స్మార్ట్ ఫోన్ డబ్బులతో బైక్ కొనుగోలు చేయొచ్చు.. సగం ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్.. మైలేజీ కూడా అదుర్స్
ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ఉందా? అయితే మీకో బంపర్ ఆఫర్. హీరో విడా అదిరిపోయే ఆఫర్‌తో మీ ముందుకు వచ్చింది. ఏకంగా రూ.30,000 వరకు తగ్గింపు అందిస్తోంది. మీ జేబుకు చిల్లు పెట్టకుండా స్టైలిష్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను స్మార్ట్ ఫోన్ ధరకే ఇంటికి తెచ్చుకునే అద్భుత అవకాశం అందిస్తుంది. ఈ సూపర్ ఆఫర్ వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
మనదేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్లకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. టీవీఎస్, బజాజ్ వంటి ప్రముఖ వాహన తయారీదారులు ఈ సెగ్మెంట్‌లో దూసుకుపోతుండగా, హీరో మోటోకార్ప్ తన 'హీరో విడా' సబ్-బ్రాండ్‌తో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే ఇప్పుడు ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించేందుకు హీరో విడా తన V2 ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణిపై ఏకంగా రూ.30,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది.

ఈ నెలలో ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఆకర్షణీయమైన ఆఫర్ ఉన్న విషయాన్ని కంపెనీ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. అయితే ఈ ఆఫర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను కంపెనీ వెల్లడించలేదు. ఇది కొన్ని నిబంధనలకు లోబడి ఉంటుందని సూచించింది. ఆసక్తి ఉన్న వినియోగదారులు మరింత సమాచారం కోసం తమ సమీపంలోని హీరో విడా డీలర్‌షిప్‌ను సంప్రదించగలరు.
హీరో విడా V2 సిరీస్ V2 లైట్, V2 ప్లస్, V2 ప్రో అనే మూడు వేరియంట్‌లలో ఈ ఆఫర్‌తో అందుబాటులో ఉంది. లుక్ విషయానికి వస్తే, విడా V2 సిరీస్ దాని మునుపటి మోడల్‌ను పోలి ఉంటుంది. మాట్ నెక్సస్ బ్లూ-గ్రే, గ్లోసీ స్పోర్ట్స్ రెడ్ వంటి కొత్త రంగులను చేర్చడంతో ఇది సమకాలీన రూపాన్ని కలిగి ఉంది.

అందుబాటు ధరలో లభించే విడా V2 లైట్ ఒక ఫుల్ ఛార్జ్‌పై 94 కిలోమీటర్ల వరకు ప్రయాణించగల 2.2 kWh బ్యాటరీని ఉపయోగిస్తుంది. ఇది హై-ఎండ్ స్కూటర్లలో కనిపించే 7-ఇంచుల TFT టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే వంటి ఫీచర్లను కూడా అందిస్తుంది. V2 లైట్ గంటకు 69 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని చేరుకోగలదు.
సిటీ రైడ్‌ల కోసం రైడ్, ఎకో మోడ్‌లతో వస్తుంది. V2 ప్లస్, V2 ప్రో మోడల్‌లు వరుసగా 3.44 kWh, 3.94 kWh బ్యాటరీ ప్యాక్‌లతో వస్తాయి, కాబట్టి అవి ఎక్కువ రేంజ్‌ను అందిస్తాయి. V2 ప్లస్ వేరియంట్ 143 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను కలిగి ఉందని కంపెనీ పేర్కొంది.

అదే సమయంలో V2 ప్రో వేరియంట్ ఒకే ఛార్జ్‌పై 165 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. ఈ రెండు మోడళ్లలోనూ కంపెనీ రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్‌లను అందించింది. దాదాపు ఆరు గంటల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేయగలగడం వినియోగదారులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
స్వింగార్మ్‌కు అమర్చిన PMS మోటార్ V2 మోడళ్లకు శక్తినిస్తుంది. ఇది 6 kW (8 bhp) పవర్‌ను, 26 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డిఫరెంట్ రైడింగ్ ప్రాధాన్యతలను తీర్చడానికి V2 ప్లస్, ప్రో మోడళ్లలో ఎకో, రైడ్, స్పోర్ట్, కస్టమ్ అనే నాలుగు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి.

ప్లస్ గంటకు 85 కిలోమీటర్ల వరకు, ప్రో గంటకు 90 కిలోమీటర్ల వరకు వేగంతో వెళ్లగలదని తయారీదారులు పేర్కొంటున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లకు 5 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల ప్రామాణిక వారంటీ ఉంది. అలాగే బ్యాటరీ ప్యాక్‌లకు 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల వరకు రక్షణ లభిస్తుంది.
రైడింగ్ ఎక్సీపీరియన్స్ మెరుగుపరచడానికి క్రూయిజ్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, రీజనరేటివ్ బ్రేకింగ్ వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 250 కంటే ఎక్కువ నగరాల్లో విస్తరించి ఉన్న 3,100 కంటే ఎక్కువ చార్జింగ్ స్టేషన్‌ల విస్తృత నెట్‌వర్క్ ద్వారా విడా తన వినియోగదారులకు మంచి సపోర్టును అందిస్తోంది.

ఏథర్ రిస్టా, టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్ వంటి ప్రముఖ స్కూటర్లతో పోటీ పడుతున్న ఈ స్కూటర్‌కు ఇటీవల ఆంపియర్ నెక్సస్ విడుదల చేసిన హోండా యాక్టివా ఇ: కూడా గట్టి పోటీనిస్తోంది. యాక్టివా ఎలక్ట్రిక్ కూడా విడా V2 మోడల్‌ల మాదిరిగానే రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది.
హీరో విడా ఈ ఆఫర్ ఈ విషు కాలం(కేరళలో జరుపుకునే పండుగ)లో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనాలనుకునే వారికి ఒక గొప్ప అవకాశం. విస్తృతమైన ఫీచర్లు, సమగ్రమైన చార్జింగ్ నెట్‌వర్క్‌తో కూడిన వివిధ రకాల మోడళ్లతో, కాంపిటేటివ్ ధరలో లభించే విడా ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదాలకు బెస్ట్ ఆఫ్షన్లలో ఒకటిగా నిలుస్తుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








