ఇది టీవీఎస్ దండ్రయాత్ర.. హాట్ కేకుల్లా జూపిటర్, ఐక్యూబ్‌.. రికార్డు బద్దలు కొట్టే అమ్మకాలు

భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థల్లో ఒకటైన టీవీఎస్ మోటార్ (TVS Motor) మరోసారి తన సత్తా చాటింది. విశ్వసనీయమైన వాహనాలతో వినియోగదారుల హృదయాలను గెలుచుకున్న ఈ కంపెనీ, గత నెల (మార్చి-2025) ఏకంగా 2,97,622 యూనిట్ల ద్విచక్ర వాహనాలను (బైక్‌లు & స్కూటర్లు) విక్రయించి అదరగొట్టింది.

2024 మార్చిలో నమోదైన 2,60,532 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే ఇది ఏకంగా 14.2శాతం వృద్ధిని సూచిస్తోంది. ఈ ఘనతతో దేశంలో అత్యధికంగా టూ-వీలర్స్‌ను విక్రయించే కంపెనీల జాబితాలో టీవీఎస్ మోటార్ మూడవ స్థానాన్ని దక్కించుకుంది. మొదటి రెండు స్థానాల్లో హీరో, హోండా కంపెనీలు కొనసాగుతున్నాయి. ఇక టీవీఎస్ వివిధ మోడళ్ల అమ్మకాల వివరాల్లోకి వెళితే..

TVS Jupitor 110

టీవీఎస్ జూపిటర్ (TVS Jupiter): గత నెలలో టీవీఎస్ జూపిటర్ స్కూటర్‌కు విపరీతమైన డిమాండ్ కనిపించింది. కంపెనీ ఏకంగా 1,05,834 యూనిట్ల జూపిటర్‌లను విక్రయించింది. 2024 మార్చిలో నమోదైన 71,390 యూనిట్లతో పోలిస్తే, ఇది ఏకంగా 48శాతం వృద్ధిని నమోదు చేసింది.

భారతీయ మార్కెట్లో టీవీఎస్ జూపిటర్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. జూపిటర్ 110 మోడల్ ధర రూ.80,391 నుండి రూ.92,691 వరకు ఉండగా, ఇది 113.3cc పెట్రోల్ ఇంజన్‌తో లీటరుకు 48 కిమి వరకు మైలేజ్ ఇస్తుంది. ఇక జూపిటర్ 125 మోడల్ ధర రూ.89,396 నుండి రూ.99,805 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇది 124.8cc పెట్రోల్ ఇంజన్‌తో లీటరుకు 57.27 కిమీ వరకు మైలేజ్ అందిస్తుంది.

TVS Apache

టీవీఎస్ అపాచే (TVS Apache): టీవీఎస్ అపాచే బైక్‌లకు యువతలో మంచి క్రేజ్ ఉంది. గత నెల (మార్చి-2025) సుమారు 44,214 యూనిట్ల అపాచే మోటార్‌సైకిళ్లు అమ్ముడయ్యాయి. 2024 మార్చిలో నమోదైన 34,237 యూనిట్లతో పోలిస్తే, ఇది 29% వృద్ధిని సూచిస్తుంది.

టీవీఎస్ అపాచే కూడా వివిధ మోడళ్లలో లభిస్తోంది. అపాచే ఆర్‌టీఆర్ 160 ధర రూ.1.11 లక్షల నుండి రూ.1.31 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇది 159.7cc పెట్రోల్ ఇంజన్‌తో లీటరుకు 47 కిమీ వరకు మైలేజ్ ఇస్తుంది. సేఫ్టీ కోసం డిస్క్ బ్రేక్‌లు కలిగి ఉంది.

అలాగే, అపాచే ఆర్‌టీఆర్ 160 4వి బైక్ ధర రూ.1.20 లక్షల నుండి రూ.1.40 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇది 159.7cc ఎయిర్/ఆయిల్-కూల్డ్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది. ఇది లీటరుకు 45కిమీ వరకు మైలేజ్ ఇస్తుంది. ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు అనేక ఇతర ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

కొత్తగా వచ్చిన టీవీఎస్ అపాచే ఆర్‌ఆర్ 310 మోటార్‌సైకిల్ ధర రూ.2.75 లక్షల నుండి రూ.3 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇది 312.2cc పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో లీటరుకు 34కిమీ వరకు మైలేజ్ ఇస్తుంది. ప్రయాణికుల సేఫ్టీ కోసం డబుల్ డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి.

