ఒక సంవత్సరం... 65,000 కిలోమీటర్లు! ఎలక్ట్రిక్ బైక్ వీరుడి అడ్వెంచర్ జర్నీ.. వైరల్ అవుతున్న హరీష్ కథ

మన దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల వాడకం బాగా పెరిగింది. రోజువారీ ఆఫీస్ ప్రయాణం, షాపింగ్ లేదా చిన్నపాటి ఇతర ఇంటి అవసరాలకు ఇవి ఉపయోగపడుతున్నాయి. వేగంగా ఛార్జ్ అవ్వడం, నిర్వహణ తక్కువగా ఉండటం, సౌండ్ లేకుండా నిశ్శబ్దంగా నడవడం వంటి అంశాల కారణంగా ఇటీవలి కాలంలో చాలా మంది కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. యువతకు, మహిళలకు కూడా ఇవి అనుకూలంగా ఉంటాయి. ఇ స్కూటర్లు బాగానే క్లిక్ అవుతున్న సమయంలో ఎలక్ట్రిక్ బైకులు కూడా ఇప్పుడు మార్కెట్లోకి అడుగుపెడుతున్నాయి. అయితే ప్రధానంగా, ఇవి ఎక్కువ ఖరీదైనవిగా భావించబడుతున్నాయి. లక్షల రూపాయల విలువ ఉన్న ఈ-బైక్‌ల పట్ల ఇప్పటికీ చాలా మంది ఆసక్తి చూపించడం లేదు. అయినప్పటికి కొంత మంది మాత్రం ఈవీ బైకులను కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

ఈ ఎలక్ట్రిక్ బైకులతో ఎక్కువ దూరం ప్రయాణించడానికి వీలుండదు అని చాలా మంది భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆ ఆలోచన తప్పు అని ఇటీవల ఒక వ్యక్తి ద్వారా తెలిసింది. హరీష్ సురంబడే అనే యువకుడు అందరి అపోహలను కొట్టిపారేసేలా చేశాడు. అతను తన అల్ట్రావయోలెట్ F77 మాక్ 2 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌పై ఏకంగా ఒకే సంవత్సరంలో 65,000 కిలోమీటర్లు ప్రయాణించి సరికొత్త సంచలనానికి తెరలేపాడు.

Ff77 Mac 2 Owner Completed 65000Km

అంటే, అతను నెలకు సగటున 5500 కిలోమీటర్లు నడిచినట్లు అర్థం. హరీష్ సురంబడే అల్ట్రావయోలెట్ F77 మాక్ 2‌తో ఇంత దూరం ప్రయాణించడం గురించి ఆటో ఔత్సాహికులు ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. 365 రోజుల్లో ఏకంగా 65,000 కిలోమీటర్లు ప్రయాణం చేయడం, అది కూడా ఎలక్ట్రిక్ బైకుపై అంటే ఇది అసాధారణ విషయం అని చెప్పవచ్చు. ఈ విషయాన్ని అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్ సీఈఓ నారాయణన్ సుబ్రమణ్యం తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు.

హరీష్ చేసిన అద్భుతమైన ప్రయాణాన్ని ఆయన ప్రశంసించారు. అంతేకాదు, ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టిన ప్రముఖ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ కూడా హరీష్ విజయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. హరీష్ ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను కొనుగోలు చేసిన మొదటి కస్టమర్లలో ఒకడు. బైక్ డెలివరీ అయిన మొదటి రోజు నుంచే, అతను ఈ బైక్‌ను కేవలం పట్టణ ప్రయాణాలకు కాదు, దూర ప్రయాణాలకు తీసుకెళ్లడం మొదలుపెట్టాడు.

Ff77 Mac 2

చాలామంది ఈ-బైక్ అంటే చిన్న ప్రయాణాలకే సరిపోతుందని అనుకుంటారు. కానీ హరీష్ సరైన ప్లానింగ్‌తో తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించి, పెట్రోల్ బైకులతో పాటు సమానంగా ఎలక్ట్రిక్ బైకులు కూడా మంచి పనితీరును కనబరుస్తాయని నిరూపించాడు. సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే వారు ఛార్జింగ్ గురించి ప్రత్యేకంగా ఆలోచిస్తారు. ఎందుకంటే దేశంలో ఛార్జింగ్ సదుపాయాలు ఇంకా మెరుగుపడలేదు.

దూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో బైకును ఛార్జింగ్ చేసుకోవడం చాలా కష్టం. అయినప్పటికి కూడా హరీష్ సురంబడే తన ప్రయాణంలో వచ్చిన అన్ని ఇబ్బందులను కూడా తట్టుకున్నాడు. దూర ప్రయాణం చేయాలంటే ఏ బైకర్‌కైనా గట్టి సంకల్పం, అనుభవం, వాహనంపై అభిమానం అవసరం. హరీష్ సురంబడే దాదాపు 65,000 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం చేయడం అనేది ఒక్క వాహనం మీద నమ్మకాన్ని మాత్రమే కాదు.

Ultraviolette Electric Bike Ff77 Mac 2

ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్ల భవిష్యత్తుపై నమ్మకాన్నికూడా ప్రతిబింబిస్తుంది. అలాగే అల్ట్రావయోలెట్ F77 సామర్థ్యం కూడా బయటపడింది. ఎలక్ట్రిక్ బైక్‌ అంటే ఖరీదైన మోడల్ అని భావించే వారికి, హరీష్ ఉపయోగించిన అల్ట్రావయోలెట్ F77 అసలు అంత ఖరీదైనది కాదు. ఇది భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ సూపర్‌బైక్ అన్న గౌరవాన్ని పొందిన మోడల్. ఈ బైక్ మార్కెట్‌లోకి వచ్చినప్పుడు, మోటార్‌సైకిల్ ప్రపంచంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది.

తర్వాత అదే బైక్‌కు మరింత శక్తివంతమైన, డిజైన్ ఇచ్చి F77 Mach 2గా విడుదల చేశారు. మరిన్ని ఫీచర్లను, మెరుగైన పనితీరును అందిస్తుంది. ఈ బైక్‌కి ఉన్న శక్తి సామర్థ్యం ఏకంగా 40.2 PS పవర్, 100 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్టాండర్డ్ Mach 2 దాదాపు 211 కి.మీల ఐడిసి రేంజ్‌ను అందిస్తుంది. మెరుగైన బ్యాటరీ ప్యాక్‌తో 323 కి.మీ పరిధిని కలిగి ఉంటుంది.

ప్రారంభంలో హరీష్ సురంబడే తన అల్ట్రావయోలెట్ F77 Mach 2 పై కేవలం చిన్న ప్రయాణాలకే పరిమితమయ్యాడు. అయితే, మొదటి 4,000 నుండి 5,000 కిలోమీటర్ల రైడ్ తర్వాత, సాహసోపేతమైన ఆలోచన వచ్చింది. ఎందుకు ఈ బైక్‌ను అంతర్జాతీయ సరిహద్దుల దాకా నడిపించకూడదు అని?. ఈ ఆలోచన రాగానే కొన్ని నెలల క్రితం హరీష్ తన బైక్‌పై బెంగళూరు నుండి నేరుగా నేపాల్ రాజధాని ఖాట్మండూ వరకు ప్రయాణం ప్రారంభించాడు.

ఈ ప్రయాణంలో అతను భారతదేశం నుంచి నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, చైనా సరిహద్దులను దాటి ప్రయాణించాడు. ఈ రైడ్ మొత్తం 10,000 కి.మీ. పైగా సాగింది. అన్ని వాతావరణ పరిస్థితులను దాటి, అతను తన Ultraviolette F77 Mach 2 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌పై దాదాపు సంవత్సరం పాటు నిరంతర ప్రయాణం చేశాడు. మంచుతో కప్పబడిన హిమాలయ పర్వతాలు, విరిగిపోయిన రోడ్లు, తేమగా ఉండే అడవి మార్గాలపై ఈ ప్రయాణం సాగింది.

అల్ట్రావయోలెట్ F77 మాక్ 2 బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇది కేవలం శక్తివంతమైన మోటార్‌తోనే కాకుండా రైడింగ్ సేఫ్టీ, కనెక్టివిటీ ఫీచర్లతో కూడిన ప్రీమియం అనుభూతిని అందిస్తోంది. ఈ బైక్‌లో ఉన్న ఆప్టిమైజ్ చేయబడిన డ్యుయల్ ఛానెల్ ABS అత్యవసర బ్రేకింగ్ సమయంలో కాపాడుతుంది. ట్రాక్షన్ కంట్రోల్ సహాయంతో తడిగా ఉండే లేదా కఠినమైన రోడ్లపై కూడా బైక్ కంట్రోలింగ్‌లో పరుగులు పెడుతుంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు

More from DriveSpark

Article Published On: Thursday, May 22, 2025, 7:20 [IST]
English summary
Ultraviolette electric bike ff77 mac 2 owner completed 65000km journey in 365 days
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+