దుల్కర్ సల్మాన్ కంపెనీ బైక్ కోసం ఒక్కరోజులో 3000 మంది ఎగబడ్డారు.. దానిలో అంత స్పెషల్ ఏముంది?
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) యాజమాన్యంలోని అల్ట్రావయోలెట్ (Ultraviolette) ఆటోమోటివ్ భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటోంది. ఇప్పటికే ప్రీమియం సెగ్మెంట్‌లో విభిన్నమైన డిజైన్లు, అధునాతన సాంకేతికతతో EV బైకులు అందిస్తున్న ఈ కంపెనీ, ఇప్పుడు మరింత విస్తృతమైన వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది. అదే దిశగా తాజాగా X-47 క్రాస్‌ఓవర్ (X-47 Crossover)ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. డిజైన్ పరంగా, టెక్నాలజీ పరంగా X-47 క్రాస్‌ఓవర్ ప్రత్యేకంగా నిలుస్తోంది. స్పోర్టీ లుక్‌తో పాటు క్రాస్‌ఓవర్‌కి తగిన స్టాన్స్ ఇవ్వడం వలన, ఇది యువతను ఆకర్షించేలా ఉంది. పైగా, అధిక పనితీరును అందించగల బ్యాటరీ టెక్నాలజీ, రైడర్‌కి సౌకర్యవంతమైన ఫీచర్లు ఇందులో ఉండటం వలన ఇది EV అభిమానుల దృష్టిని వెంటనే ఆకర్షించింది.
తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, ఈ బైక్‌కి మార్కెట్లో ఊహించని రీతిలో స్పందన లభించింది. విడుదలైన మొదటి 24 గంటల్లోనే 3,000కి పైగా బుకింగ్‌లు నమోదు కావడం పెద్ద మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఒక ఎలక్ట్రిక్ టూవీలర్ వాహనం ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద సంఖ్యలో బుకింగ్‌లు సాధించడం అరుదైన విషయం. ఇది కేవలం ఒక మోడల్ విజయమే కాకుండా, భారత మార్కెట్లో EVల పెరుగుతున్న డిమాండ్‌కు స్పష్టమైన నిదర్శనం.

ఈ బుకింగ్ ఫిగర్స్ చూస్తే, వినియోగదారులు కేవలం పర్యావరణహితం అనే కారణం వల్ల మాత్రమే కాకుండా, పనితీరు, స్టైల్, కొత్తదనం కలిసిన వాహనాలపై మరింత ఆసక్తి చూపుతున్నారని అర్థం అవుతుంది. X-47 క్రాస్‌ఓవర్‌కి వచ్చిన స్పందనతో, అల్ట్రావయోలెట్ తన వ్యూహాన్ని ఎంత సరిగ్గా అమలు చేస్తోందో తెలుస్తోంది. మొత్తం చూస్తే, X-47 క్రాస్‌ఓవర్ EV మార్కెట్లో ఒక గేమ్‌చేంజర్‌గా నిలిచే అవకాశం ఉంది.
అల్ట్రావయోలెట్ X-47 క్రాస్‌ఓవర్ ఎలక్ట్రిక్ బైక్ ధర వినియోగదారులను బాగా ఆకర్షిస్తోంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ.2.49 లక్షలుగా నిర్ణయించారు. మొదట్లో ఈ ప్రత్యేక ధరను కేవలం తొలి 1,000 మంది కొనుగోలు దారులకు మాత్రమే అందిస్తామని ప్రకటించారు. అయితే, మార్కెట్లోనుంచి వచ్చిన అద్భుతమైన స్పందనను దృష్టిలో పెట్టుకుని, కంపెనీ ఈ ఆఫర్‌ను విస్తరించింది.

ఇప్పుడు మొదటి 5,000 మంది కస్టమర్లకు రూ.2.49 లక్షల(ఎక్స్‌షోరూమ్)కే X-47ను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది. దీని వలన మరింత మంది వినియోగదారులు తక్కువ ధరకు ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను సొంతం చేసుకునే వీలు కలిగింది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, X-47 క్రాస్‌ఓవర్ తన సెగ్మెంట్‌లో నిజంగా ప్రత్యేకంగా నిలుస్తోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ బైక్ 323 కి.మీ(IDC) వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ హామీ ఇస్తోంది.
ఈ బైక్ 10.3 kWh బ్యాటరీ ప్యాక్‌తో రన్ అవుతుంది. ఎలక్ట్రిక్ బైక్ 40 bhp శక్తిని, 100 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. వేగం పరంగా కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కేవలం 2.7 సెకన్లలో 0-60 కి.మీ/గం వేగాన్ని చేరుకోగలదు. అంతే కాకుండా, 0-100 కి.మీ/గం వేగాన్ని కేవలం 8.1 సెకన్లలో సాధిస్తుంది. గరిష్ట వేగం విషయానికి వస్తే, ఇది 145 కి.మీ/గం వద్ద పరిమితం చేయబడింది.

అల్ట్రావయోలెట్ X-47 క్రాస్‌ఓవర్ రాడార్ టెక్నాలజీని ప్రామాణికంగా పొందిన మొట్టమొదటి భారతీయ బైకుగా గుర్తింపు పొందింది. ఇప్పటివరకు రాడార్ ఆధారిత సిస్టమ్స్ ప్రధానంగా ప్రీమియం కార్లలో మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు ద్విచక్ర వాహన విభాగంలో కూడా ఈ సాంకేతికతను ప్రవేశపెట్టడం అల్ట్రావయోలెట్ దూకుడు వ్యూహానికి నిదర్శనం. ఈ రాడార్ సిస్టమ్‌లో బ్లైండ్‌స్పాట్ డిటెక్షన్, లేన్-చేంజ్ అలర్ట్, మరియు రియర్ కొలిషన్ డిటెక్షన్ వంటి అత్యాధునిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








