తక్కువ ధరలో ఇంటర్నేషనల్ ఎలక్ట్రిక్ స్కూటర్స్..! స్టైలిష్ డిజైన్‌కు ఫిదా కావాల్సిందే..

న్యూఢిల్లీలో ఘనంగా నిర్వహిస్తున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో‌ కార్యక్రమంలో దేశీయ కంపెనీలే కాకుండా అంతర్జాతీయంగా ప్రసిద్ది చెందిన వాహన తయారీ కంపెనీలు తమ కార్స్, బైక్స్, ఇతర వాణిజ్య వాహనాలను ఆవిష్కరిస్తున్నాయి. ఈ క్రమంలో వియత్నాంలో ప్రసిద్ధ ఆటోమొబైల్ తయారీ సంస్థగా ఉన్నటువంటి విన్‌ఫాస్ట్ (Vinfast) ఇండియాలో జరుగుతున్న ఆటో ఎక్స్‌పో 2025లో తన వాహనాలను ప్రదర్శిస్తుంది. ఈ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కార్లు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ఇదే ఈవెంట్‌లో విన్‌ఫాస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లను కూడా ఆవిష్కరించింది. ఇవి చాలా అధునాతనంగా ఉన్నాయి. ఇండియాలో ఈవీలకు గతంతో పోలిస్తే డిమాండ్ బాగా పెరిగింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉండగా, ఇప్పుడు భారతీయ వినియోగదారులకు కోసం ఇక్కడకు తీసుకొచ్చింది. ఇవి పేద, మధ్య తరగతి వినియోగదారులు కొనే విధంగా అందుబాటులో ధరలోనే ఉంటాయని తెలుస్తోంది. ఈ ఇ స్కూటర్ల గురించి క్రింది కథనంలో తెలుసుకుందాం..

VinFast Theon S: ఈ స్కూటర్‌ డిజైన్ సరికొత్తగా, స్టైలిష్‌గా ఉంది. దీనిలో 3.5 కిలోవాట్ (kWh) బ్యాటరీ ప్యాక్‌‌ను కంపెనీ అందించారు. దీనిని పూర్తిగా ఛార్జ్ చేసినట్లయితే దాదాపు 150 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. దీంతో రోజువారి ప్రయాణాలు చేసే వారు ఈ ఇ స్కూటర్‌ను కొనుగోలు చేయవచ్చు. దీని టాప్ గంటకు 99 కి.మీల వరకు ఉంటుంది. సురక్షితమైన రైడింగ్‌ కోసం 2-ఛానల్ ABS ఉంది.

Vinfast Electric Scooters

VinFast Evo S: భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో‌లో రెట్రో లుక్‌‌ డిజైన్ కలిగిన ఈ ఇ స్కూటర్ ఆకర్షణీయంగా ఉంది. దీనిలో శక్తివంతమైన 3.5 కిలోవాట్ (kWh) బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఎల్లో కలర్ వేరియంట్ చూపరులను ఆకట్టుకుంటుంది. రోడ్లపై దీనితో ప్రయాణిస్తుంటే అందరి చూపు దీని మీదే ఉంటుంది. దీని ముందు హ్యండిల్ బార్‌లో రౌండ్ షేపులో హెడ్‌లైట్ డిజైన్ కొత్తగా అనిపిస్తుంది.

VinFast Feliz s: విన్‌ఫాస్ట్ ఫెలిజ్ ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 3.5 కిలోవాట్ (kWh) బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌ను అందించారు. దీన్ని పూర్తిగా ఛార్జ్ చేసినట్లయితే దాదాపు 198 కి.మీల వరకు ప్రయాణిస్తుంది. టాప్ స్పీడ్ 78 kmph గా ఉంది. ముందు హ్యాండిల్ బార్ సెటప్‌లో హెడ్‌లైట్ అందంగా ఉంటుంది. లగేజీ పెట్టడానికి దీనిలో 25-లీటర్ కెపాసిటీ అండర్-సీట్ స్టోరేజ్ కలిగి ఉంది.

Vinfast Electric Scooters Showcased Auto Expo

VinFast Klara S: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 3.5 కిలో వాట్ (kWh) బ్యాటరీ ప్యాక్‌తో ఇది సింగిల్ ఛార్జ్‌తో 120 కి.మీల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది ఇద్దరు పెద్ద వారు, ఒక బిడ్డ కలిసి ప్రయాణించడానికి అనువుగా ఉంటుంది. అండర్ సీటు స్టోరేజ్‌తో పాటు ముందు సామాన్లు పెట్టుకోడానికి సౌకర్యవంతంగా ఉంది.

VinFast Vento S: విన్‌ఫాస్ట్ వెంటో ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 3.5 కిలోవాట్ (kWh) బ్యాటరీ ప్యాక్‌ అమర్చారు. దీనిని పూర్తి ఛార్జింగ్ చేయడానికి దాదాపు 6 గంటల వరకు సమయం పడుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 89 కి.మీలుగా ఉంది. రైడింగ్‌లో సురక్షితమైన ప్రయాణం కోసం ఇది డిస్క్ బ్రేక్‌తో వస్తుంది.

Vinfast Electric Scooters Showcased In Bharat Mobility Global Expo

ఆటో ఎక్స్‌పోకి సంబంధించిన లైవ్‌ అప్‌డేట్స్‌ కోసం మా డ్రైవ్‌స్పార్క్‌ సోషల్‌ మీడియా పేజీలను ఫాలో అవ్వండి. మా తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు.

More from DriveSpark

Article Published On: Monday, January 20, 2025, 17:40 [IST]
English summary
Vinfast electric scooters showcased in bharat mobility global expo 2025 check all details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+