యూరప్ రోడ్లపై ఇండియా టెక్నాలజీ.. విదేశాల్లో మన బైక్స్.. ఇది కేవలం లాంచ్ కాదు, లెజెండరీ ఎంట్రీ!
బెంగళూరును కేంద్రంగా కలిగి ఉన్న ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ వాహన తయారీ సంస్థ 'అల్ట్రావయోలెట్ (Ultraviolette) ఆటోమోటివ్', ఇప్పుడు తన అంతర్జాతీయ ప్రయాణాన్ని మరింత వేగంగా కొనసాగిస్తోంది. ఇటీవలే జర్మనీలో విజయవంతంగా అరంగేట్రం చేసిన ఈ సంస్థ, తాజాగా పారిస్ నగరంలో కూడా తన ప్రీమియం మోడళ్లను ప్రవేశపెట్టింది. ప్రత్యేకించి, దీని రెండు ఫ్లాగ్‌షిప్ పెర్ఫార్మెన్స్ మోటార్‌సైకిళ్లు F77 MACH 2, F77 సూపర్‌స్ట్రీట్ ఫ్రాన్స్ మార్కెట్ కోసం అధికారికంగా విడుదలయ్యాయి. ఈ లాంచ్‌కు సంబంధించిన ప్రత్యేకత ఏమిటంటే, జులై 31, 2025 వరకు చేసే ముందస్తు బుకింగ్‌లకు కంపెనీ ప్రత్యేక ధరను అందించనుంది. అంటే, అల్ట్రావయోలెట్ తన మొదటి అంతర్జాతీయ కస్టమర్లకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. తక్కువ ధరలో వీటిని సొంతం చేసుకోవచ్చు.
అత్యాధునిక ఫీచర్లతో రూపొందించబడిన మోడళ్లు, క్లాసిక్ స్పోర్ట్స్ బైక్ లుక్‌ను కలిగి ఉండడంతో పాటు, డ్రైవింగ్ అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్తాయి. పారిస్‌లో ఈ లాంచ్‌తో పాటు, అల్ట్రావయోలెట్ తన గ్లోబల్ ఎలక్ట్రిక్ రైడింగ్ దిశగా మరింత బలోపేతం అవుతోంది. భారత మార్కెట్ నుంచి అంతర్జాతీయ వేదికల దాకా ఈ బ్రాండ్ ప్రస్థానం ఆసక్తికరంగా మారుతోంది. లాంచ్‌లో భాగంగా సాధారణతో పోలిస్తే తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి అవకాశం ఇస్తుంది.

ప్రత్యేక ఆఫర్ కింద F77 MACH 2 మోడల్‌ను కేవలం € 8990 ప్రారంభ ధరకు పొందవచ్చు(సాధారణ ధర € 9990). F77 సూపర్‌స్ట్రీట్ మోడల్ ప్రత్యేక ప్రారంభ ధర € 9290గా నిర్ణయించారు(సాధారణ ధర € 10390). అల్ట్రావయోలెట్ 2025 జులై 31 వరకు చేసే అన్ని ముందస్తు బుకింగ్‌లపై తన రెండు మోటార్‌సైకిళ్లను ప్రత్యేక ధరకు అందించనున్నట్లు ప్రకటించింది. కస్టమర్లకు ఇది ఒక అరుదైన అవకాశం.
అత్యాధునిక డిజైన్, శక్తివంతమైన పనితీరు, సురక్షిత రైడింగ్ అనుభవంతో అల్ట్రావయోలెట్ F77 బైకులు ఆకట్టుకుంటున్నాయి. కేవలం 2.8 సెకన్లలో 0 నుంచి 60 కి.మీ./గం. వేగానికి చేరే సామర్థ్యం కలిగిన ఈ బైక్స్ పారిస్‌లో సత్తా చాటనున్నాయి. దీనిలో 10.3 kWh బ్యాటరీ ప్యాక్ అమర్చబడింది. దీని ద్వారా 30 kW శక్తి ఉత్పత్తి చేస్తూ, 100 Nm టార్క్ విడుదల అవుతుంది. టాప్ స్పీడ్ వచ్చేసి 155 కి.మీ./గం.
ఇక టెక్నాలజీ విషయానికి వస్తే, బెంగళూరుకు చెందిన బాష్ టెక్నాలజీస్ అభివృద్ధి చేసిన వైలెట్ AI టెక్నాలజీ ఈ బైక్స్‌లో ఉంది. ఇది రైడింగ్ స్టైల్‌ను అర్థం చేసుకుని, అనుగుణంగా రైడింగ్‌ను మరింత మెరుగుపరుస్తుంది. అలాగే, స్విచ్చబుల్ డ్యూయల్-ఛానల్ ABS, 10-దశల పునరుత్పత్తి బ్రేకింగ్, 4-స్టేజ్ ట్రాక్షన్ కంట్రోల్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి సాంకేతికతలతో, ఇది నేటి రైడర్‌కు అవసరమైన సేఫ్టీ, ఇంటెలిజెన్స్‌ను కలిపిన బైక్‌గా నిలుస్తుంది.
అల్ట్రావయోలెట్ CEO, సహ వ్యవస్థాపకుడు నారాయణ్ సుబ్రమణ్యం పారిస్ లాంచ్ సందర్భంగా మాట్లాడుతూ, ఒక భారతీయ కంపెనీగా, భవిష్యత్ రూపకల్పనను, అత్యాధునిక సాంకేతికతను ప్రపంచానికి పరిచయం చేయడం మాకు గర్వకారణం. ఇది కేవలం మోటార్‌సైకిళ్లు విక్రయించడమే కాదు, భారత్‌లోని ఇంజనీరింగ్, డిజైన్, తయారీ శక్తి, ప్రతిభకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించిన ముఖ్యమైన క్షణం అని పేర్కొన్నారు.
అలాగే, ఈ ఘట్టం భారతదేశానికి ఓ మైలురాయిగా నిలవబోతుంది. ఇది ప్రపంచ EV పరివర్తనలో భాగస్వామ్యం అవ్వడాన్ని సూచించడమే కాదు, అత్యున్నత సాంకేతిక స్థాయిలో పోటీ పడగలగే మేధస్సును భారత్ కలిగి ఉందని కూడా స్పష్టంగా చూపిస్తోంది.ఈ ప్రకటనతో, ఒక భారత కంపెనీ తన స్వదేశ టెక్నాలజీని ప్రపంచానికి పరిచయం చేస్తూ, ఆటోమొటివ్ రంగంలో కొత్త శకం ఆరంభించినట్లు స్పష్టమవుతోందని తెలిపారు.


Click it and Unblock the Notifications








