మీ ఆవిడ బర్త్ డేకు ఈ స్కూటర్ కొనివ్వండి..మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకోవడం గ్యారెంటీ
మీరు మీ భార్యకు లేదా ఇంట్లో మహిళలకు సరికొత్త స్కూటర్‌ను గిఫ్ట్‌గా ఇవ్వాలని ఆలోచిస్తున్నారా? అయితే, టీవీఎస్ జెస్ట్ 110 (TVS Zest 110) అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్‌లలో ఒకటి. తక్కువ బరువు కలిగి, మహిళలు సులభంగా ఉపయోగించడానికి వీలుగా ఉంటుంది. అందువల్ల మహిళలు దీనిని సులభంగా నడపవచ్చు.కేవలం రూ.70,000 ప్రారంభ ధరతో లభిస్తున్న ఈ జెస్ట్ 110 స్కూటర్ ధర ఎంత, దీని ప్రత్యేకతలు ఏంటి అనే పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
కొత్త టీవీఎస్ జెస్ట్ 110 స్కూటర్ మార్కెట్‌లో చాలా సరసమైన ధరకే లభిస్తోంది. దీని ప్రారంభ ధర రూ.70,600, గరిష్టంగా రూ.75,500 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఈ స్కూటర్ గ్లాస్, మ్యాట్ సిరీస్, ఎస్‌ఎక్స్‌సి అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

డిజైన్ పరంగా ఇది చాలా అందంగా, సరళంగా ఉంటుంది. షార్ప్ హెడ్‌ల్యాంప్స్, ఇండికేటర్లతో పాటు, స్ట్రాంగ్ బాడీ ప్యానెల్స్‌ను కలిగి ఉంది. ఇది బోల్డ్ బ్లాక్, గ్రాఫైట్ గ్రే, మ్యాట్ బ్లాక్, మ్యాట్ బ్లూ, పర్పుల్, మ్యాట్ రెడ్, పెర్ల్ వైట్, టర్కోయిస్ బ్లూ వంటి రంగులలో లభిస్తుంది.
టీవీఎస్ జెస్ట్ 110 చూడటానికి చిన్న సైజులో ఉన్నప్పటికీ రైడింగ్‌కు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది 1,770 మి.మీ పొడవు, 660 మి.మీ వెడల్పు, 1,139 మి.మీ ఎత్తును కలిగి ఉంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 150 మి.మీ, వీల్‌బేస్ 1,250 మి.మీ. ముఖ్యంగా దీని బరువు కేవలం 103 కేజీలు మాత్రమే ఉండటం వలన, మహిళలకు నడపడం చాలా సులభం.

ఈ స్కూటర్‌లో 109.7-సీసీ ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8.19 బీహెచ్‌పి పవర్, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 8.8 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ 80 కెఎంపిహెచ్ టాప్ స్పీడ్‌ను అందుకోగలదు. కేవలం 11 సెకన్లలో 0 నుంచి 60 కెఎంపిహెచ్ వేగాన్ని చేరుకోగలదు.
టీవీఎస్ జెస్ట్ 110 మంచి ఇంధన సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. ఈ స్కూటర్ 45 నుంచి 50 కి.మీ వరకు మైలేజీని ఇవ్వగలదు. దీని ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 5 లీటర్లు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, 9 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ స్పేస్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి.

లగేజ్ హుక్, కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ సౌకర్యం కూడా ఉంది. ఇందులో అలాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్లు అమర్చారు. దీని సీటు ఎత్తు 760 మి.మీ ఉండటం వలన కూడా సులభంగా నిర్వహించవచ్చు. రైడర్ల సేఫ్టీ కోసం ఈ స్కూటర్‌లో ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుకవైపు డబుల్ రేటెడ్ హైడ్రాలిక్ మొనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంది.
అలాగే ఇందులో డ్రమ్ బ్రేక్‌లను అమర్చారు. మార్కెట్‌లో ఈ స్కూటర్‌కు హీరో ప్లెషర్ ప్లస్ (Hero Pleasure Plus), టీవీఎస్ జుపిటర్ (TVS Jupiter), హీరో జూమ్ (Hero Xoom), హోండా డియో (Honda Dio), హీరో డెస్టినీ (Hero Destini), సుజుకి యాక్సెస్ (Suzuki Access),హోండా యాక్టివా (Honda Activa) వంటి పోటీదారులు ఉన్నారు.


Click it and Unblock the Notifications








