రెండు వారాల్లో రికార్డ్ బుకింగ్స్.. ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం దేశంలో ఎగబడుతున్న జనాలు.. ఏముంది అంత స్పెషల్?
ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ అల్ట్రావయోలెట్ (ultraviolette) వరుసగా కొత్త లాంచ్‌లతో దూసుకుపోతుంది. గత ఏడాది కంటే ఈ సారి మరిన్ని కొత్త మోడళ్లను విడుదల చేయడానికి ప్రణాళికలు కూడా వేసింది. ఇదిలా ఉంటే కంపెనీ తాజాగా కొత్త సంచలనం సృష్టించింది. ఇటీవల మార్కెట్లోకి తీసుకొచ్చిన టెస్రాక్ట్(tesseract) ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరించిన రెండు వారాల్లోనే 50,000 ప్రీ-బుకింగ్స్ నమోదు చేసుకుని రికార్డు సృష్టించింది. అత్యాధునిక సాంకేతికత, ఆవిష్కరణ, సూపర్ స్టైలిష్ డిజైన్‌తో ఈ స్కూటర్ కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీనికి పెరుగుతున్న చూస్తుంటే EV మార్కెట్‌లో కొత్త ట్రెండ్ సెట్ చేయబోతోందని స్పష్టంగా తెలుస్తోంది. అల్ట్రావయోలెట్ కంపెనీ సైతం కస్టమర్ల నుండి వస్తున్న అద్భుతమైన స్పందన పట్ల సంతోషం వ్యక్తం చేస్తుంది. ఈ కొత్త తరం ఎలక్ట్రిక్ స్కూటర్ భవిష్యత్తుకు సరైన దిశగా మమ్మల్ని తీసుకెళ్తోందని కంపెనీ స్పష్టం చేసింది.
ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించబడిన కేవలం రెండు వారాల్లోనే ఈ మైలు రాయిని చేరడం అంటే మార్కెట్లో స్కూటర్‌కు ఏవిధంగా డిమాండ్ ఉందో తెలిసిపోతుంది. సూపర్ స్టైలిష్ డిజైన్, శక్తివంతమైన మోటార్, వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీతో టెస్రాక్ట్ EV స్కూటర్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ సెట్ చేస్తుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే IDC పరిధిలో 261 కి.మీల దూరం వరకు ప్రయాణిస్తుంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ కూడా కలిగి ఉంది.

కేవలం దీన్ని ఒక గంట పాటు ఛార్జ్ చేసినట్లయితే 80 శాతం వరకు బ్యాటరీ ఫుల్ అవుతుంది. అల్ట్రావయోలెట్ టెస్రాక్ట్ ప్రధానంగా 5kWh, 5kWh, 6kWh బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. 20bhp (14.7 kW) గరిష్ట విద్యుత్ ఉత్పత్తిని విడుదల చేయగల ఎలక్ట్రిక్ మోటార్‌ను కలిగి ఉంటుంది. ఈ టెస్రాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ముందస్తు బుకింగ్‌లు కంపెనీ వెబ్‌సైట్‌లో తెరిచి ఉన్నాయి. కస్టమర్లు దీనికోసం రూ.999 ముందుగా చెల్లించాలి.
ఆవిష్కరించిన రెండు వారాల్లోనే ఈ రేంజ్‌లో బుకింగ్స్ సాధించిచ స్కూటర్ రాబోయే రోజుల్లో ఇంకెన్ని నమోదు చేస్తుందో. ఇది ఎలక్ట్రిక్ టూవీలర్‌లో కొత్త శకానికి నాంది మాత్రమేనని కంపెనీ పేర్కొంది. అల్ట్రావయోలెట్ CEO,సహ వ్యవస్థాపకుడు నారాయణ్ సుబ్రమణ్యం ఈ బుకింగ్స్‌పై మాట్లాడుతూ, టెస్సెరాక్ట్‌కు చాలా అద్భుతంగా స్పందన వచ్చింది. టెస్రాక్ట్ వలం ఎలక్ట్రిక్ స్కూటర్ మాత్రమే కాదు, ఇది ఒక కొత్త విప్లవం.

దేశం నలుమూలల నుంచి ఇంత ఉత్సాహం, మద్దతును చూడటం మాకు గర్వకారణంగా ఉంది. కస్టమర్ల ఇష్టానికి అనుగుణంగా అత్యాధునిక సాంకేతికత, డిజైన్, పనితీరుతో మరిన్ని మోడళ్లను తీసుకురావడానికి ఇది ఉత్సాహాన్ని ఇచ్చిందని ఆయన అన్నారు. టెస్రాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ ఆఫర్‌లో భాగంగా మొదటి 1000 మంది కస్టమర్లకు రూ.1.20 లక్షలకు అందిస్తామని కంపెనీ ప్రకటించిన తరువాత కేవలం 48 గంటల్లో 20,000 బుకింగ్స్ అందుకుంది.
తరువాత జల నుంచి వస్తురన్న డమాండ్‌ను గమనించి అల్ట్రావయోలెట్ మొదటి 50,000 మంది కస్టమర్లకు లాంచ్ ఆఫర్ ధరకే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అందిస్తామని పేర్కొంది. దాంతో స్కూటర్ కోసం కస్టమర్లు భారీగా ఎగబడ్డారు. ఆఫర్ కాకుండా . ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.45 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది కేవలం 2.9 సెకన్లలోనే సున్నా నుండి 60 కి.మీ/గం వేగాన్ని అందుకుంటుంది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డజన్ల కొద్ది ఫీచర్స్‌ను కలిగి ఉంది. ఓవర్‌టేకింగ్ అసిస్ట్, ఇంటిగ్రేటెడ్ రాడార్, ఓమ్నిసెన్స్ మిర్రర్‌లు, ఇతర వాహనాలు ఢికొట్టినప్పుడు అలర్ట్‌లు, బ్లైండ్‌స్పాట్ డిటెక్షన్, లేన్ చేంజ్ వంటి అత్యాధునికి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఇది 7-అంగుళాల టచ్‌స్క్రీన్ TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్ వంటి పలు ఆప్షన్స్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








