ఇంకా తగ్గిన ధర.. బజాజ్ నుంచి మరో సంచలనం! పెట్రోల్ స్కూటర్లకు గుడ్‌బై చెప్పించే మోడల్ రోడ్డుపై దొరికింది!
దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతుంది. గతంలో పెట్రోల్ మోడళ్లను ఎక్కువగా కొన్న జనాలు ఇప్పుడు తమ ధోరణిని క్రమంగా మార్చుకుని ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశీయ దిగ్గజ టూవీలర్ తయారీ కంపెనీ బజాజ్ (Bajaj) కూడా ఈ సెగ్మెంట్‌పై ఎక్కువ ఫోకస్ చేసింది. అందుకే గతంలో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇది ప్రస్తుతం భారతదేశంలో హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంది. ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ వంటి తయారీదారులకు పోటీ నిస్తూ ఇది దేశంలో బాగా డిమాండ్ ఉన్న మోడల్‌గా అవతరించింది. అయితే కంపెనీ ఈ విజయపరంపరను కొనసాగించడానికి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఇటీవల ఈ మెడల్‌ను రోడ్డుపై పరీక్షిస్తున్న ఫోటోలు వెలుగులోకి వచ్చాయి.
చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏ విధంగా మంచి ఆదరణ సంపాదించిందో అదే విధంగా రాబోయే కొత్త మోడల్ కూడా సక్సెస్ అవుతుందని బజాజ్ అంచాలను వేస్తుంది. కస్టమర్లను ఆకట్టుకోవడానికి అందుబాటు ధరలోనే దీన్ని లాంచ్ చేసే అవకాశం ఉంది. దీని డిజైన్‌లో కొన్ని అంశాలు చేతక్ నుంచి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఫ్లోర్‌బోర్డ్ స్థలం కొంచె చిన్నదిగా ఉంటుంది. బ్రేకింగ్‌ను చూసినట్లయితే ముందు భాగంలో డిస్క్ ఉంది.

డ్యూయల్ రియర్ షాక్ అబ్జార్బర్స్ ద్వారా రైడింగ్ సునాయసంగా అనిపిస్తుంది. చేతక్ సిరీస్‌లో ఉన్నట్లుగానే గుండ్రటి హెడ్‌లైట్ ఉంటుంది. దీని రెండు చివర్లలో కూడా 12-అంగుళాల వీల్స్ ఉన్నాయి. ఓవల్ మిర్రర్స్, ఫోర్క్ కవర్లు దీనికి మరింత కొత్తగా ఉంటాయి. ఈ స్కూటర్‌లో హబ్-మౌంటెడ్ మోటారు ఉండే ఛాన్స్ ఉందని మార్కెట్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా ఇది రోజువారీ ప్రయాణాలకు అత్యంత అనువుగా ఉంటుంది.
బజాజ్ పేద, మధ్య తరగతి వినియోగదారులను టార్గెట్ చేస్తుంది, ఈ క్రమంలో తన కొత్త స్కూటర్‌ను దేశంలో దాదాపు రూ. 80,000 ఎక్స్‌షోరూమ్ ప్రారంభ ధరతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంచుతుందని సమాచారం. తక్కువ ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వారిని ఇది ఆకట్టుకోనుంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసి గంటకు 50 కి.మీలుగా ఉంటుంది. డిజైన్ పరంగా ప్రీమియం లుక్‌ను కలిగి ఉంటుంది.

దీని వెనుక భాగంలో చేతక్ లైనప్‌లో కనిపించే డ్యూయల్ టెయిల్ లైట్‌కు బదులుగా సింగిల్-పాడ్ టెయిల్ లైట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తుంది. ఇంటి అవసరాల కోసం చిన్న వస్తువులను తీసుకెళ్ళడానికి ఫ్రంట్ ఆప్రాన్ హుక్ కూడా దీనికి అందించారు. దీనిలో తక్కువ కెపాసిటీ కలిగిన బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించనున్నారు. అయితే రేంజ్ కూడా గత మోడళ్లతో పోలిస్తే మరింత తక్కువగా ఉండబోతుంది.
ఇప్పటికే అందుబాటులో ఉన్న చేతక్ బేస్ వేరియంట్ (2903) 2.9 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. పూర్తి ఛార్జ్‌తో 123 కిమీల దూరం ప్రయాణిస్తుంది. టాప్ వేరియంట్లు 3501 అలాగే, 3.5 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉన్నాయి. వీటి రేంజ్‌ను చూసినట్లయితే సింగిల్ ఛార్జ్‌తో 153 కి.మీల దూరం వెళ్తుంది. రాబోయే మోడల్‌లో బ్యాటరీ కెపాసిటీ తక్కువ కాబట్టి వీటి కంటే తక్కువ రేంజ్ అందించనుంది.

ప్రస్తుతం టెస్టింగ్‌లో కనిపించిన బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం భారతీయ వాహన మార్కెట్ ఎదురుచూస్తుంది. చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ద్వారా ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ వంటి కంపెనీలను అధిగమించి మెరుగైన సేల్స్ సాధించిన బజాజ్ తన రాబోయే మోడల్ ద్వారా దేశంలో ఈవీ టూవీర్ మార్కెట్‌లో మెజార్టీ వాటాను దక్కించుకోవాలని చూస్తుంది.


Click it and Unblock the Notifications








