బైక్‌ని పోలిన స్కూటర్‌.. మార్కెట్లోకి వచ్చాక అందరికీ నచ్చేస్తుంది.. ఫర్ఫామెన్స్‌తో మనసు దోచేస్తుంది!

భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో టీవీఎస్ సంస్థ అదరగొడుతోంది. ఇప్పటికే అనేక సంస్థలు తమ వాహనాలను పరిచయం చేస్తూ ఆకట్టుకుంటుండగా.. టీవీఎస్ సంస్థ కూడా 'తగ్గేదేలే' అంటోంది. ఓ కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని పరిచయం చేసి వారెవా అనిపించింది. TVS X Nacht Fury Edition concept పేరుతో ఈ ఇ-స్కూటర్‌ను ప్రదర్శించింది. అదిరిపోయే డిజైన్‌తో, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో ఈ కాన్సెప్ట్ స్కూటర్ వీక్షకులను చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది. ఈ స్కూటర్‌లో ఉన్న విశేషాలేంటో చూసేద్దాం.

ఈ కాన్సెప్ట్ స్కూటర్‌ను అన్నీ స్కూటర్లలో ఉండే ఫైబర్ బాడీ ప్యానెల్స్, అల్యూమినియం ఫ్రేమ్ కాకుండా వాటి స్థానంలో.. ఆల్- కార్బన్ ఫైబర్‌ను చేర్చి తయారు చేశారు. దీంతో ఈ స్కూటర్ ఆకర్షణీయంగా కనిపించడమేగాకుండా.. దీని తక్కువ బరువు మెటీరియల్ కారణంగా స్పీడ్, ఎఫీషియన్సీ కూడా మెరుగ్గా ఉండనుంది.

TVS X Nacht Fury Edition at Auto Expo 2025

ఈ X Nacht Fury Editionలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం.. దీని రియర్ సీట్‌లో డ్రోన్ ఇంటిగ్రేషన్ చేర్చడం. అంతేగాకుడా ఈ స్కూటర్.. 10.2 అంగుళాల అడ్జస్టబుల్ TFT టచ్ స్క్రీన్‌తో ఉంటుంది. ఇందులో టీవీఎస్ NavPro నేవిగేషన్ సిస్టం కూడా ఉంటుంది.

ఈ స్కూటర్‌ను టీవీఎస్ SmartXonnect ద్వారా కనెక్ట్‌ చేసుకోవచ్చు. దీంట్లో థీమ్ కస్టమైజేషన్, వీడియో ప్లే‌బ్యాక్, గేమింగ్ వంటి మల్టిట్యూడ్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. రైడర్ సేఫ్టీ కోసం... దీంట్లో ఉండే టీవీఎస్ SmartXhield సిస్టమ్ క్రాష్ అలర్ట్స్ అందిస్తుది. దీంట్లో డెడికేటెడ్ అసిస్టెన్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. దాంతోపాటుగా... 19 లీటర్ అండర్ సీట్ స్టోరేజ్ స్పేస్, స్ప్లిట్ సీట్ కన్ఫిగరేషన్, కంబైనింగ్ కన్వీనెన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

TVS X Nacht Fury Edition Launch Date

ఈ TVS X Nacht Fury Edition లో ఆకట్టుకునే డిజైన్, టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్‌తో పాటు బ్యాటరీ, పవర్ అవుట్‌పుట్‌, పర్ఫార్మెన్స్ వంటివి కూడా మెరుగైన అంశాలుగానే కనిపిస్తున్నాయి. దీంట్లో స్టాండర్డ్ వెర్షన్ 4.44kWh బ్యాటరీ, ఎలక్ట్రిక్ మోటారుతో ఉంటుంది. ఇది 2.6 సెకన్లలోనే 0-60kmph స్పీడ్ అందుకోగలదు. ఇది 105 kmph టాప్ స్పీడ్‌తో ప్రయాణిస్తుంది.

దీంట్లోని గ్యాస్- ఛార్జ్‌డ్, ఫుల్లీ అడ్జస్టబుల్ రియర్ మోనోషాక్, టెలిస్కోపిక్ ఫోర్క్, 220mm పెటల్ ఫ్రంట్ డిస్క్, సింగిల్ ఛానల్ ABSతో 195mm రియర్ డిస్క్, 12 అంగుళాల Pirelli రేసింగ్ స్లిక్స్ వంటివి ఉంటాయి. ఇవి అత్యుత్తమ హ్యాండ్లింగ్, గ్రిప్‌ని అందిస్తాయి. ఈ స్కూటర్.. అత్యాధునిక సాంకేతికత, మెరుగైన పర్ఫార్మెన్స్ కారణంగా భవిష్యత్తులో రానున్న ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఓ పెద్ద సవాలుగా నిలవనుంది.

TVS X Nacht Fury Edition Price

అయితే, ఈ కాన్సెప్ట్.. ఉత్పత్తి దిశగా వెళ్తుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం. ఒకవేళ ఇది మార్కెట్లోకి అందుబాటులోకి వస్తే మాత్రం.. దీని హై-ఎండ్ ఎక్విప్ మెంట్, డిజైన్ వంటివి కారణంగా దీని ధర ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ మొబిలిటీ మార్కెట్లో ప్రీమియం స్కూటర్‌గా ఇది నిలవనుంది.ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్‌లో కీలకమైన అడ్వాన్స్మెంట్‌ను TVS X Nacht Fury Edition concept స్కూటర్ అందిస్తోంది.

ఇన్నవేటివ్ ఫీచర్స్ అయిన డ్రోన్ ఇంటిగ్రేషన్, అడ్వాన్స్‌డ్ నేవిగేషన్ సిస్టం, ఫుల్ కార్బన్ ఫైబర్ బాడీ వంటివి ఈ కాన్సెప్ట్ స్కూటర్‌కు అర్బన్ మొబిలిటీలో‌ మంచి గుర్తింపునిచ్చే అవకాశం ఉంది. దీనిని టీవీఎస్‌ ఇంకా ధ్రువీకరించకపోయినప్పటికీ.. ఎలక్ట్రిక్ మొబలిటీ విషయంలో ఈ సంస్థకు ఉన్న నిబద్ధతను ఈ కాన్సెప్ట్ స్కూటర్ చాటుతోంది. ఇందులోని సాంకేతికత, సేఫ్టీ ఫీచర్లు ఈవీలో ఓ బెంచ్ మార్క్‌ను సెట్ చేసే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, January 20, 2025, 7:20 [IST]
English summary
Tvs x nacht fury edition concept electric scooter unveiled at auto expo 2025 check full details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+