వరలక్ష్మి వ్రతం పండుగకు కొత్త స్కూటర్ కొంటున్నారా? లక్ష లోపు బెస్ట్ ఆప్షన్స్ ఇవే!

ఈ ఏడాది వరలక్ష్మి వ్రతం పండుగ ఆగస్టు 8న వస్తోంది. పండుగకు బంగారం కాకుండా, రోజూ వాడటానికి కొత్త స్కూటర్ కొందామని ఆలోచిస్తున్నారా? అయితే లక్ష రూపాయలలోపు (ఎక్స్-షోరూం ధర) దొరికే కొన్ని బెస్ట్ స్కూటర్ల వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం. హోండా యాక్టివా 125, సుజుకి యాక్సెస్ 125, టీవీఎస్ జూపిటర్ 125, హీరో డెస్టిని 125, హోండా క్యూసి1 స్కూటర్లు బెస్ట్ ఛాయిస్ కావచ్చు. వీటి ధరలు, ప్రత్యేకతలు ఏంటో చూద్దాం.

1. హోండా యాక్టివా 125 : హోండా యాక్టివా అంటేనే నమ్మకానికి, నాణ్యతకు మారు పేరు. వరలక్ష్మి వ్రతానికి ఈ స్కూటర్‌ను తీసుకోవడం మంచి ఆప్షన్. దీని ధర రూ.94,000 నుండి రూ.97,000 (ఎక్స్-షోరూం) వరకు ఉంటుంది. ఇది చాలా చక్కని డిజైన్‌తో వస్తుంది. మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, పెర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, పెర్ల్ ప్రెషియస్ వైట్, పెర్ల్ సైరన్ బ్లూ వంటి రంగుల్లో లభిస్తుంది.

Honda Activa

ఈ స్కూటర్‌లో 123.92 సీసీ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది దాదాపు 47 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది. టీఎఫ్‌టీ కన్సోల్, ఛార్జింగ్ పోర్ట్, ఐడిల్ స్టార్ట్/స్టాప్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని బరువు 109 కేజీలు. 5.3 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. రైడర్ల సేఫ్టీ కోసం డిస్క్/డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి.

2. సుజుకి యాక్సెస్ 125 : సుజుకి యాక్సెస్ 125 కూడా చాలా పాపులర్ స్కూటర్. పండుగకు ఇంటికి తెచ్చుకోవడానికి ఇది కూడా మంచి ఎంపికే. దీని ధర రూ.87,000 నుండి రూ.98,000 (ఎక్స్-షోరూం) వరకు ఉంటుంది. ఇది ఆకర్షణీయమైన డిజైన్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. పెర్ల్ షైని బీజ్, మెటాలిక్ మ్యాట్ స్టెల్లార్ బ్లూ, పెర్ల్ గ్రేస్ వైట్, మరియు మెటాలిక్ మ్యాట్ బ్లాక్ వంటి రంగుల్లో లభిస్తుంది.

Suzuki Access

కొత్త యాక్సెస్ స్కూటర్ 125 సీసీ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది, ఇది దాదాపు 45 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి చాలా ఫీచర్లు ఉన్నాయి. దీని బరువు 106 కేజీలు. 5 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. డిస్క్/డ్రమ్ బ్రేక్‌లు భద్రతను అందిస్తాయి.

3. టీవీఎస్ జూపిటర్ 125 : టీవీఎస్ జూపిటర్ 125 స్కూటర్ ధర రూ.81,000 నుండి రూ.92,000 (ఎక్స్-షోరూం) వరకు ఉంటుంది. వరలక్ష్మి వ్రతానికి ఇది కూడా మంచి ఛాయిస్. ఇది చాలా ఆధునిక డిజైన్‌తో వస్తుంది. 124 సీసీ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది, ఇది దాదాపు 57 కి.మీ వరకు అద్భుతమైన మైలేజ్ ఇస్తుంది. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. డిస్క్/డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి.

TVS Jupitor

4. హీరో డెస్టిని 125 : హీరో డెస్టిని 125 ఒక నమ్మదగిన స్కూటర్, ఇది బడ్జెట్ ధరలోనే దొరుకుతుంది. పండుగకు దీన్ని కూడా కొనుగోలు చేయొచ్చు. దీని ధర రూ.99,000 నుండి రూ.1.13 లక్షలు (ఎక్స్-షోరూం) వరకు ఉంటుంది. 124 సీసీ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది, ఇది దాదాపు 59 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది. డిజిటల్ డిస్‌ప్లే, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని బరువు 115 కేజీలు. 5.3 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది.

5. హోండా క్యూసి1 : ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి హోండా క్యూసి1 మంచి ఎంపిక. దీని ధర రూ.90,000 (ఎక్స్-షోరూం). వరలక్ష్మి వ్రతానికి దీన్ని కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. ఇది 1.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే దాదాపు 80 కి.మీ వరకు వెళుతుంది. ఎల్‌సీడీ డిస్‌ప్లే, అనలాగ్ కీ వంటి వివిధ ఫీచర్లు ఉన్నాయి.

Honda QC1

ఈ స్కూటర్లు అన్నీ వరలక్ష్మి వ్రతం రోజున కొత్త వాహనం తీసుకోవాలనుకునే వారికి మంచి ఎంపికలు. మీ బడ్జెట్, అవసరాలకు తగ్గట్టుగా వీటిలో ఒకటి ఎంచుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Wednesday, July 30, 2025, 17:02 [IST]
English summary
Varalakshmi festival 2025 planning a new scooter top picks under rs 1 lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+