30 ఏళ్లు గడిచిపోయాయి.. ఆ రోజుల్లో కలగా అనిపించింది.. ఇప్పుడు నిజం అయ్యాయి

బెంగళూరుకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన (EV) స్టార్టప్ అల్ట్రావయోలెట్ (ultraviolette) ఇటీవల కాలంలో వరుసగా కొత్త లాంచ్‌లు చేస్తుంది. ఈవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను అందిపుచ్చుకుని భారీగా ప్రయోజనాలు పొందడానికి అత్యాధునిక ఫీచర్స్‌తో కొత్త మోడళ్లను దింపుతుంది. భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా తన సత్తాను నిరూపించుకుంటుంది. భారతదేశ సాఫ్ట్‌వేర్ రాజధానిగా ప్రసిద్ధి చెందిన బెంగళూరులో, అనేక కొత్త సాంకేతిక పరిజ్ఞాన సంస్థలు పుట్టుకొచ్చాయి. అలాంటి వాటిలో అల్ట్రావయోలెట్ కూడా ఒక విశేషమైన పేరుగా నిలిచింది. ఈ సంస్థ భారతదేశపు మొట్టమొదటి ఖరీదైన సూపర్ ఎలక్ట్రిక్ బైక్‌ను రూపొందించిన ఘనతను సాధించింది. F77 పేరుతో ఈ సూపర్ ఎలక్ట్రిక్ బైక్ మొదట లాంచ్ అవుతూ, తన శక్తివంతమైన పనితీరు, స్పోర్టీ రూపకల్పన, అత్యాధునిక టెక్నాలజీతో దేశవ్యాప్తంగా EV ప్రియుల దృష్టిని ఆకర్షించింది.

ఇటీవల కంపెనీ తన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు కొత్త అడుగులు వేసింది. ఇందులో భాగంగా, సంస్థ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌తో పాటు తక్కువ ధరలో అందుబాటులో ఉండే ఎలక్ట్రిక్ బైక్‌ను కూడా ఆవిష్కరించింది. టెస్సెరాక్ట్, షాక్‌వేవ్ పేర్లతో రెండు కొత్త అల్ట్రావయోలెట్ ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లో ప్రవేశపెట్టినప్పటికీ, ఈ స్కూటర్, బైక్‌లను వెంటనే రోడ్డుపై చూసే అవకాశం వినియోగదారులకు త్వరలో కలగనుందో లేదో అనేది అనుమానమే.

Narayan Subramaniam Shares The Photo In Front Of Eiffel Tower

సంస్థ ప్రకటించిన వివరాల ప్రకారం, వీటికి సంబంధించిన డెలివరీలు 2026 వరకు ఆలస్యం కావచ్చు. అయితే, ముందస్తు బుకింగ్‌లు మాత్రం ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే F77 సూపర్ ఎలక్ట్రిక్ బైక్‌కి భారత్‌లో కన్నా యూరప్‌లో ఎక్కువ ఆదరణ ఉంది. దీంతో అల్ట్రావయోలెట్ దృష్టిని అంతర్జాతీయ మార్కెట్లవైపు మళ్లించింది. యూరప్‌లో, ముఖ్యంగా ఫ్రాన్స్‌లో, ఈ బైక్‌కు మంచి డిమాండ్ లభించే అవకాశాలున్నాయని సంస్థ భావిస్తోంది.

అందుకే బ్రాండ్ అంబాసిడర్‌గానే కాకుండా పెట్టుబడిదారుడిగా కూడా ఉన్న ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్, ఇటీవలి రోజుల్లో యూరప్ పర్యటనలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన కొన్ని ఫోటోలు షేర్ చేశారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈఫిల్ టవర్ పక్కన దుల్కర్ సల్మాన్, అల్ట్రావయోలెట్ F77 ఎలక్ట్రిక్ బైక్‌‌తో కనిపించారు. ఈ బ్రాండ్‌ను ఫ్రాన్స్‌లోని విస్తరించాలన్న లక్ష్యంలో భాగంగా ప్రచార కార్యక్రమం చేశారు.

అయితే ఇప్పుడు కేవలం దుల్కర్ సల్మాన్ మాత్రమే కాదు అల్ట్రావయోలెట్ సీఈఓ నారాయణ్ సుబ్రమణ్యం కూడా తన బైక్‌తో ఈఫిల్ టవర్ దగ్గర ఒక ప్రత్యేకమైన ఫోటో తీసుకున్నారు. సంస్థ దృష్టి ఇప్పుడు అంతర్జాతీయ విస్తరణ, కొత్త వాహనాల సరఫరా, యూరప్ మార్కెట్‌లో స్థిరమైన స్థానం సాధించడంపైనే ఉంది. భారత్‌లో కూడా వీటి ఆవిష్కరణ పట్ల బైక్ ప్రియుల్లో ఆసక్తి కొనసాగుతూనే ఉంది.

సీఈఓ నారాయణ్ సుబ్రమణ్యం ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఆ ఫోటోలో చిన్న వయసులో తాను ఈఫిల్ టవర్ ముందు నిలబడి ఉండగా, తాజాగా దిగిన ఫోటోను ప్రక్కప్రక్కన పెట్టి పోస్ట్ చేశారు. ఇప్పుడు తన సొంతంగా రూపొందించిన, అల్ట్రావయోలెట్ F77 సూపర్ ఎలక్ట్రిక్ బైక్ కూడా ఉంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియక, చిన్న పిల్లవాడిగా ఈఫిల్ టవర్ ముందు నిలబడి ఉన్నాను.

Ultraviolette Ceo Narayan Subramaniam

ఆ సమయంలో ఎవరైనా వచ్చి, ఒక రోజు నువ్వు కేవలం పర్యాటకుడిగా కాకుండా, నువ్వు కష్టపడి సృష్టించిన మోటార్‌సైకిల్‌ను పరిచయం చేయడానికి ఇక్కడికి వస్తావు అని చెబితే, నేను నమ్మేవాడిని కాను అని జ్ఞాపకాన్ని సోషల్ మీడియాలో రాశారు. తన చిన్నప్పటి ఫోటోను, ఇప్పుడు తాను స్థాపించిన కంపెనీ ప్రతిష్ఠాత్మక బైక్ ఫోటోను ఒకేసారి ఉంచడం ద్వారా, ఏ కలకైనా కష్టపడి సాధించే మార్గం ఉంటుందని ఆయన చూపించారు.

ఈ విషయాన్ని ఆయన ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు లింక్డ్‌ఇన్‌లో కూడా పంచుకున్నారు. ఆ ఫోటోలకు, ఆ మాటలకు వందలాదిమంది నుంచి అభినందనలు, కామెంట్లు వచ్చాయి. నిజానికి, ఒక చిన్న బాలుడి కల చివరికి ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్ దగ్గర తన సొంత బైక్‌ను ఆవిష్కరించడం వరకు చేరడం నిజంగా అనుభూతి కలిగించే విషయం.

More from DriveSpark

Article Published On: Friday, June 27, 2025, 14:52 [IST]
English summary
Ultraviolette ceo narayan subramaniam shares the photo in front of eiffel tower with f77
Read more on: #ultraviolette
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+