వెస్పా డిజైన్ అలాంటిది మరి.. ఆ స్కూటర్ మీద వెళ్తుంటే అందరి చూపు తప్పకుండా మీ మీదే ఉంటుంది
వెస్పా... ఈ పేరు వింటేనే మన మదిలో ఒక ప్రత్యేకమైన వైబ్రేషన్స్ మొదలవుతాయి. అందమైన ఒంపులతో, క్లాసిక్ డిజైన్‌తో ఉండే ఈ స్కూటర్ ఒక వాహనం మాత్రమే కాదు, ఒక లైఫ్ స్టైల్‌కు కేరాఫ్ అడ్రస్. ఇటలీలో జన్మించిన వెస్పా దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హృదయాలను గెలుచుకుంది.
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత రవాణా అవసరాలను తీర్చడానికి ఏరోనాటికల్ ఇంజనీర్ అయిన కొరాడినో డి'అస్కానియో ఆలోచన నుండి పుట్టిందే ఈ వెస్పా. విమానాల తయారీలో ఉన్న టెక్నాలజీను ఉపయోగించి, ఆయన ఒక వినూత్నమైన, సౌకర్యవంతమైన, అందమైన స్కూటర్‌ను రూపొందించారు. దాని రూపం తేనెటీగను పోలి ఉండటంతో దానికి "వెస్పా" (ఇటాలియన్‌లో తేనెటీగ) అనే పేరు వచ్చింది.

ప్రఖ్యాత ఇటాలియన్ స్కూటర్ బ్రాండ్ వెస్పా (Vespa), భారతీయ మార్కెట్‌ను ఓ ఊపు ఊపేందుకు సరికొత్త శ్రేణి స్కూటర్లను విడుదల చేసింది. బెంగళూరులో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో, పియాజియో ఇండియా (Piaggio India) తమ 2025 వెస్పా పోర్ట్‌ఫోలియోను ఆవిష్కరించింది.
ఈ సందర్భంగా పియాజియో వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2W డొమెస్టిక్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అజయ్ రఘువంశి మాట్లాడుతూ.. "బెంగళూరు మా లగ్జరీ స్కూటర్ బ్రాండ్‌కు ఎల్లప్పుడూ ప్రత్యేకమైన అభిమానాన్ని కలిగి ఉంది. మా లేటెస్ట్ 2025 వెస్పా పోర్ట్‌ఫోలియోను ఈ నగరానికి పరిచయం చేయడానికి మేము చాలా సంతోషిస్తున్నాము" అని అన్నారు.
2025 వెస్పా పోర్ట్‌ఫోలియోలో వివిధ రకాల వినియోగదారుల అభిరుచులను దృష్టిలో ఉంచుకుని అనేక మోడళ్లను రూపొందించారు. క్లాసిక్ స్కూటర్లను ఇష్టపడేవారి కోసం "వెస్పా, వెస్పా ఎస్", టెక్నికల్‌గా ఆధునిక డిజైన్‌ను కోరుకునేవారి కోసం "వెస్పా టెక్, వెస్పా ఎస్ టెక్", స్పెషల్ స్కూటర్ సొంతం చేసుకోవాలనుకునేవారి కోసం "వెస్పా క్వాలా" ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి.

2025 నుండి వెస్పా, వెస్పా ఎస్ కొత్త ఇంజన్‌తో పాటు సరికొత్త డిజైన్, రంగులను కలిగి ఉంటాయి. వెస్పా, వెస్పా ఎస్ వాటి క్లాసిక్ డిజైన్‌ను నిలుపుకుంటూనే, కొత్త తరం వినియోగదారులను ఆకర్షించేలా సూక్ష్మమైన మార్పులతో పూర్తిగా పునరుద్దరించారు.
వెస్పా, వెస్పా ఎస్ రెండూ 125cc, 150cc లలో కొత్త ఇంజన్‌లతో అందుబాటులో ఉన్నాయి. సాధారణ వెస్పా ప్రారంభ ధర రూ. 1,33,504 (ఎక్స్ షోరూమ్). వెస్పా ఎస్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 1,37,380 (ఎక్స్ షోరూమ్).
వెస్పా టెక్, వెస్పా ఎస్ టెక్: వెస్పా టెక్, వెస్పా ఎస్ టెక్ లేటెస్ట్ టెక్నాలజీ ఫీచర్లను కోరుకునే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. ఈ మోడళ్లు విభిన్నమైన డిజైన్‌తో, అనేక హై-ఎండ్ ఫీచర్లతో అందరి దృష్టిని ఆకర్షిస్తాయి.
125cc లేదా 150cc కొత్త ఇంజన్‌లను కలిగి ఉన్న వెస్పా టెక్, వెస్పా ఎస్ టెక్ కీ-లెస్ ఇగ్నిషన్ నుండి TFT స్మార్ట్ డాష్, బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ వంటి అన్ని ఆధునిక ఫీచర్లను కలిగి ఉన్నాయి. వీటితో పాటు, "వెస్పా టెక్" "వెస్పా క్వాలా" పేరుతో ఒక ప్రత్యేక ఎడిషన్ వెస్పాను కూడా అందిస్తుంది.
వెస్పా టెక్ 125cc, 150cc లలో అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ. 1,93,307 (ఎక్స్-షోరూమ్). వెస్పా S టెక్ 125cc మరియు 150cc శ్రేణిలో 2 మోనోటోన్ రంగుల ఎంపికలతో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 1,97,183 (ఎక్స్-షోరూమ్). కొత్త 2025 వెస్పా పోర్ట్‌ఫోలియో ఇప్పుడు కర్ణాటకలోని అన్ని వెస్పా డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








