దీపావళికి రూ.1 లక్ష లోపల లభించే బెస్ట్ బైక్‌లు! లీటరు పెట్రోల్‌కు 65 కి.మీల పైనే మైలేజ్
దేశీయ వాహన రంగానికి భారీ ప్రోత్సాహం ఇచ్చేలా గత నెలలో GST పన్ను రేటులో మార్పులు చేశారు. 28 శాతంగా ఉన్న పన్నులను 18 శాతానికి తగ్గించారు. ఇది సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అన్ని వాహనాల ధరలు భారీగా తగ్గాయి. ముఖ్యంగా టూవీలర్స్ ధరలు ఇప్పుడు కాస్త అందుబాటులోకి వచ్చాయి. 350 సిసి కంటే తక్కువ సామర్థ్యం ఉన్న వాహనాలపై ఇప్పుడు 28 శాతానికి బదులుగా 18 శాతం పన్ను విధించబడుతుంది. ధరలు తగ్గడం అనేది వాహన కొనుగోలుదారులకు మంచి లాభం చేకూర్చే అంశం. ఈ దీపావళికి కొత్త టూవీలర్ కొనే వారు గతంలో కంటే తక్కువ ధరలో వాహనాన్ని ఇంటికి తీసుకెళ్లచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ఒక లక్ష కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉన్న కొన్ని టూవీలర్స్‌ను ఒకసారి ఈ కథనంలో చూద్దాం.
భారతీయ బైక్ మార్కెట్‌లో హీరో, హోండా, Tvs వంటి కంపెనీలు ఎప్పటినుంచో ప్రజల విశ్వాసాన్ని సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా రోజువారీ ప్రయాణాల కోసం వీటిలోని కొన్ని మోడళ్లు దేశంలో ప్రజాదరణ పొందినవి. వాటిలో ప్రధానంగా హీరో స్ప్లెండర్ ప్లస్, హీరో HF డీలక్స్, హోండా షైన్, టీవీఎస్ రేడియన్ అనే బైకులు ముందుంటాయి. ఈ బైకులు పనితీరు, మైలేజ్, భద్రత, తక్కువ నిర్వహణ ఖర్చుతో విస్తృత ప్రజాదరణ పొందుతున్నాయి.

హీరో స్ప్లెండర్ ప్లస్ భారతదేశపు బైక్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా ఎక్కువగా అమ్ముడవుతూ, ప్రజల విశ్వాసాన్ని సంపాదించింది. కొత్త అప్‌డేట్‌లతో మార్కెట్లోకి వచ్చిన బైక్ ధర రూ.88,057 నుండి రూ.89,331 వరకు ఉంటుంది. ఇది సాధారణ వినియోగదారుడికి అందుబాటులో ఉండే విశ్వసనీయ ఎంపిక. అద్భుతమైన మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చు, బలమైన నిర్మాణ నాణ్యతతో గ్రామీణం నుండి పట్టణం వరకు ప్రతి చోటా కనిపిస్తుంది.
ఇక హీరో HF డీలక్స్ గురించి చెప్పుకుంటే, ఇది తక్కువ బడ్జెట్‌లో బైక్ కొనాలనుకునే వారికి సరైన ఎంపిక. డైలీ కమ్యూట్ కోసం అత్యంత సౌకర్యవంతమైన బైక్‌గా నిలుస్తుంది. ఈ బైక్ ఆన్-రోడ్ ధర కేవలం రూ.67 వేల వరకు మాత్రమే ఉండటంతో, గ్రామీణ ప్రాంతాల్లో ఇది చాలా ప్రాచుర్యం పొందింది. దీని మైలేజ్, సింపుల్ డిజైన్, సులభమైన రైడింగ్ అనుభవం దీనిని సాధారణ కుటుంబాల ఫేవరేట్ బైక్‌గా నిలబెట్టాయి.

మరొక ప్రముఖ బైక్ హోండా షైన్ 125, 125 సీసీ సెగ్మెంట్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే బైక్. ఇది పవర్, మైలేజ్ రెండింటినీ సమతుల్యంగా అందించే మోడల్‌గా గుర్తింపు పొందింది. రోజువారీ ప్రయాణాలకు ఇది అనువైనదే కాకుండా, హోండా బ్రాండ్‌పై ఉన్న నమ్మకం దీని రీసేల్ విలువను కూడా పెంచుతుంది. రూ.94 వేల ధరకు అందుబాటులో ఉన్న ఈ బైక్, స్టైలిష్ లుక్‌తో పాటు సాఫ్ట్ రైడింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుంది.
టీవీఎస్ రేడియన్ (TVS Radeon) బైక్ సాధారణ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడింది. ధర పరంగా కూడా ఈ బైక్ చాలా అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం దీని ప్రారంభ ధర సుమారు రూ.66,000 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇంజిన్ విషయానికి వస్తే, ఇది శక్తివంతమైన, నమ్మదగిన పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇంధన సామర్థ్య పరంగా కూడా ఈ బైక్ మంచి మైలేజ్‌ను అందిస్తుంది.



Click it and Unblock the Notifications








