రైతును రాజుగా నిలబెట్టిన బండికి ఇలా ఎందుకు జరిగిందో ఎవరికీ అర్ధం కావడం లేదు!
దశాబ్దాలుగా భారతీయ టూవీలర్ మార్కెట్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న వాటిలో TVS XL 100 ఎప్పుడు ముందు ఉంటుంది. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో రైతులు తమ పోలాల పనులకు, చిన్న వ్యాపారాలకు ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. సింపుల్ డిజైన్, పటిష్టమైన నిర్మాణం, తక్కువ నిర్వహణ వ్యయం కారణంగా కోట్లాది భారతీయుల జీవనశైలిలో భాగమైపోయిన నమ్మకమైన మోడల్ ఇది. ఇది చూడటానికి సాధారణ మోడల్ లాగా కనిపించినా, దాని సామర్థ్యం అసాధారణం. సౌకర్యవంతమైన సీటు, పెద్ద బిగ్‌రాక్ క్యారియర్, తక్కువ ఇంధన వినియోగం, నమ్మకమైన పెట్రోల్ ఇంజిన్.. ఇవన్నీ దీనికి వేర్వేరు స్థానం కల్పించాయి. ఏ పరిస్థితుల్లోనైనా పనిచేయగల సామర్థ్యం XL 100 కు మరో ప్రధాన బలంగా నిలుస్తుంది. తక్కువ బరువు ఉన్నప్పటికీ, ఇది మిల్క్ క్యాన్లు, కిరాణా బస్తాలు, లేదా ఇతర సరుకులు ఈజీగా మోసేలా నిర్మించబడింది.
ఇంత పేరు, ప్రఖ్యాతలు కలిగిన బైక్ మే 2025లో సేల్స్ పరంగా కాస్త వెనుకబడింది. TVS మోటార్ అందించిన లెక్కల ప్రకారం, ఆ నెలలో 37,264 యూనిట్లను కంపెనీ విక్రయించింది. అయితే ఈ గణాంకం గడిచిన ఏడాది అదే నెలతో పోలిస్తే కొంత వెనకబడింది. 2024 మేలో ఈ మోడల్ 40,394 యూనిట్ల అమ్మకాల రికార్డును సాధించింది. ఈసారి అమ్మకాలు సుమారుగా 7.75 శాతం మేర తగ్గినట్లు తెలుస్తోంది.

గత కొన్ని దశాబ్దాలుగా భారతీయ మార్కెట్లో ఒక విశేష స్థానం కలిగిన TVS XL 100 అమ్మకాలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. దీనికి పలు కారణాలు ఉన్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మొదటగా చెప్పుకోవలసింది, ఈ విభాగంలో కొత్త మోడళ్లు విస్తరించాయి. ఇతర కంపెనీల నుండి వచ్చిన బైక్‌లు, స్కూటర్లు ఇప్పుడు మరింత ఆకర్షణీయమైన ధరల్లో, లేటెస్ట్ ఫీచర్లతో అందుబాటులో ఉన్నాయి.
కేవలం కొంచెం ఎక్కువ డబ్బు పెట్టి ఇంకా సౌకర్యవంతమైన, స్టైలిష్ వాహనాలను కొంతమంది వినియోగదారులు ఎంచుకోవాలని నిర్ణయిస్తున్నారు. అలాగే, XL 100లో కొన్ని లేటెస్ట్ అంశాలు లేకపోవడం కూడా ఒక కారణమని భావిస్తున్నారు. వినియోగదారులు బలమైన ఇంజిన్ మాత్రమే కాకుండా, స్మార్ట్ ఫీచర్లు, మంచి డిజైన్, అధిక సౌకర్యం కూడా కోరుకుంటున్నారు. ఈ అంశాల లోపం వల్ల కొంత మంది ఈ మోడల్‌కి బదులుగా ఇతర ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు.

TVS XL 100 ధర రూ.46,954 నుంచి మొదలై, టాప్-ఎండ్ వేరియంట్లకు రూ.62,905 వరకు ఎక్స్-షోరూమ్ ధరలో లభిస్తుంది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ మోడల్‌ను విభిన్న రకాల వేరియంట్లలో అందించారు. అందులో హెవీ డ్యూటీ, హెవీ డ్యూటీ ఐ-టచ్‌స్టార్ట్, హెవీ డ్యూటీ ఐ-టచ్‌స్టార్ట్ విన్ ఎడిషన్, అలాగే కంఫర్ట్ ఐ-టచ్‌స్టార్ట్ వంటి ఆప్షన్లు ఉన్నాయి.
కొత్త XL 100కు క్లాసిక్, సరళమైన డిజైన్‌ఉండటమే కాకుండా, దాని ఆకర్షణీయమైన కలర్స్ కూడా ప్రతిఒక్కరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ మోడల్ నీలం, ఆకుపచ్చ, ఎరుపు, నలుపు వంటి బోలెడన్ని కలర్స్‌లో లభిస్తుంది. కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 1,858 mm, వెడల్పు 670 mm, ఎత్తు 1,060 mm. ఈ కొలతల వల్ల మోపెడ్ నడిపే వారికి మరింత సౌకర్యంగా ఉంటుంది. ఇంజిన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

ఇది 99.7 cc సామర్థ్యం గల సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 6,000 rpm వద్ద 4.4 PS శక్తిని, 3,500 rpm వద్ద 6.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. తక్కువ బరువు, సమర్థవంతమైన ఇంజిన్‌తో సగటున 65 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. కొత్త మోడల్ USB ఛార్జింగ్ పోర్ట్, స్ప్లిట్ సీట్, అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి కలిగి ఉంది.


Click it and Unblock the Notifications