అల్ట్రావయోలెట్ టెస్రాక్ట్‌ను ఢీ కొట్టగల ఇ-స్కూటర్ ఏది? పోటీ పడుతున్న టాప్ మోడళ్లు ఇవే.. ఫుల్ కంపారిజన్!
గత కొంత కాలంగా భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. ఈవీ తయారీదారులు పోటా పోటాగా కొత్త టూవీలర్స్‌ను విడుదల చేస్తూ, దేశాన్ని ఈవీలకు ప్రధాన గమ్యస్థానంగా మారుస్తున్నారు. పెద్ద కంపెనీల నుంచి మొదలుకుని ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి అడుగుపెట్టిన కంపెనీలు సైతం ఎలక్ట్రిక్ బైక్స్, స్కూటర్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా బెంగళూరుకు చెందిన EV స్టార్టప్ అల్ట్రావయోలెట్(Ultraviolette) గత వారం భారతదేశంలో రెండు కొత్త ఈవీలను విడుదల చేసింది. ఇప్పటి వరకు లక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్‌లను మాత్రమే విడుదల చేసిన ఈ కంపెనీ తాజాగా ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో కూడా పట్టు సాధించడానికి టెస్రాక్ట్ (Tesseract)ను లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ మోడల్ మార్కెట్లో పెద్ద సంచలనం అయింది. దీని ఆకట్టుకునే రూపంతో భారీ ఆదరణ సంపాదిస్తుంది.
లాంచ్ ఆఫర్‌లో భాగంగా మొదటి 1000 మంది కస్టమర్లకు రూ.1.20 లక్షలకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అందిస్తామని కంపెనీ ప్రకటించింది. దీంతో ఇది కేవలం 48 గంటల్లోనే 20,000 బుకింగ్స్ అందుకుంది. భారతీయ ప్రజల నుంచి వస్తురన్న డమాండ్‌ను గమనించి అల్ట్రావయోలెట్ మొదటి 50,000 మంది కస్టమర్లకు లాంచ్ ఆఫర్ ధరకే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అందిస్తామని పేర్కొంది. కొత్తగా ఇ-స్కూటర్ కొనాలనిచూస్తున్న వారికి ఇది మంచి ఆప్షన్ అవుతుంది.

అయితే మార్కెట్లో చాలా ఇస్కూటర్స్ కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త మోడల్ రాకతో పోటీ మరింత ఎక్కువ అయింది. దీంతో ఏ మోడల్‌ను కొనుగోలు చేయాలో తెలియక కొంతమంది ఆలోచనలో పడతారు. అందుకే అల్ట్రావయోలెట్ టెస్రాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో మార్కెట్లో పోటీ పడుతున్న కొన్ని మోడళ్ల మధ్య పోలికల గురించి ఇవ్వడం జరిగింది. ఒకసారి ఈ మోడళ్ల గురించి తెలుసుకోండి.
ముందుగా టెస్రాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, ఇది 3.5kWh, 5kWh, 6kWh బ్యాటరీ ప్యాక్‌లో లభిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేసినట్లయితే ఏకంగా 261 కి.మీల దూరం వరకు ప్రయాణిస్తుంది. దీనిలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 20.1 BHP పవర్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.45 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది కేవలం 2.9 సెకన్లలోనే సున్నా నుండి 60 కి.మీ/గం వేగాన్ని అందుకుంటుంది.

Ather 450 Apex: ఏథర్ కంపెనీకి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ 450 అపెక్స్ సింగిల్ ఛార్జ్‌తో 157 కి.మీల దూరం వరకు ప్రయాణిస్తుంది. ఇది 3.7kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. టాప్ స్పీడ్ వచ్చేసి గంటకు 100 కి.మీలు. ఇది కేవలం 2.9 సెకన్లలోనే సున్నా నుండి 40 కి.మీ/గం వేగాన్ని అందుకుంటుంది. దీని ధర ప్రస్తుతం రూ.1.99 లక్షలు (ఎక్స్-షోరూమ్).
OLA S1 Pro+: ఓలా S1 ప్రో+ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర రూ.1.43 లక్షల నుండి రూ.1.70 లక్షల వరకు ఉంటుంది. ఇది ఎక్స్ షోరూమ్. ఇది 4kWh, 5.3kWh బ్యాటరీ ప్యాక్‌లో అందుబాటులో ఉంది. ఒక్కసారి బ్యాటరీని ఛార్జ్ చేస్తే, 242 నుంచి 320 కిమీల వరకు రేంజ్ అందిస్తుంది. టాప్ స్పీడ్ గంటకు 141 కిలోమీటర్లు. కేవలం 2.1 సెకన్లలోనే 0-40 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.

Hero Vida V2 Pro: దేశీయ ప్రముఖ కంపెనీ హీరో మోటోకార్ప్‌కు చెందిన హీరో విడా V2 ప్రో కూడా మార్కెట్లో మంచి ఆదరణ ఉన్న మోడల్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కంపెనీ 3.9kWh బ్యాటరీని అమర్చింది. దీన్ని పూర్తిగా ఛార్జ్ చేసినట్లయితే 165 కి.మీల రేంజ్ అందిస్తుంది. విడా V2 ప్రో ధర రూ.1.15 లక్షల ఎక్స్-షోరూమ్ .


Click it and Unblock the Notifications








