ఒకే నెలలో లక్ష మందికి పైగా కొన్నారు.. దేశంలో ఈ టీవీఎస్ స్కూటర్‌కు డిమాండ్ మాములుగా లేదు
ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ టీవీఎస్ మోటార్ (Tvs Motor) దేశంలో తక్కువ ధరలో, ఎక్కువ మైలేజ్ ఇచ్చే మోడళ్లను విక్రయిస్తూ ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా కస్టమర్లను కలిగి ఉంది. హోండా, హీరో వంటి కంపెలకు ధీటుగా బలమైన టూవీలర్స్‌ను దింపడంలో టీవీఎస్ కంపెనీ పెట్టింది పేరు. ప్రతి ఏడాది కూడా అమ్మకాలతో దూసుకుపోతున్న టీవీఎస్ తాజాగా జనవరి 2025కు సంబంధించిన సేల్స్ డేటాను వెల్లడించింది. దీని ప్రకారం, కంపెనీ ఈ నెలలో మొత్తం 2,93,802 టూవీలర్స్‌ను విక్రయించింది. ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే సేల్స్ పెరిగాయి. 2024 జనవరి నెలలో టీవీఎస్ మొత్తం 2,68,233 టూవీలర్స్‌ను సేల్ చేసింది. దేశంలో చాలా మంది ఈ కంపెనీ మోడళ్లను ఆదరించినట్లు ఈ డేటాను చూస్తేనే తెలిసిపోతుంది.
భారతీయ టూవీలర్ మార్కెట్లో tvs ప్రతినెలా కూడా దాదాపు లక్షల వాహనాలను విక్రయిస్తూ తన వ్యాపారాన్ని వేగంగా పెంచకుంటుంది. ఈ మొత్తం అమ్మకాల్లో ప్రతిసారి లాగే ఇప్పుడు కూడా కంపెనీ ప్రసిద్ధ మోడల్ జూపిటర్ స్కూటర్ (jupiter scooter) అత్యధికంగా అమ్ముడైన టూ వీలర్‌గా టాప్ ప్లేస్‌లో ఉంది. జనవరి నెలలో ఈ స్కూటర్ అమ్మకాలు ఏకంగా 1,07,847 యూనిట్లుగా ఉన్నాయి.

అదే గత ఏడాది ఇదే నెలలో సేల్స్ 74,225 యూనిట్లుగా ఉన్నాయి. సాధారణంగా దేశంలో స్కూటర్ల విభాగంలో టీవీఎస్ జూపిటర్ అంటే ఎంతో క్రేజ్ ఉంటుందో అందరికి తెలిసిందే హోండా కంపెనీకి చెందిన యాక్ఠివా (Activa) ఇండియాలో అత్యంత డిమాండ్ ఉన్న మోడల్. దీనికి బలమైన పోటీనిచ్చే మోడల్ అంటే జూపిటర్ గుర్తుకు వస్తుంది. జనవరి 2025 నెల అమ్మకాల్లో జూపిటర్ తరువాత XL మినీ బైక్ సేల్స్‌లో దూసుకుపోయింది.
Tvs XL మినీ బైక్ గత నెలలో 41,872 యూనిట్ల విక్రయాలను నమోదు చేసి రెండో అత్యధికంగా అమ్ముడుపోయిన మోడల్‌గా నిలిచింది. 2024 ఏడాది జనవరి నెలలో దాదాపు ఇదే రేంజ్‌లో XL బైక్‌ల విక్రయాలు నమోదయ్యాయి. ఇక మూడో స్థానంలో అపాచీ బైక్‌లు ఉన్నాయి. గత నెలలో వీటి అమ్మకాలు 34,511 యూనిట్లుగా నమోదు అయ్యాయి. ఈ సేల్స్‌లో అపాచీకి చెందిన వివిధ ఇంజిన్ సీసీలు ఉన్నాయి.

అదే జనవరి 2024 నెలలో అపాచీ సేల్స్ 31,222 యూనిట్లుగా ఉన్నాయి. ఇక నాలుగో స్థానంలో టీవీఎస్ రైడర్ బైక్ ఉంది. ఈ బైక్ అమ్మకాలు 27,382 యూనిట్లు కాగా, 2024 జనవరి నెలలో 43,331 గా నమోదయ్యాయి. అలాగే 5 వ స్థానంలో టీవీఎస్ iQube ఎలక్ట్రిక్ స్కూటర్ 24,991 యూనిట్ల అమ్మకాలతో 5వ స్థానంలో, 23,795 యూనిట్ల అమ్మకాలతో ఎండోర్క్ స్కూటర్ 6వ స్థానంలో ఉన్నాయి.
10,501 యూనిట్ల అమ్మకాలతో టీవీఎస్ రేడియన్ బైక్ 7వ స్థానంలో ఉండగా, 9,100 విక్రయాలతో టీవీఎస్ జెస్ట్ స్కూటర్ 8వ స్థానంలో, 7,016 యూనిట్లతో స్పోర్ట్ 9 వ స్థానంలో ఉండగా, ఇక చివరగా 3,633 యూనిట్లతో రోనిన్ 10 వ స్థానంలో నిలిచింది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








