంపిన టీవీఎస్, ఈసారి ఆ సంఖ్యను గణనీయంగా పెంచినట్లు కంపెనీ వెల్లడించింది. 2025 అక్టోబర్ నాటికి ఈ సంఖ్య 1,03,519 యూనిట్లకు చేరింది, అంటే టీవీఎస్ అంతర్జాతీయ అమ్మకాలలో 18 శాతం అద్భుతమైన వృద్ధి సాధించింది. ఇది కంపెనీ గ్లోబల్ వ్యూహాత్మక దృక్పథానికి, విదేశీ మార్కెట్‌లలో పెరుగుతున్న కస్టమర్ నమ్మకానికి సూచికగా నిలుస్తోంది.

Tvs October 2025 Sales 10 Percent Growth Compared To Previous

దేశీయ మార్కెట్‌లోనూ, ఎగుమతుల రంగంలోనూ ఒకేసారి వృద్ధి సాధించడం టీవీఎస్‌కి నిజమైన విజయమే. మొత్తంగా 2025 అక్టోబర్‌లో కంపెనీ 5,25,150 ద్విచక్ర వాహనాలను (దేశీయ అమ్మకాలు + ఎగుమతులు కలిపి) విక్రయించగలిగింది. ఈ సంఖ్య టీవీఎస్‌కి గత ఏడాదితో పోలిస్తే పెద్దదైన మైలురాయిగా నిలిచింది. ఇక ఆఫ్రికా, లాటిన్ అమెరికా, దక్షిణ ఆసియా వంటి మార్కెట్‌లలో టీవీఎస్ వాహనాలపై పెరుగుతున్న డిమాండ్, కంపెనీకి అంతర్జాతీయ స్థాయిలో స్థిరమైన స్థానం కల్పిస్తోంది.

ఆ ప్రాంతాల్లో TVS Apache, Star City, HLX వంటి మోడళ్లకు మంచి ఆదరణ లభిస్తోంది. మొత్తం దృష్టిలోకి తీసుకుంటే, 2025 అక్టోబర్ నెల టీవీఎస్ మోటార్ కంపెనీకి మరో విజయవంతమైన అధ్యాయంగా నిలిచింది. అమ్మకాల వృద్ధి, విస్తరిస్తున్న గ్లోబల్ మార్కెట్, వినియోగదారుల నమ్మకం.. ఇవన్నీ కలిపి టీవీఎస్‌ను భారతీయ ద్విచక్ర వాహన పరిశ్రమలో మరింత బలమైన స్థాయికి తీసుకెళ్లాయి.

Tvs October 2025 Sales 10 Percent Growth Compared To Previous

రాబోయే సంవత్సరాల్లో టీవీఎస్ మోటార్ కంపెనీ మొత్తం అమ్మకాల గణాంకాలు మరింత పెరిగే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. కంపెనీ ఇప్పటికే తన ప్రస్తుత మోడళ్లకు అద్భుతమైన స్పందనను సాధించగా, ఇప్పుడు వినియోగదారుల కోసం మరిన్ని కొత్త ద్విచక్ర వాహనాలను మార్కెట్లోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఈ కొత్త వాహనాలు టీవీఎస్ అమ్మకాల వృద్ధికి మరింత ఊపునిచ్చే అవకాశం ఉంది. TVS Jupiter 125 CNG ఆ విభాగంలో తొలి ప్రయత్నంగా నిలవబోతోంది.

More from DriveSpark

Article Published On: Friday, November 7, 2025, 16:28 [IST]
English summary
Tvs october 2025 sales 10 percent growth compared to previous
Read more on: #tvs motor #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+