పెట్రోల్ బాధలకు విముక్తి.. టీవీఎస్ ఎలక్ట్రిక్ బైకులు వచ్చేస్తున్నాయ్.. ఇటలీ వేదికపై ఆవిష్కరణ

ఇటలీలో ప్రారంభమైన ప్రపంచ ప్రఖ్యాత మోటార్‌సైకిల్ ఉత్సవం EICMA 2025 మోటార్‌సైకిల్ ప్రేమికులకు నిజమైన పండుగలా మారింది. ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా అనేక అంతర్జాతీయ బ్రాండ్లు తమ కొత్త సాంకేతికతలు, భవిష్యత్ మోడళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలను ఆవిష్కరించాయి. ఈ వేదికపై భారతీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ కూడా తన ప్రతిభను మరోసారి నిరూపించింది. భారత మార్కెట్‌లోనే కాకుండా, ఇప్పుడు ప్రపంచ మార్కెట్లలో కూడా తన స్థానాన్ని బలపరచాలని లక్ష్యంగా పెట్టుకున్న టీవీఎస్ పలు మోడళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ వాహనాలు కేవలం రేంజ్ పరంగా మాత్రమే కాకుండా, స్మార్ట్ కనెక్టివిటీ, బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్, అధిక భద్రతా ప్రమాణాలతో కూడా ఆకట్టుకున్నాయి. వాటి గురించి ఈ కథణంలో చూద్దాం.

TVS M1-S: EICMA 2025లో టీవీఎస్ స్టాల్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది ఈ మోడల్. సింగపూర్‌కు చెందిన ION మొబిలిటీతో కలిసి అభివృద్ధి చేసిన ఈ ఎలక్ట్రిక్ మ్యాక్సీ స్కూటర్, టీవీఎస్ ఎలక్ట్రిక్ విభాగంలో గ్లోబల్ స్థాయిలో ముందడుగు వేసిందని చెప్పొచ్చు. ఇది 12.5 kW(సుమారు 16.76 bhp) ఎలక్ట్రిక్ మోటార్‌, 4.3 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 150 కి.మీ రేంజ్ అందిస్తుంది.

Tvs X Electric Bike M1 S Maxi Scooter And Rr Tangent Showcased At Eicma 2025

డిజైన్ పరంగా ఇది దూకుడు లుక్‌ కలిగి ఉంది. డ్యూయల్ LED హెడ్‌ల్యాంప్‌లు, ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్, విశాలమైన సింగిల్-పీస్ సీటు, 7-అంగుళాల TFT డిస్‌ప్లేతో రైడింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. ఈ డిస్‌ప్లేలో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, మ్యూజిక్ కంట్రోల్, నావిగేషన్, స్మార్ట్ కీ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఆధునిక డిజైన్, శక్తివంతమైన పనితీరు, స్మార్ట్ ఫీచర్ల కలయికతో M1-S టీవీఎస్ భవిష్యత్ ఎలక్ట్రిక్ మొబిలిటీ దిశను ప్రతిబింబిస్తోంది.

TVS RR టాంజెంట్: ఇది పూర్తిగా స్టంట్ ప్రియులు, పర్ఫార్మెన్స్ రైడర్ల కోసం రూపొందించబడిన ఫెయిర్డ్ స్పోర్ట్‌బైక్. దూకుడు డిజైన్, ఆగ్రెసివ్ స్టాన్స్, రేస్ ఇన్‌స్పైర్డ్ ఎరోడైనమిక్స్‌తో ఈ బైక్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. శక్తివంతమైన 300cc ఇంజిన్‌తో వచ్చే RR టాంజెంట్ సుమారు 36 bhp పవర్, 28.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. వేగం, కంట్రోల్, బ్యాలెన్స్ పరంగా ఇది స్టంట్ రైడింగ్‌కు తగిన స్థాయిలో రూపొందించబడింది.

Tvs X Electric Bike M1 S Maxi Scooter And Rr Tangent Showcased At Eicma 2025

TVS X ఎలక్ట్రిక్ బైక్: ప్రసిద్ధ Apache RTR సిరీస్‌ నుండి ప్రేరణ పొందిన ఈ ఎలక్ట్రిక్ బైక్, టీవీఎస్ పెర్ఫార్మెన్స్ విభాగంలో కొత్త యుగాన్ని సూచిస్తోంది. ఇది శక్తివంతమైన పనితీరు, ఆధునిక సాంకేతికత, ఆకర్షణీయమైన డిజైన్‌ కలయికగా రూపొందించబడింది. ఈ బైక్‌లో బహుళ రైడ్ మోడ్‌లు, రెండు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు, అలాగే హిల్ హోల్డ్ అసిస్ట్, రివర్స్ గేర్ వంటి ఆధునిక ఎలక్ట్రానిక్ ఫీచర్లు అందించబడతాయి.

TVS e.FX.30: ఇది టీవీఎస్ ఇప్పటివరకు రూపొందించిన అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ మోడల్‌గా చెప్పబడుతోంది. దూకుడు స్ట్రీట్ ఫైటర్ డిజైన్, కాంపాక్ట్ బాడీ, రా అటిట్యూడ్‌తో ఇది ప్రదర్శనలో అందరి దృష్టిని ఆకర్షించింది. టీవీఎస్ ప్రకారం, e.FX.30 తదుపరి తరం ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. మొత్తంగా, e.FX.30 టీవీఎస్ ఎలక్ట్రిక్ విభాగం భవిష్యత్తు దిశలో ఎంత ముందుకెళ్లబోతుందో తెలియజేసే సింబల్‌గా నిలిచింది.

Tvs X Electric Bike M1 S Maxi Scooter And Rr Tangent Showcased At Eicma 2025

More from DriveSpark

Article Published On: Wednesday, November 5, 2025, 10:30 [IST]
English summary
Tvs x electric bike m1 s maxi scooter and rr tangent showcased at eicma 2025
Read more on: #tvs motors
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+