ఒకే బైక్‌లో రెండు ప్రపంచాలు.. రోడ్‌తో పాటు అడవిలో కూడా రయ్ మంటూ దూసుకుపోయే పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్
ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీ అల్ట్రావయోలెట్ (ultraviolette) ఇండియాలో కొత్తగా అధునాతన ఫీచర్స్ కలిగిన ఎలక్ట్రిక్ బైకును విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ పేరు 'షాక్ వేవ్ (shockwave)'. ఇది రెండు విధాలుగా ఉపయోగించడానికి అనువుగా ఉంటుంది. అడవులు, బండరాళ్లు, గుంతలు కలిగిన ఆఫ్‌రోడ్‌తో పాటు సాధారణ రోడ్లపై కూడా ఈజీగా దూసుకుపోతుంది. భారత్‌లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తుంది. ఈ నేపథ్యంలో తయారీదారులు పోటా పోటీగా కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ఈవీ మార్కెట్‌ను కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న అల్ట్రావయోలెట్ కొత్త డ్యూయల్-పర్పస్ ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేసింది. మరో విషయం ఏమిటంటే దీంతో పాటే తన మొట్టమొదటి 'టెస్రాక్ట్ (Tesseract)' ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కూడా విడుదల చేసింది. స్కూటర్ విభాగంలో టెస్రాక్ట్. బైక్స్ విభాగంలో షాక్ వేవ్ కంపెనీని గొప్ప స్థాయికి తీసుకెళ్తాయని కంపెనీ భారీ అంచనాలు పెట్టుకుంది.
అల్ట్రావయోలెట్ షాక్ వేవ్ డిజైన్ చూడటానికి సూపర్‌మోటో, ర్యాలీ స్టైల్ మోడళ్ల నుంచి ప్రేరణ పొందినట్లుగా ఉంటుంది. అడ్వెంచర్‌ను కోరుకునే రైడర్లకు అనువుగా ఉంది. నగర రోడ్లతో పాటు, ఆఫ్-రోడ్ రైడింగ్‌కు అనుకూలంగా డ్యూయల్-పర్పస్ కోసం తీసుకొచ్చిన షాక్ వేవ్ భారతీయ మార్కెట్లో సంచలన అమ్మకాలు సాధిస్తుందని కంపెనీ అంచనాలు వేస్తుంది. ICE ఇంజిన్ ఆప్షన్‌లో అందుబాటులో ఉన్న అడ్వెంచర్ బైక్స్‌కు ఇది బలమైన పోటీ ఇస్తుంది.

తాజాగా బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో అల్ట్రావయోలెట్ తన ప్రసిద్ధ మోడళ్లు షాక్ వేవ్, టెస్రాక్ట్‌లను విడుదల చేసింది. కంపెనీ తన మార్కెట్‌ను పెంచుకోవడానికి కీలకంగా ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో వీటితో పాటు భవిష్యత్తులో మరిన్ని మోడళ్లను తీసుకురావాలని చూస్తుంది. ఇక, డ్యూయల్-పర్పస్ ఎలక్ట్రిక్ బైక్ షాక్ వేవ్ ప్రారంభ ధర రూ.1.75 లక్షలు (ఎక్స్ షోరూమ్ ధర). అయితే ప్రత్యేకంగా లాంచ్ ఆఫర్ తగ్గింపును కూడా అందిస్తుంది.
లాంచ్‌లో భాగంగా అల్ట్రావయోలెట్ ప్రకటించిన దాని ప్రకారం, మొదటి 1000 మంది కస్టమర్లకు ఈ బైక్‌ను రూ.1.50 లక్షలకే అందిస్తుంది. ఆ తర్వాత వచ్చే వారికి సాధారణ ధరతో మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. తక్కువ ధరలో నగర రోడ్లతో పాటు, ఆఫ్-రోడ్ రైడింగ్‌కు అనుకూలంగా ఉండే అడ్వెంచర్ మోడల్ ఈవీ బైక్‌ను సొంతం చేసుకోవాలనుకుంటే వెంటనే షోరూమ్‌ను సంప్రదించడం ఉత్తమం.

దీనిలో ఐడిసి సైకిల్ ప్రకారం, సింగిల్ ఛార్జ్‌తో 165 కి.మీల వరకు రేంజ్‌ను అందిస్తుంది. షాక్‌వేవ్ కేవలం 2.9 సెకన్లలో 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది ఆఫ్‌రోడ్ రైడింగ్‌లకు కూడా అనువుగా ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రిక్ మోటార్‌ను మెరుగైన పెర్ఫామెన్స్ ఇచ్చే విధంగా అందించారు. ఇది 14.5 bhp పవర్, 505 Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది.
దీని టాప్ స్పీడ్ వచ్చేసి గంటకు 120 కి.మీలుగా ఉంది. బ్యాటరీ గురించి తెలుసుకున్నట్లయితే 4 కిలోవాట్ (kWh)గా ఉంటుంది. ఇది డ్యూయల్-ప్రొజెక్టర్ LED లైట్లు, నిలువుగా ఉన్నటువంటి హెడ్‌ల్యాంప్, మెరుగైన హ్యాండిల్‌బార్, రైడర్లకు అనుకూలంగా ఉండే సీట్లు, ముందు USD ఫోర్స్క్, వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్ సెటప్‌ను అమర్చారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు


Click it and Unblock the Notifications