TVS XL100

టీవీఎస్ ఎక్స్ఎల్ 100 (TVS XL 100): టీవీఎస్ ఎక్స్ఎల్ 100 మొపెడ్‌కు కూడా మంచి ఆదరణ ఉంది. గత నెల (మార్చి-2025) ఏకంగా 35,181 యూనిట్ల ఎక్స్ఎల్ 100 మొపెడ్‌లు అమ్ముడయ్యాయి. అయితే, 2024 మార్చిలో నమోదైన 40,867 యూనిట్లతో పోలిస్తే ఇది -14% క్షీణతను సూచిస్తుంది.

ప్రస్తుతం, టీవీఎస్ ఎక్స్ఎల్ 100 మొపెడ్ వివిధ వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటి ధరలు రూ.46,354 నుండి రూ.60,399 (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. ఇది 99.7cc పెట్రోల్ ఇంజన్‌తో లీటరుకు 65 కిమీ వరకు మైలేజ్ ఇస్తుంది. సేఫ్టీ కోసం డ్రమ్ బ్రేక్‌లు కలిగి ఉన్నాయి.

TVS Sport

టీవీఎస్ రైడర్ (TVS Raider): గత నెలలో సుమారు 30,988 యూనిట్ల రైడర్ బైక్‌లు అమ్ముడయ్యాయి. 2024 మార్చిలో నమోదైన 38,026 యూనిట్లతో పోలిస్తే, ఇది -19శాతం క్షీణతను నమోదు చేసింది.

టీవీఎస్ రైడర్ మోటార్‌సైకిల్ బడ్జెట్ ధరలో లభిస్తుంది. దీని ధర రూ.90,990 నుండి రూ.1.02 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇది 124.8cc పెట్రోల్ ఇంజన్‌తో లీటరుకు 71.94 కిమీ వరకు మైలేజ్ ఇస్తుంది. ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు అనేక ఇతర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇది స్ట్రైకింగ్ రెడ్, వికెడ్ బ్లాక్ రంగుల్లో కూడా లభిస్తుంది.

TVS Jupitor Cover

టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube): టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోంది. గత నెల (మార్చి-2025) ఏకంగా 26,531 యూనిట్ల ఐక్యూబ్ ఈ-స్కూటర్లు అమ్ముడయ్యాయి. 2024 మార్చిలో నమోదైన 14,326 యూనిట్లతో పోలిస్తే ఇది ఏకంగా 85శాతం వృద్ధిని నమోదు చేసింది.

భారతీయ మార్కెట్లో టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ స్టాండర్డ్, ఎస్‌టి వేరియంట్లలో అందుబాటులో ఉంది. స్టాండర్డ్ ఐక్యూబ్ మోడల్ ధర రూ.1.07 లక్షల నుండి రూ.1.37 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇది 2.2 kWh, 3.4 kWh బ్యాటరీ ప్యాక్‌లతో లభిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 75 నుండి 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

టీవీఎస్ ఐక్యూబ్ ఎస్‌టి మోడల్ ధర రూ.1.56 లక్షల నుండి రూ.1.85 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇది మరింత శక్తివంతమైన 3.4 kWh మరియు 5.1 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌లతో లభిస్తుంది. పూర్తి ఛార్జ్‌పై 100 నుండి 150 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది.

ఇవే కాకుండా, టీవీఎస్ కంపెనీకి చెందిన ఇతర ద్విచక్ర వాహనాలు కూడా మంచి సంఖ్యలో అమ్ముడయ్యాయి. ఎన్‌టార్క్ స్కూటర్ 21,948 యూనిట్లు, రేడియన్ బైక్ 10,093 యూనిట్లు, జెస్ట్ స్కూటర్ 7,768 యూనిట్లు, స్పార్ట్ మోటార్‌సైకిల్ 7,073 యూనిట్లు, రోనిన్ బైక్ 5,037 యూనిట్లు, స్టార్ సిటీ మోటార్‌సైకిల్ 2,855 యూనిట్లు అమ్ముడయ్యాయి.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Sunday, April 27, 2025, 10:17 [IST]
English summary
Tvs two wheelers witness huge demand jupiter iqube scooters in high demand
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+