పెట్రోల్ బంకులకు బైబై చెప్పేయండి.. రూ.45వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. మార్కెట్లోకి ఏకంగా 6 మోడల్స్
పర్యావరణాన్ని కాపాడాలి అని ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆలోచిస్తున్నారు. అందుకే ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ 5) సందర్భంగా భారతదేశంలో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదలయ్యాయి.
వారివో మోటార్స్ అనే ఎలక్ట్రిక్ టూవీలర్ బ్రాండ్, కేవలం రూ.44,999 ప్రారంభ ధరతో ఆరు కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తెచ్చింది. ఈ స్కూటర్లు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండటమే కాకుండా, స్టైలిష్ డిజైన్, మంచి ఫీచర్లతో వస్తున్నాయి. మరి ఆ కొత్త స్కూటర్లు ఏంటి? వాటి ప్రత్యేకతలు ఏంటో చూద్దాం.
నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ 5) సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు దీనిని ఘనంగా జరుపుకుంటున్నాయి. ఈ సందర్భంగా నిన్న భారతదేశంలో 6 ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేశారు.

దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ టూవీలర్ బ్రాండ్‌లలో ఒకటైన 'వారివో మోటార్స్', నోవా, ఎడ్జ్ అనే రెండు సిరీస్‌ల కింద ఆరు సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. తేలికపాటి డిజైన్‌తో స్టైలిష్ లుక్‌లో ప్రవేశపెట్టిన ఈ స్కూటర్లపై మూడేళ్ల వారంటీని ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
కొత్తగా విడుదలైన స్కూటర్లు ఇప్పుడు భారతదేశంలోని అన్ని అధీకృత వారివో డీలర్‌షిప్‌లలో లభిస్తున్నాయి. కొత్త స్కూటర్ల ధరలు కేవలం రూ.44,999 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. ఈ స్కూటర్లు మార్కెట్‌లో అత్యంత బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటిగా నిలుస్తాయి. వారివో ఇప్పటికే సీఆర్‌ఎక్స్ (CRX), జెడ్‌బి (ZB), ఎల్-1 ప్లస్ (L-1 Plus), ఎల్-2 (L-2), నెక్సా డీఎస్ (Nexxa DS) వంటి వివిధ ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణులను విక్రయిస్తోంది.
'నోవా సిరీస్' అనేది ప్రీమియం అనుభవం, లెటెస్ట్ లుక్, లేటెస్ట్ ఫీచర్లను కోరుకునే వారి కోసం తయారు చేయబడింది. 'ఎడ్జ్ సిరీస్' మాత్రం రోజువారీ ఉపయోగం కోసం, తక్కువ ధరలో ప్రయాణాన్ని అందించేలా తయారు చేశారు. ఈ స్కూటర్లు స్మార్ట్ మొబైల్ అప్లికేషన్ కనెక్టివిటీని (ఫోన్‌తో అనుసంధానం) కూడా అందిస్తాయి.

ఎడ్జ్ సిరీస్: ఎడ్జ్ సిరీస్‌లో ఎడ్జ్, ఎడ్జ్+ అనే రెండు స్కూటర్లు లభిస్తాయి. ఎడ్జ్ ధర రూ.44,999 (ఎక్స్-షోరూమ్). దీనికి 195 mm గ్రౌండ్ క్లియరెన్స్, 800 mm సీట్ ఎత్తు ఉంటుంది. ఎడ్జ్+ ధర రూ.49,999 (ఎక్స్-షోరూమ్). దీనికి 175 mm గ్రౌండ్ క్లియరెన్స్, 760 mm సీట్ ఎత్తు ఉంటుంది.స
నోవా సిరీస్: వారివో మోటార్స్ టాప్-ఆఫ్-లైన్ సిరీస్ ఇది. నోవా సిరీస్‌లో నోవా, నోవా-ఎక్స్, నోవా-ఎస్ (Nova-S) అనే మూడు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ మూడు స్కూటర్లు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తాయి. వీటికి కూడా 3 సంవత్సరాల వారంటీని ఇస్తారు. ఎంట్రీ లెవెల్ నోవా ధర రూ.55,999 (ఎక్స్-షోరూమ్), నోవా-ఎక్స్ ధర రూ.59,999 (ఎక్స్-షోరూమ్), నోవా-ఎస్ ధర రూ.64,999 (ఎక్స్-షోరూమ్).
నోవాలో 810 mm సీట్ ఎత్తు, 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. నోవా ఎక్స్‌లో 140 mm గ్రౌండ్ క్లియరెన్స్, 775 mm సీట్ ఎత్తు ఉంది. నోవా ఎస్లో 170 mm గ్రౌండ్ క్లియరెన్స్, 780 mm సీట్ ఎత్తు ఉంది. ఎల్‌ఈడీ లైట్లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ముందు డిస్క్, వెనుక డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి.
కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి భారతదేశం అంతటా 200 కొత్త స్టోర్లను తెరవాలని ప్లాన్ చేసింది. మంచి అమ్మకాల తర్వాత సేవలు, స్పేర్ పార్టు విక్రయాలను పెంచడం, కస్టమర్లకు స్పెషల్ సర్వీసులను అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.


Click it and Unblock the Notifications








