ఇంటర్నేషనల్ రోడ్లపై ఇండియన్ పవర్.. ప్రపంచ మార్కెట్లను లక్ష్యంగా చేసుకున్న అల్ట్రావయోలెట్

కర్ణాటకకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ వాహన తయారీ సంస్థ అల్ట్రావయోలెట్ (ultraviolette) అంతర్జాతీయ విస్తరణ దిశగా కీలకమైన అడుగు వేసింది. ప్రీమియం బైకులకు మంచి మార్కెట్‌ గల యూరోపియన్ దేశాలలో తన ఉనికిని బలోపేతం చేసేందుకు, ఈ సంస్థ తాజాగా మోటోమోండోతో వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రకటించింది. మోటోమోండో అనేది యూరప్‌ అంతటా ప్రీమియం బైకులను పంపిణీ చేయడంలో బాగా అనుభవం కలిగిన సంస్థ. స్థానిక మార్కెట్లపై లోతైన అవగాహనతో పాటు, వినియోగదారుల అభిరుచులను అంచనా వేసి దానికి అనుగుణంగా మార్కెట్‌ను పెంచుతుంది. అలాంటి సంస్థతో భాగస్వామ్యం ద్వారా, అల్ట్రావయోలెట్ తన గ్లోబల్ వ్యాపారానికి మరింత బలం చేకూర్చుతోంది.

ఈ ఒప్పందం ప్రకారం, మోటోమోండో ఇకపై యునైటెడ్ కింగ్‌డమ్, బెల్జియం, నెదర్లాండ్స్, లక్సెంబర్గ్‌లను కలిగి ఉన్న బెనెలక్స్ ప్రాంతానికి అల్ట్రావయోలెట్ టూవీలర్స్‌ను అధికారిక దిగుమతిదారుగా, పంపిణీదారుగా వ్యవహరించనుంది. ఈ భాగస్వామ్యం ద్వారా, భారతదేశంలో అభివృద్ధి చేసిన అద్భుతమైన టెక్నాలజీతో కూడిన వాహనాలను ప్రపంచంలోని మరింత వినియోగదారులకు అందుబాటులోకి తేవాలని అల్ట్రావయోలెట్ లక్ష్యంగా పెట్టుకుంది. అల్ట్రావయోలెట్ కూడా అంతర్జాతీయ వ్యాపార విస్తరణలో కీలక మైలురాయిగా నిలుస్తోంది.

Ultraviolette To Enter In Uk

ఈ డీల్ ద్వారా అల్ట్రావయోలెట్ తన శక్తివంతమైన ఎలక్ట్రిక్ బైక్ F77 MACH 2 RECON ను యూరోపియన్ వినియోగదారులకు పరిచయం చేసే తొలి భారతీయ సంస్థగా గుర్తింపు పొందనుంది. ఇది అల్ట్రావయోలెట్‌ను గ్లోబల్‌గా కూడా అగ్రగామిగా నిలబెట్టడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. అలాగే భారతదేశపు ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే అవకాశంగా నిలుస్తుంది.

మోటోమొండో మేనేజింగ్ డైరెక్టర్ జాన్ య్కెమా ఈ సందర్భంగా మాట్లాడుతూ,యునైటెడ్ కింగ్‌డమ్, బెనెలక్స్ ప్రాంతాలకు అల్ట్రావయోలెట్ టూవీలర్స్‌ను పరిచయం చేయడం కోసం మేము మోటోమోండోతో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల గర్వంగా ఉన్నామని అన్నారు. ఇది అల్ట్రావయోలెట్‌కు అంతర్జాతీయంగా విస్తరించే క్రమంలో ఒక కీలక దశ. ప్రపంచంలో బాగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లలోకి ప్రవేశించడం ద్వారా, సంస్థ ఒక గొప్ప ముందడుగు వేసిందని తెలిపారు.

మేము మార్కెట్‌పై కలిగిన లోతైన అవగాహన, ఆవిష్కరణ పట్ల ఉన్న నిబద్ధతకు ఈ ఒప్పందం ఒక గుర్తింపు అని జాన్ య్కెమా అన్నారు. ఉత్పత్తి అనుభవం మొదలుకుని అమ్మకాల అనంతర సేవల వరకు, వినియోగదారుడికి ప్రతి దశలో ప్రీమియం అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ ప్రయాణం మొదలైంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ముందున్న ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని సంస్థ తెలిపింది.

అంతర్జాతీయంగా అత్యుత్తమంగా గుర్తింపు పొందిన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్లలో ఒకటిగా నిలుస్తున్న అల్ట్రావయోలెట్‌ను యునైటెడ్ కింగ్‌డమ్, బెనెలక్స్ ప్రాంతాలకు తీసుకెళ్లడం మాకు ఎంతో గర్వకారణం అని మోటోమోండో ప్రతినిధి జాన్ అన్నారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే అయినా, భవిష్యత్తులో ఇది ఇంధనంతో నడిచే వాహనాలకు ప్రత్యామ్నాయంగా మారి, మోటార్‌సైకిల్ మార్కెట్‌‌లో తిరుగులేని శక్తిగా అవతరించగలదని ఆయన స్పష్టం చేశారు.

అల్ట్రావయోలెట్ తన కొత్త మోడల్ F77 MACH 2 RECON కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ మోడల్‌ను జూన్ 30, 2025కి ముందు బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు, ప్రారంభ ఆన్-రోడ్ ధరను కేవలం £8,499 (సుమారు రూ.9.5 లక్షలు)గా నిర్ణయించారు. అయితే, ఈ తేదీ తర్వాత బుకింగ్ చేసే వినియోగదారులకు F77 MACH 2 RECON మోటార్‌సైకిల్ ధర £9,399 (సుమారుగా రూ.10.6 లక్షలు)గా ఉండనుంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, April 17, 2025, 7:30 [IST]
English summary
Ultraviolette to enter in united kingdom and benelux region more details check here
Read more on: #ultraviolette
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+