చాలా రోజుల తర్వాత వెస్పా నుంచి కొత్త మోడల్స్.. ఈ స్కూటర్లు ఖరీదైనవే అయినా దమ్మున్నవి!

భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీలో.. విదేశీ కంపెనీల వాహనాలు కొన్ని చాలా పాపులర్ అయ్యాయి. అలాంటి వాటిల్లో ఒక కంపెనీ వెస్పా. ఇటలీకి చెందిన ఈ కంపెనీ స్కూటర్లు భారత కస్టమర్లను ఎన్నో ఏళ్లుగా విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు వినియోగదారులకు మరింత చేరువ కావడం కోసం ఈ స్కూటర్లో కొన్ని కొత్త మోడళ్లను తీసుకురానుంది. అధునాతన ఫీచర్లు జోడించి వీటిని అందుబాటులోకి తేనుంది. వాటి పూర్తి విశేషాలు ఇప్పుడు చూద్దాం. వెస్పా స్కూటర్లు భారత మార్కెట్లో ఖరీదైన స్కూటర్లుగా పేరుగాంచాయి. ఈ బ్రాండ్ నుంచి ఇతర స్కూటర్ల తరహాలోనే ఈ 2025 మోడళ్లలో కూడా మంచి ఫీచర్లు ఉండడమే కాకుండా కొత్త సాంకేతికతను ఈ సంస్థ వినియోగించింది.

ఈ కొత్త స్కూటర్‌ల ఎక్స్ షోరూం ధరలు రూ. 1.32 లక్షల నుంచి రూ.1.96 లక్షల మధ్య ఉన్నాయి. ఈ స్కూటర్లలో లోయర్ వేరియంట్‌ను మొదట పరిశీలిస్తే.. ఈ వెస్పా, వెస్పా ఎస్ స్కూటర్లు కొత్త గ్రాఫిక్స్‌తో, కొత్త ఇంజిన్స్‌తో అందుబాటులోకి వచ్చాయి. ఈ ఇంజిన్‌లు స్మూతర్ యాక్సిలరేషన్‌ను అందిస్తాయి. ఈ వెస్పా, వెస్పా ఎస్ స్కూటర్లు 125 cc, 150 cc ఇంజిన్లతో ఉంటాయి.

Vespa 2025 New Scooters

వీటి కలర్ ఆప్షన్స్ విషయానికి వస్తే.. సింగిల్ టోన్ పెయింట్ ఆప్షన్లతో ఉంటాయి. ఇవి Verde Amabile, Rosso Red, Pearl White, Nero Black, Azzurro Provenza, dual-tone paint options of Blue & Pearl White and Orange & Pearl White లతో లభిస్తాయి. వెస్పా ఎస్ స్కూటర్ మాత్రమే కొత్త oro special edition with gold tint తో ఉంటుంది.

అదేవిధంగా.. ఈ వెస్పా ఎస్ స్కూటర్లలో ఎక్స్ క్లూజివ్‌గా కొన్ని అదనపు కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ వెస్పా టెక్ స్కూటర్లు కాలా ఎడిషన్ పేరుతో వస్తాయి. దీంట్లో intricate artwork, సంప్రదాయ మెహందీ డిజైన్స్ ఉంటాయి. ఇక దీంట్లోనే టెక్నాలజికల్ ఫీచర్ల విషయానికొస్తే.. ఈ కొత్త వెస్పా స్కూటర్లలో TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ స్క్రీన్ ఉంటుంది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీ ని సపోర్ట్ చేస్తుంది.

Vespa 2025 New Scooters

ఈ వెస్పా టెక్ స్కూటర్.. నాలుగు కలర్ ఆప్షన్లతో ఉంటుంది. అవి Gala, Energico Blue and Grigio Grey. ఇక దీంట్లో వెస్పా టెక్ ఎస్ స్కూటర్ Nero Black and pearl White అనే రెండు కలర్ ఆప్షన్లతో ఉంటుంది. ఈ వెస్పా 2025 స్కూటర్లు ఫిబ్రవరి 25 నుంచి దేశంలోని ఆథరైజ్డ్ డీలర్‌షిప్ షోరూమ్లలో అందుబాటులో ఉంటాయి.

డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య: కొత్త మోడళ్లతో వెస్పా సంస్థ భారత మార్కెట్లోకి అడుగుపెడుతున్నప్పటికీ ఈ కొత్త స్కూటర్లు కూడా ఖరీదైనవనే చెప్పాలి. అలాగే ఈ వెస్పా స్కూటర్లు 10 ఏళ్లకు ఒకసారి అప్డేటెడ్ వెర్షన్లలో వస్తుంటాయి. కాబట్టి ఈ కొత్త స్కూటర్లను కొనడానికి ఇదే మంచి ఛాన్స్ అని చెప్పవచ్చు. ప్రీమియం స్కూటర్లు కొనేవారు దీనిని కళ్లుమూసుకుని ట్రై చేయవచ్చు.

Vespa 2025 New Scooters

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, February 11, 2025, 18:36 [IST]
English summary
Vespa 2025 new scooters is set to launch in india with impressive features mileage check all details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+