రాయల్ ఎన్‌ఫీల్డ్ కథ ముగిసినట్లేనా? టీవీఎస్ కొత్త బైక్‌పైనే అందరి దృష్టి

భారత మార్కెట్‌లో ప్రస్తుతం చాలా కంపెనీలు అడ్వెంచర్ బైకులను విక్రయిస్తున్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450, యెజ్డీ అడ్వెంచర్, హీరో ఎక్స్‌పల్స్ 210, కేటీఎం 250 అడ్వెంచర్ వంటి బైకులు బాగా పాపులారిటీ సంపాదించుకున్నాయి. అయితే, ఈ జాబితాలో టీవీఎస్ కంపెనీకి చెందిన బైక్ ఒక్కటి కూడా లేదు. కానీ, ఈ లోటు త్వరలోనే తీరబోతుంది. ఎందుకంటే, టీవీఎస్ సంస్థ అడ్వెంచర్ బైకుల విభాగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది.

అక్టోబర్ 15న ఆర్‌టీఎక్స్ 300 విడుదల
టీవీఎస్ కంపెనీ రాబోయే అక్టోబర్ 15వ తేదీన కొత్త టీవీఎస్ అపాచే ఆర్‌టీఎక్స్ 300 ఏడీవీ (TVS Apache RTX 300 ADV) బైక్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది టీవీఎస్ సంస్థ నుంచి రాబోయే మొదటి అడ్వెంచర్ బైక్ కావడం విశేషం. ఈ బైకులో సరికొత్త ఆర్‌టీ-ఎక్స్‌డీ4 (RT-XD4) ఇంజిన్‌ను ఉపయోగించనున్నారని సమాచారం.

TVS to Challenge Royal Enfield Apache RTX 300 ADV Launching Soon

ఇది 299 సీసీ సింగిల్ సిలిండర్ యూనిట్. ఈ ఇంజిన్ గరిష్టంగా 9,000 ఆర్‌పిఎం వద్ద 34.50 బీహెచ్‌పీ ఎనర్జీని, 7,000 ఆర్‌పిఎం వద్ద 28.50 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయగల కెపాసిటీతో ట్యూనింగ్ చేసినట్లు భావిస్తున్నారు.

టెక్నికల్ ఫీచర్లు
ఈ ఇంజిన్‌కు 6-స్పీడ్ గేర్ బాక్స్ అనుసంధానం చేస్తారని, ఇందులో స్లిప్పర్ క్లచ్ సదుపాయం కూడా ఉంటుందని సమాచారం. సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు భాగంలో యూఎస్‌డీ ఫోర్క్, వెనుక భాగంలో మోనో-షాక్ అందించే అవకాశాలు ఉన్నాయి. బ్రేకింగ్ కోసం ముందు, వెనుక భాగాలలో డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి.

TVS to Challenge Royal Enfield Apache RTX 300 ADV Launching Soon

ఇతర ఫీచర్లు
ఈ బైక్‌లో విండ్‌షీల్డ్‎తో పాటు కొద్దిగా పైకి లేపిన హ్యాండిల్ బార్స్, రెండు-భాగాల సీటు, లగేజ్ రాక్ వంటి ముఖ్యమైన అంశాలు ఉండవచ్చు. ఇవి కాకుండా, టీఎఫ్‌టీ డిస్‌ప్లే, రైడ్ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లను కూడా టీవీఎస్ అపాచే ఆర్‌టీఎక్స్ 300 ఏడీవీ కలిగి ఉంటుందని అంచనా. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న ప్రముఖ అడ్వెంచర్ బైకులకు ఈ కొత్త బైక్ ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్‎గా మారుతుందని భావిస్తున్నారు.

నిపుణుల ఏమంటున్నారంటే
తరచుగా సుదూర ప్రయాణాలు చేయాలనుకునేవారు, ఆఫ్-రోడ్ సాహస యాత్రలపై ఆసక్తి ఉన్నవారు ఈ టీవీఎస్ అపాచే ఆర్‌టీఎక్స్ 300 ఏడీవీ అడ్వెంచర్ బైక్‌ను కొనుగోలు చేయడం గురించి ఆలోచించవచ్చు. ఇది అడ్వెంచర్ బైక్ కాబట్టి, సాధారణ రోడ్లపైనే కాకుండా, ఎలాంటి కఠినమైన రహదారులను కూడా సమర్థవంతంగా ఎదుర్కోగలదు.

ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450, కేటీఎం 250 అడ్వెంచర్, యెజ్డీ అడ్వెంచర్ వంటి బైక్‌లకి టీవీఎస్ అపాచీ ఆర్‌టీఎక్స్ 300 ఏడీవీ గట్టి పోటీ ఇవ్వనుంది. ఒక అడ్వెంచర్ బైక్‌కు అవసరమైన అన్ని ముఖ్య ఫీచర్లను ఈ ఆర్‌టీఎక్స్ 300 ఏడీవీ లో టీవీఎస్ అందించనుంది.

ఈ బైక్ మైలేజ్, పనితీరు విషయంలో అద్భుతంగా ఉంటే, దూర ప్రాంతాలకు తరచుగా ప్రయాణించేవారు, ఆఫ్-రోడ్ సాహసాలను ఇష్టపడేవారు దీనిని కొనుగోలు చేయడానికి మొగ్గు చూపవచ్చు. ఈ కొత్త బైక్‌తో అడ్వెంచర్ బైక్ విభాగంలో టీవీఎస్ తన స్థానాన్ని పటిష్టం చేసుకోవాలని చూస్తోంది.

More from DriveSpark

Article Published On: Thursday, October 9, 2025, 13:40 [IST]
English summary
Tvs to challenge royal enfield apache rtx 300 adv launching soon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+