ఒక్కసారి ఛార్జ్ చేస్తే 261 కిలోమీటర్లు నాన్‌స్టాప్ రైడ్.. మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్
బెంగళూరుకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీ అల్ట్రావయోలెట్ (ultraviolette) దేశీయ మార్కెట్లో ఈవీ విభాగంలో చాలా కాలంగా తన సత్తా చాటుతోంది. ప్రస్తుతం భారత్ ఎలక్ట్రిక్ వాహనాలకు అతిపెద్ద గమ్యస్థానంగా ఉంది. ఈ నేపథ్యంలో కంపెనీ మిగతా తయారీదారుల కంటే మరింత దూకుడు ప్రదర్శిస్తూ, కొత్త టూవీలర్స్‌ను తీసుకురావడంలో వేగాన్ని పెంచింది. ఈ క్రమంలో అల్ట్రావయోలెట్ భారతీయ మార్కెట్లోకి తాజాగా తన మొట్టమొదటి 'టెస్రాక్ట్ (Tesseract)' ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఇది ఆకర్షణీయమైన డిజైన్‌తో, అదిరిపోయే పెర్ఫామెన్స్‌తో వచ్చింది. అన్ని వర్గాల వారు కొనగలిగే విధంగా బడ్జెట్ ధరలోనే దీన్ని లాంచ్ చేసింది. ఈ కొత్త స్కూటర్‌లో అల్ట్రావయోలెట్ ఇప్పటికే మార్కెట్లో ఉన్నటువంటి ఓలా, టీవీఎస్, బజాజ్, ఏథర్ వంటి ఇతర ఈవీ తయారీదారులకు గట్టి పోటీ ఇచ్చినట్లయింది. చూడగానే నచ్చే విధంగా ఉన్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.45 లక్షలు (ఎక్స్-షోరూమ్).
అయితే లాంచ్ ఆఫర్‌లో భాగంగా కొత్త అల్ట్రావయోలెట్ టెస్రాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ రూ. 1.20 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే ఈ ప్రత్యేక తగ్గింపు ఆఫర్ కేవలం మొదటి 10,000 మందికి మాత్రమే. టెస్రాక్ట్ ఇ-స్కూటర్ మార్కెట్లో హిట్ మోడల్ అవుతుందని కంపెనీ భారీ అంచనాలు పెట్టుకుంది. రేంజ్ పరంగా చూసినట్లయితే ఇది కస్టమర్లకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

అల్ట్రావయోలెట్ టెస్రాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పూర్తిగా ఒక్కసారి ఛార్జ్ చేసినట్లయితే ఏకంగా 261 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇ స్కూటర్ 3.5 కిలోవాట్ల (kWh), 5 కిలోవాట్ల (kWh), 6 కిలోవాట్ల (kWh) బ్యాటరీ ప్యాక్‌లో కొనుగోలుకు లభిస్తుంది. దీనిలో అధునాతన టెక్నాలజీని కలిగిన ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చారు. ఇది 20.1 bhp హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసి గంటకు 125 కి.మీలు.
అలాగే టెస్రాక్ట్ ఇ-స్కూటర్ కేవలం 2.9 సెకన్లలో 0 నుంచి 80 కి.మీల వేగాన్ని అందుకుంటుంది. ప్రస్తుతం ఎక్కువ రేంజ్ అందించే ఇ-స్కూటర్స్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో 261 కిలోమీటర్ల వరకు రేంజ్ అందించే టెస్రాక్ట్ చాలా మంది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. దీనిలో కస్టమర్లకు ఉపయోగకరంగా ఉండే చాలా లేటెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి. 7-అంగుళాల TFT స్క్రీన్, ఆన్-బోర్డ్ నావిగేషన్ సిస్టమ్ వంటి ఉంటాయి.

ఇంకా సీటు క్రింది భాగంలో 34-లీటర్ స్టోరేజ్ ఉంది, ఓవర్‌టేక్ అలర్ట్, బ్లైండ్‌స్పాట్ డిటెక్షన్, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అవతలి వాహనాలు ఢీకొన్నప్పుడు హెచ్చరించేందుకు టెస్రాక్ట్ ఇ-స్కూటర్‌లో ముందు, వెనుక రాడార్‌లను అమర్చారు. ఈ ఫీచర్ దేశంలో ఏ ఇతర స్కూటర్లలో ఇప్పటి వరకు అందించలేదని సమాచారం. అలాగే, దీనిలో వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్ సదుపాయాన్ని కూడా అందించారు. రైడర్లకు మరింత రక్షణ కోసం కూడా లేటెస్ట్ సేఫ్టీ ప్రమాణాలు ఉన్నాయి.
దీనికి ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లను ఏర్పాటు చేశారు. అదనపు రక్షణ కోసం డ్యూయల్-ఛానల్ ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ వంటివి కూడా ఉన్నాయి. కొత్త అల్ట్రావయోలెట్ టెస్రాక్ట్ ఇ-స్కూటర్ బుకింగ్‌లు అతి త్వరలో ప్రారంభం కానున్నాయి. బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు డెలివరీలు 2026 మొదటి త్రైమాసికంలో ఉంటాయని సమాచారం.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు


Click it and Unblock the Notifications








