తక్కువ ధరకే అదిరిపోయే మైలేజ్.. హీరో షోరూమ్‌లలో ఎప్పుడు చూసినా పండుగ వాతావరణమే
కొత్త బైకు కొనాలని ఆలోచిస్తున్నారా? తక్కువ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే బైకు కోసం చూస్తున్నారా? అలాంటి వారికో గుడ్ న్యూస్. భారత మార్కెట్లో అత్యధిక ఎంట్రీ-లెవల్ కమ్యూటర్ బైకులను విక్రయించే కంపెనీలలో హీరో మోటోకార్ప్ అగ్రస్థానంలో ఉంది. ఈ కంపెనీ నుంచి వస్తున్న హీరో ప్యాషన్ ప్లస్ బైకు ప్రస్తుతం మార్కెట్లో దూసుకుపోతోంది.
తక్కువ ధరకే లభిస్తున్న ఈ బైకు 75 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుండటంతో, షోరూమ్‌ల నిండా కస్టమర్ల సందడి కనిపిస్తోంది. మరి, ఈ బైకు ప్రత్యేకతలు ఏంటి? దీని ధర ఎంత? పూర్తి వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.

హీరో మోటోకార్ప్ ఇండియాలో ఎక్కువ కమ్యూటర్ సెగ్మెంట్ బైకులను అమ్మే కంపెనీల్లో నంబర్ వన్. వారి కమ్యూటర్ బైకుల లిస్టులో హీరో ప్యాషన్ ప్లస్ చాలా ముఖ్యమైనది. ఈ బైకు 2025 జూన్ నెలలో సేల్స్‌లో అదిరిపోయే గ్రోత్ చూపించింది.
గతేడాది 2024 జూన్‌లో కేవలం 13,100 హీరో ప్యాషన్ ప్లస్ బైకులు అమ్ముడుపోగా, ఈ ఏడాది 2025 జూన్‌లో ఏకంగా 26,249 బైకులు అమ్ముడయ్యాయి. అంటే, ఇది 100.37 శాతం భారీ వృద్ధిని నమోదు చేసుకుంది. సేల్స్ అమాంతం రెట్టింపయ్యాయన్నమాట. ఈ అద్భుత విజయంతో 2025 జూన్‌లో టాప్ 10 బైకుల లిస్టులో హీరో ప్యాషన్ ప్లస్ 9వ స్థానంలో నిలిచింది.

హీరో మోటోకార్ప్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. ప్రస్తుతం హీరో ప్యాషన్ ప్లస్ బైకు ఒకే ఒక వేరియంట్‌లో దొరుకుతుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 82,451. ఈ ధరకు ఇంత మైలేజ్, ఫీచర్లు ఇవ్వడం నిజంగా మంచి డీల్ అనే చెప్పాలి.
ఈ బైకులో 97.2 సీసీ ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్ ఇంజిన్ ఉంటుంది. ఇది 5.9 kW పవర్‌ను, 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సిటీలో వాడకానికి, రోజువారీ ప్రయాణాలకు ఈ ఇంజిన్ పర్ఫెక్ట్‌గా సరిపోతుంది.

హీరో ప్యాషన్ ప్లస్ బైకుకి మెయిన్ హైలైట్ దాని అద్భుతమైన మైలేజ్. ఈ బైకు వాడే చాలామంది కస్టమర్లు లీటరుకు 60 నుంచి 75 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని చెబుతున్నారు. అయితే, మైలేజ్ అనేది బైకు నడిపే విధానం, రోడ్డు పరిస్థితులు, మెయింటెనెన్స్ బట్టి మారొచ్చు అనేది ఇక్కడ గుర్తుంచుకోవాలి.
ఇంత మంచి మైలేజ్ రావడానికి ముఖ్య కారణం ఐ3ఎస్ టెక్నాలజీ. i3S అంటే Idle Stop-Start System. ఈ టెక్నాలజీ వల్ల బైకు ఐడిలింగ్‌లో (ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు) ఉన్నప్పుడు ఇంజిన్ ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. తర్వాత, మీరు క్లచ్ నొక్కగానే ఇంజిన్ మళ్లీ స్టార్ట్ అవుతుంది. దీనివల్ల ఇంధనం వృథా కాకుండా, మైలేజ్ చాలా పెరుగుతుంది.
డ్రైవ్ స్పార్క్ అభిప్రాయం : హీరో ప్యాషన్ ప్లస్ బైకు కేవలం మైలేజ్ మాత్రమే కాదు, ఇంకా కొన్ని మంచి ఫీచర్లను కూడా అందిస్తుంది. ఇందులో సెల్ ఫోన్ ఛార్జింగ్ పోర్ట్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, స్టైలిష్ గ్రాఫిక్స్ వంటివి ఉన్నాయి. ఈ ఫీచర్లు రోజువారీ ప్రయాణాన్ని మరింత సులువుగా, సురక్షితంగా చేస్తాయి.
ఈ బైకులో 11 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. అలాగే, దీని గ్రౌండ్ క్లియరెన్స్ 168ఎంఎం. ఇది భారతీయ రోడ్లకు బాగా సరిపోతుంది. మొత్తంగా చూస్తే, హీరో ప్యాషన్ ప్లస్ బైకు మీరు పెట్టే డబ్బుకు పూర్తి విలువను ఇస్తుంది. మైలేజ్, ఫీచర్లు, నమ్మకత్వం విషయంలో ఇది నిజంగా మంచి ఆప్షన్.


Click it and Unblock the Notifications








