ఈ స్కూటర్ పక్కా పేదవాళ్ల కోసమే..సింగిల్ ఛార్జ్ పై ఏకంగా 158 కిమీ రేంజ్..ధర కూడా రూ.లక్ష కంటే తక్కువ

భారత టూ వీలర్ మార్కెట్లో టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అపాచీ (Apache), జుపిటర్ (Jupiter) వంటి మోడల్స్ ఇప్పటికే వినియోగదారుల గుండెల్లో నిలిచిపోగా, ఎలక్ట్రిక్ వాహన విభాగంలో టీవీఎస్ వేసిన కొత్త అడుగు టీవీఎస్ ఆర్బిటర్ ఈవీ (TVS Orbiter EV).

ఈ స్కూటర్ ఇప్పుడు రోజువారీ ప్రయాణాలు చేసేవారికి బెస్ట్ ఫ్రెండుగా మారింది. ఆర్బిటర్ ఇంతగా ఆకర్షించడానికి ప్రధాన కారణం దాని ధర. ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ.99,900 నుంచి అందుబాటులో ఉంది. అయితే తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు అందించడంలో ఇది ఇతర సాధారణ స్కూటర్ల కంటే మెరుగైన విలువను ఇస్తుంది.

TVS Orbiter EV Becomes Market Favorite Offers High Value at Low Price

టీవీఎస్ ఆర్బిటర్ ఈవీ 2.5 kW BLDC మోటారుతో పనిచేస్తుంది. దీనికి 3.1 kWh బ్యాటరీ ప్యాక్ జత చేయబడింది. ఈ పవర్‌ట్రెయిన్ కారణంగా స్కూటర్ ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే గరిష్టంగా 158 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు. బ్యాటరీ 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ కావడానికి దాదాపు 4 గంటల 10 నిమిషాలు పడుతుంది.

తక్కువ ధరలో లభించే స్కూటర్లలో ఇంత అధిక కెపాసిటీ గల బ్యాటరీ ప్యాక్ లభించడం చాలా అరుదు. డిజైన్ పరంగా, ఆర్బిటర్ స్టైలిష్‌గా కనిపిస్తుంది. ముందు భాగంలో మోడ్రన్ LED హెడ్‌ల్యాంప్‌లు, స్టైలిష్ DRLలు, వెనుకవైపు స్లీక్ LED టెయిల్ ల్యాంప్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.

TVS Orbiter EV Becomes Market Favorite Offers High Value at Low Price

టీవీఎస్ ఆర్బిటర్ ఎక్కువసేపు ప్రయాణించేటప్పుడు లేదా రద్దీగా ఉండే సిటీ రోడ్లపై కూడా సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. చిన్న వస్తువులు పెట్టుకోవడానికి గ్లౌబాక్స్, విశాలమైన 34 లీటర్ల స్టోరేజ్ సామర్థ్యం, పొడవైన మరియు వెడల్పైన సీటింగ్ సౌకర్యం వంటి ఫీచర్లు దీని సొంతం. ఇది కేవలం సాధారణ స్కూటర్ మాత్రమే కాదు, ప్రయాణీకుల అవసరాలను అర్థం చేసుకునే పూర్తి స్మార్ట్ ఈవీ అని చెప్పవచ్చు.

దీని ప్రధాన హైలైట్‌లలో ఒకటి క్రూయిజ్ కంట్రోల్ (Cruise Control). దీనితో పాటు హిల్ హోల్డ్ అసిస్ట్, రివర్స్ పార్కింగ్ అసిస్ట్ వంటి ఫీచర్లతో ప్రయాణాలు మరింత సురక్షితంగా ఉంటాయి. మొబైల్ ఛార్జింగ్ కోసం USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇందులో ఉంది. స్టీల్ ట్యూబ్ ఛాసిస్‌తో తయారైన ఈ స్కూటర్ బలంగా, ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది.

TVS Orbiter EV Becomes Market Favorite Offers High Value at Low Price

ఆర్బిటర్ సస్పెన్షన్, బ్రేకింగ్ సిస్టమ్స్ కూడా చాలా మెరుగ్గా ఉన్నాయి. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో డ్యూయల్ షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి. ఈ సస్పెన్షన్ సిస్టమ్స్ సౌకర్యవంతమైన ప్రయాణాన్ని, స్థిరత్వాన్ని అందించడానికి ప్రత్యేకంగా ట్యూన్ చేశారు.

బ్రేకింగ్ కోసం ముందు, వెనుక డ్రమ్ బ్రేక్‌లతో పాటు, స్కూటర్ నియంత్రణలో ఉండటానికి సహాయపడే SBS (Synchronized Braking System) బ్రేక్ బ్యాలెన్స్ సిస్టమ్ ఉంది. ముందు భాగంలో 14-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను అందించారు. మొత్తంగా చూస్తే ఇంత తక్కువ ధరలో ఇన్ని అద్భుతమైన ఫీచర్లతో కూడిన ఎలక్ట్రిక్ స్కూటర్ సాధారణ ప్రజలకు ఒక గొప్ప అవకాశం.

More from DriveSpark

Article Published On: Monday, December 1, 2025, 9:36 [IST]
English summary
Tvs orbiter ev becomes market favorite offers high value at low price
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+