ఒక్క నెల ఓపిక పట్టండి బ్రో.. బడ్జెట్ రెడీ చేస్కోండి.. లక్షలోపు ధరకే అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్ రాబోతుంది

భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతుంది. టీవీఎస్ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో అగ్రగామిగా నిలిచింది. టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో మార్కెట్‌లోకి ప్రవేశించి, ఆకట్టుకునే పనితీరు, ఆధునిక ఫీచర్లు, విశ్వసనీయతతో వినియోగదారుల హృదయాలను గెలుచుకుంది.

కేవలం అమ్మకాలలో మాత్రమే కాకుండా, క్వాలిటీ, నూతన ఆవిష్కరణలలో కూడా టీవీఎస్ నిరంతరం ముందుంటుంది. నగర ప్రయాణాలకు అనువైన ఈ వాహనాలు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతున్నాయి. తక్కువ నిర్వహణ ఖర్చులతో పాటు, రైడర్‌లకు సులభమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయి. టీవీఎస్ ఎలక్ట్రిక్ వాహనాలు భవిష్యత్తు ప్రయాణానికి ఒక చక్కటి ఉదాహరణ.

TVS to Launch New EV Scooter Under Rs 1 Lakh All You Need to Know

ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్‌లో ఇప్పటికే టీవీఎస్ ఐక్యూబ్ మంచి పేరు తెచ్చుకుంది. ఈ క్రమంలో, టీవీఎస్ తన ఈవీ శ్రేణిని మరింత విస్తరించాలని నిర్ణయించుకుంది. ఈ నెల 28న రూ.1 లక్ష లోపు ధరతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయబోతున్నట్లు హెచ్‌టీ ఆటో నివేదించింది. ఈ కొత్త స్కూటర్ పేరు 'టీవీఎస్ ఆర్బిటర్' (TVS Orbiter) కావచ్చునని అంచనా వేస్తున్నారు.

ఈ స్కూటర్ లాంచ్ తర్వాత, మొదటిసారిగా ఈవీ కొనుగోలు చేయాలనుకునేవారికి, గ్రామీణ మార్కెట్లలో టీవీఎస్ తన అమ్మకాలను పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త టీవీఎస్ ఆర్బిటర్, దాని సిమిలర్ మోడల్ అయిన ఐక్యూబ్ కంటే చాలా తక్కువ ధరలో లభించనుంది.

TVS to Launch New EV Scooter Under Rs 1 Lakh All You Need to Know

దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 95,000 నుంచి రూ. 1,00,000 మధ్య ఉంటుందని అంచనా. ఈ ధరతో ఇది టీవీఎస్ నుంచి రాబోయే అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ అవుతుంది. బడ్జెట్ ప్లాన్ చేసుకున్న వారికి ఇది మంచి ఎంపిక.

ఈ స్కూటర్‌లో ఖర్చులను తగ్గించడానికి తక్కువ ఫీచర్లు, హబ్-మౌంటెడ్ మోటార్, చిన్న బ్యాటరీ ప్యాక్ (బహుశా 2.2 kWh కంటే తక్కువ) ఉండే అవకాశం ఉంది. స్కూటర్ లాంచ్ అయిన తర్వాత అధికారిక వివరాలు వెల్లడవుతాయి. డిజైన్, ఫీచర్ల విషయానికొస్తే.. ఇది ఐక్యూబ్ కంటే కొంత సరళంగా ఉండే అవకాశం ఉంది. ఇందులో ఆధునిక డిజైన్, ఫంక్షనల్ హార్డ్‌వేర్ ఉంటాయి. పట్టణ ప్రయాణాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.

TVS to Launch New EV Scooter Under Rs 1 Lakh All You Need to Know

టీవీఎస్ ప్రస్తుతం ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల శ్రేణిని రూ.1 లక్ష ప్రారంభ ధర నుంచి అమ్ముతోంది. టాప్ వేరియంట్ ధర రూ. 1.59 లక్షల వరకు ఉంటుంది. రాబోయే TVS ఆర్బిటర్ ఈ మార్కెట్‌లోకి కొత్తగా అడుగుపెట్టే వారికి మంచి బడ్జెట్ ఎంపిక అవుతుంది. ఇది ఓలా ఎస్1ఎక్స్, విడా వీఎక్స్2, బజాజ్ చేతక్ వంటి ఎంట్రీ-లెవల్ మోడళ్లతో పోటీపడుతుంది. తక్కువ ధరలో మంచి సిటీ స్కూటర్‌ను అందిస్తే, ప్రజలు కచ్చితంగా కొనుగోలు చేస్తారని టీవీఎస్ భావిస్తోంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, August 25, 2025, 15:27 [IST]
English summary
Tvs to launch new ev scooter under rs 1 lakh all you need to know
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+