కాన్సెప్ట్ బైక్‌తో కిర్రాక్ అనిపించిన టీవీఎస్.. ఇది మార్కెట్లోకి వస్తే యూత్‌కి ఫేవరెట్ అయిపోద్దంతే!
దిల్లీలోని ప్రగతి మైదాన్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన భారత్ మొబలిటీ గ్లోబల్ ఎక్స్‌పో అట్టహాసంగా కొనసాగుతోంది. అనేక ఆటో మొబైల్ సంస్థలు తమ వాహనాలతో వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. దిగ్గజ టూ- వీలర్ సంస్థ టీవీఎస్ సంస్థ కూడా తమ బ్రాండ్ నుంచి రానున్న వాహనాలను ప్రదర్శిస్తోంది. అయితే.. ఈ ఎక్స్ పోలో ఓ కాన్సెప్ట్ బైకుతో తళుక్కున మెరిసిందీ సంస్థ. చూడగానే 'వావ్' అనిపించేలా ఉన్న ఈ బైకు.. ఆటో ఎక్స్‌పోలో ఆకర్షణీయంగా నిలిచింది. టీవీఎస్ RTS X Concept పేరుతో దీన్ని ప్రదర్శించింది టీవీఎస్ సంస్థ. 300 సీసీ ఇంజిన్‌తో ఉన్న ఈ బైకు పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
RTS X బైకు ఫొటోలను బట్టి చూస్తే ఇది RTS 310 ప్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మించినట్లు స్పష్టమవుతోంది. దీన్ని డిఫరెంట్ బాడీ వర్క్‌తో నిర్మించారు. ఇది చూసేందుకు క్రేజీ లుక్ అందిస్తోంది. ముఖ్యంగా దీని ఫ్రంట్ సైడ్‌లో షార్ప్ హెడ్ లైట్ యూనిట్, మడ్‌గార్డ్ అమరిక రగ్డ్ లుక్ అందిస్తోంది.

ఈ బైకు పొడవాటి సింగిల్ సీటుతో ఉంటుంది. మినిమలిస్టిక్ స్టైలింగ్‌తో దీని టెయిల్ సెక్షన్ ఉంది. దీని సబ్‌ఫ్రేమ్.. పూర్తిగా తెలుపు రంగులో పెయింట్ చేసి ఉంది. ఈ కాన్సెప్ట్ బైకు తెలుపు, పసుపు రంగు కాంబినేషన్ ఉపయోగించి తీసుకువచ్చింది టీవీఎస్ సంస్థ
ఈ టీవీఎస్ RTS X బైకు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఇది 299 సీసీ ఇంజిన్‌తో ఉంటుంది. సింగిల్- సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో ఉంటుంది. ఇది 9,000 rpm వద్ద 35bhp ఉత్పత్తి చేస్తుంది. 7,000 rpm వద్ద 28.5 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఈ మోటార్ 6- స్పీడ్ గేర్ బాక్స్‌తో అనుసంధానించి, బై- డైరెక్షన్ క్విక్ షిఫ్టర్‌తో ఉంటుంది. ఈ బైకు కేవలం 2.8 సెకన్లలోనే 0-60 kmph వేగాన్ని అందుకుంటుంది. 6.3 సెకన్లలో.. 0-100 kmph వేగాన్ని చేరుకుంటుంది. ఈ బైకు 144 కిలోల బరువుతో ఉంటుంది.
ప్రొడక్షన్‌లోకి వస్తే ఈ సూపర్ మోటో బైకు.. వినియోగదారులను బాగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. దీని సీటు ఎత్తు 875 మి.మీ.లుగా ఉంటుంది. దీని రెండు వైపులా 17 అంగుళాల వీల్స్ ఉంటాయి. ఈ బైకు ముందు వైపు 43మి.మీ USD ఫోర్క్స్, వెనుకవైపు మోనోషాక్‌తో ఉంటుంది. అయితే... ఈ RTS X ఉత్పత్తి ప్రారంభించడం గురించి టీవీఎస్ సంస్థ ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు.

కానీ, ఈ సెగ్మెంట్‌లో ఉండే KTM 390 SMC R బైకు గనుక మార్కెట్లో వినియోగదారులను ఆకట్టుకోగలిగితే.. దానికి పోటీగా టీవీఎస్ సంస్థ ఈ RTS X బైకును మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. దిల్లోలోని ప్రగతి మైదాన్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో.. ఈ నెల 22 వరకు జరగనుంది. ఈ ఈవెంట్‌లో దాదాపు దేశీయ, అంతర్జాతీయంగా 50కి పైగా కంపెనీలు పాల్గొంటున్నాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








